DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు అవసరం  

*కార్మికుల పరిరక్షణకు మెరుగైన చర్యలు చేపట్టాలు*  

*కార్మిక శాఖా ముఖ్య కార్యదర్శి బి. ఉదయలక్ష్మి సూచన* 

*ఉత్తరాంధ్రలో పరిశ్రమల్లో చేపట్టే సేఫ్టీ

విధానాలపై కార్యశాల* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 9 ,2020 (డి ఎన్ ఎస్) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేట్ రంగ పరిశ్రమల్లో

జరుగుతున్నా ప్రమాదాలను నివారణకు, సంస్థలో రక్షణ చర్యలు మరింత కట్టుదిట్టం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖా ముఖ్య కార్యదర్శి బి. ఉదయలక్ష్మి

సూచించారు. జాతీయ సేఫ్టీ వారోత్సవాల్లో రక్షణ దినోత్సవం సందర్బంగా విశాఖపట్నం లోని ద్వారకానగర్ లోగల పౌర గ్రంధాలయంలో నిర్వహించిన ఉత్తరాంధ్రలో పరిశ్రమల్లో

చేపట్టే సేఫ్టీ విధానాలపై కార్యశాల కు ఆమె ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, అయితే వాటిని

సమర్ధవంతంగా ఎదుర్కొనే విధి విధానాలను అందరికి తెలియచేసేందుకు à°ˆ సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  à°µà°¿à°¶à°¾à°–పట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని

తొమ్మిది  à°ªà±à°°à°®à±à°– పరిశ్రమలకు చెందిన అధికారులు à°ˆ సదస్సులో పాల్గొన్నారన్నారు. ఆయా సంస్థల్లో వారు చేపడుతున్న రక్షణ చర్యలను అందరితోనూ పంచుకోవడం

జరుగుతుందన్నారు. తద్వారా ఇతర సంస్థల వారు సైతం అందనపు సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానంగా పరిశ్రమల్లో కీలక విభాగాల్లో పనిచేసే కార్మికులకు

రక్షణ కిట్ లను అందించాలని, అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు వీలుగా ప్రతి విభాగం లోనూ అగ్నిమాపక సామాగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. కార్మికులు విడి

నిర్వహణలో ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు సంస్థలు పూర్తి భాద్యత వహించాలన్నారు. ఈ ఎస్ ఐ ద్వారా కార్మిక వైద్య సదుపాయాలను తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని

సూచించారు. ప్రతి పరిశ్రమలోనూ వాళ్ళు పాటించే సేఫ్టీ విధానాలను అందరికి తెలియచేయడం కోసం ఈ సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. కార్మిక విధానాలు, ఉద్యోగ సమస్యలు,

విధి నిర్వహణలో విధి విధానాలు అమలు చేసే ప్రక్రియ, నిబంధనలు అందరితో పంచుకోవడం జరుగుతుంది. 
ఈ సదస్సులో విశాఖ నగరానికి చెందిన హిందూస్తాన్ పెట్రోలియం

కార్పొరేషన్ లిమిటెడ్ ( విశాఖ్ రిఫైనరీ) ప్రతినిధులు, సహా ఇతర కేంద్ర ప్రభుత్వ à°°à°‚à°— పరిశ్రమల ప్రతినిధులు  à°ªà°¾à°²à±à°—ొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam