DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఫోన్ లోనే మంత్రాంగం, ఆదేశాలు, సింహాచలం చైర్మన్  ప్రమాణ స్వీకారం 

ఇదీ సింహాచలం దేవస్థానం లో హైడ్రామా 

దేవస్థాన వైభవానికి మాయని మచ్ఛే ఇది : టిడిపి 

బీజేపీ సభ్యురాలికి వైకాపా పెద్దపీట - రాజకీయ అస్త్రం. . .

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, మార్చి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం లోని సింహాచల క్షేత్ర వైభవానికి మచ్చతెచ్చే విధంగా దేవస్థానం చైర్మన్ (

ధర్మకర్త ) గా సంచయిత గజపతిరాజు ను నియమిస్తూ మంగళవారం అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం, తెల్లవారగానే ఆమె భాద్యతలు చేపట్టడం సంచలనం గా మారింది. ఈ చర్యపై

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ప్రస్తుతం ఆలయానికి అనువంశక ధర్మకర్తగా కొనసాగుతున్న అశోక్ గజపతిరాజు ( తెలుగుదేశం పార్టీ సభ్యులు) ను రాత్రికి

రాత్రి బయటకు పంపిస్తూ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా రాజకీయ కక్షే అని టిడిపి ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్ మండిపడ్డారు.  

కేవలం ఫోన్ లో ఆదేశాలు :.

మంగళవారం రాత్రి దేవాదాయ శాఖా కమిషనర్ కార్యాలయం నుంచి సింహాచల దేవస్థానం ఈఓ లో కేవలం ఫోన్ లో వచ్చిన ఆదేశాల మేరకు బుధవారం ఉదయం సంచయిత గజపతి రాజు తో ఈఓ

ప్రమాణ స్వీకారం చేయించడం వివాదంగా మారింది. 
వాస్తవానికి సింహాచల ఆలయానికి 16 మందితో కూడిన కమిటీని ఇటీవలే ప్రభుత్వం నియమించింది. వీళ్ళు గత శనివారం భాద్యతలు

చేపట్టవలసి ఉంది. అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చేపట్టిన నిర్ణయం ప్రకారం ఈ కమిటీని నిలుపుదల చేస్తూ సంచయితను చైర్మన్ గా నిర్ణయం తీసుకుంది.

కోర్టు ఆదేశాల ప్రకారం విజయనగరం పూసపాటి రాజుల వంశస్థుల కుటుంబాల వారే చైర్మన్ గా ఉండాల్సి యుంది. ప్రస్తుతం ఆ వంశస్తుల్లో అధికార పార్టీ వారు లేకపోగా

చైర్మన్గా ఉన్న అశోక్ గజపతి అధికార పార్టీకి బద్ద విరోధి అయినా ప్రతిపక్ష పార్టీ à°•à°¿ చెందిన వారు కావడంతో వీళ్ళు తర్జన భర్జన పడ్డారు. 

అంతే భారతీయ జనతా

పార్టీ à°•à°¿ చెందిన సంచయితను సంప్రదించి, à°°à°‚à°—à°‚ లోకి దించారు. 

పదవి పేరిట కుటుంబంలో కుంపటి రగిల్చారు : టిడిపి. . .

అధికార దాహంతో కొట్టుమిట్టాడుతున్న

వైఎస్సార్ కాంగ్రెస్, పదవి ఆశ చూపించి ఏంటో ప్రతిష్ఠా కల్గిన విజయనగరం పూసపాటి రాజుల కుటుంబంలో చిచ్చు పెట్టారని తెలుగుదేశం మండిపడింది. వీరికి నిజంగా చైర్మన్

ను మార్చాలి అనుకుంటే అశోక్ గజపతి రాజులు పదవిని తృణప్రాయంగా వదిలేసేవారన్నారు. అయితే ఆయన్ను ఇలా అవమానించడం ఆలయ సంప్రదాయానికి మచ్చ తీసుకు వచినట్టేనని ఆవేదన

వ్యక్తం చేస్తున్నరు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam