DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచ ఖ్యాతి గాంచిన భారతీయ మేధా సంపత్తి సీవీ రామన్ 

రామన్ ఎఫెక్ట్ వెలుగు చూసిన రోజే జాతీయ సైన్స్ దినోత్సవం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రపంచ ఖ్యాతి

గాంచిన భారతీయ మేధాసంపత్తి సీవీ రామన్.  à°†à°¯à°¨ తన మేధా సంపత్తిని రామన్‌ ఎఫెక్ట్‌ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన రోజు ఫిబ్రవరి 28 ,1928.  à°† రోజును ఆయన గౌరవార్ధం జాతీయ

సైన్స్ దినోత్సవంగా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ రూపు దాల్చిన సందర్భంగా జరుపుకుంటారు.

వర్ణకాంతి ప్రకటితమైన రామన్ ఎఫెక్ట్ : 

"ఏక వర్ణకాంతి,

వస్తువుపై పడి పరిచ్ఛేదనం చెందినపుడు బహిర్గత కాంతిలో ఎక్కువ తీవ్రత మరియు తక్కువ తీవ్రత గల్గిన రేఖలు ఏర్పడుతాయి. హెచ్చు తీవ్రత గల్గిన రేఖలను "స్టోక్ రేఖ"

లనీ, తక్కువ తీవ్రత గల్గిన రేఖలను ప్రతి లేదా "వ్యతిరేక స్టోక్" రేఖలనీ అంటారు. ఇటువంటి దృగ్విషయాన్ని "రామన్ ఫలితము" అంటారు. ఇక్కడ జరిగే పరిచ్ఛేదనాన్ని రామన్

పరిచ్ఛేదనం లేదా రామన్ స్కేటరింగ్ అంటారు. 

ఈ దృగ్విషయాన్ని సర్.సి.వి. రామన్ ఫిబ్రవరి 28వ తేదీన వెలుగులోకి తేవడం చేత ఫిబ్రవరి 28వ తేదీని "జాతీయ విజ్ఞాన

శాస్త్రదినము"గా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజును "రామన్స్ డే" అని గూడ అంటారు. ప్రపంచం నలుమూలల రామన్ పేరు మారుమోగిపోయింది.

ఆ రోజున అన్ని ప్రభుత్వ జాతీయ

విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థలలోకి ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండానే సందర్శనకు అనుమతినిస్తారు. 

ఈయన పరిశోధన 1930వ సంవత్సరం లో ప్రతిస్ఠాత్మకమైన నోబెల్

బహుమతి రామన్ కు అందించింది. అందుకే ఆ రోజున ఫిబ్రవరి 28వ తేదీన దేశం నలుమూలల వైజ్ఞానిక సదస్సులు, చర్చాగోస్టులు, జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహా సమావేశాలు,

విజ్ఞానశాస్త్ర ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసే సంబరాలు అంబరాన్ని అంటడం ప్రతి యేడాది ఆనవాయితీ. ముఖ్యంగా ప్రతి విద్యార్తి స్రుజనాత్మకంగా అలోచింపజేసెతత్వాన్ని

ప్రొత్సహించటమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

రామన్ ఫలితము – అనువర్తనాలు (ఉపయోగాలు)
* అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు.
*

రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
* అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు

రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.
* కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు

కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.
* మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.
* వాహాకాలు, అర్థవాహకాలు, అతి

వాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.
* మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.
* à°¡à±€

ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.
* మధుమేహం,

కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.
* వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని

గుర్తించవచ్చు.
* జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు.
* ప్లాస్టిక్కులలో

రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.
* కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం

చేయవచ్చు.
చివరగా
సైన్సు ఒక జీవన విధానం. సైన్సు మనకు ఎమి తెలియని అయోమయస్తితి నుండి , నిర్దిస్టమైన అవగాహన దిశగా , ఖచ్చితమైన , విశ్వసనీయమైన మార్గం గుండా

తీసుకొనిపోతుందని అనటంలో ఏలాంటి సందేహం లేదు. .ఫ్రస్తుత ప్రపంచంలో ఏ దేశమైన ఆర్థిక , సమాజిక , పారిశ్రమిక అభివృద్ధి అనేది ఆ దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో

మాత్రమే కొలమానంగా పరిగనించ బడుతుంది . అందుకే నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ఒక కొలమానం గా మారిది. నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అననేది ప్రగతికి

చిహ్నం .
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రామన్ తన ప్రయోగానికీ అయిన ఖర్చు కేవలం 150 రూపాయలు మాత్రమే . ఇంత తక్కువ ఖర్చుతో ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రావటం అనేది

ఇంత వరకు జరుగలేదు , భవిష్యత్తులో కూడ జరగదు. తనకు వచ్చిన డబ్బుతో భారతదేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం అయిన భారతీయ విజ్ఞాన సంస్థానం' (Indian Institute of science) కొరకు ఇవ్వటం

జరిగింది. ఇల ఎందరో మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో మన దేశ ఎనలేని కీర్తి ప్రతిష్టలతో దేశ కీర్తిని స్టలను విశ్వవ్యాప్తం చేశారు.

విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం

భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam