DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా విశాఖ మేయర్ పీఠం బీజేపీ - జననసేన కూటమిదే,  ఎమ్మెల్సీ మాధవ్

*ఆంధ్రా అభివృద్ధి కోసమే కమల దళం - జన సైనికులు కవాతు* 

*రాష్ట్ర అభ్యున్నతి కోసమే కలిసి నడుస్తున్నాం:  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ మాధవ్*

*అధికార కుట్రతోనే ఎన్నికల జీవో

: మాజీ ఎమ్మెల్యే విష్ణు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .*

విశాఖపట్నం, మార్చి 10 ,2020 (డి ఎన్ ఎస్) : విశాఖ మహా నగర మేయర్ పీఠాన్ని బీజేపీ - జనసేన కూటమి

దక్కించుకుంటుందని భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పి వి ఎస్ మాధవ్ తెలిపారు.  

మంగళవారం విశాఖ నగరంలోని బిజెపి నగర కార్యాలయంలో ఇరు పార్టీలు

సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తిస్థాయి

కసరత్తు జరిగిందని తెలిపారు.  à°•à°®à°²à°¦à°³à°‚ - జనసైనికులు కలిసి కవాతు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని ప్రకటించారు.  à°—తంలో

దశలవారీగా ఇరు పార్టీలు కలిసి పని చేశాయని అయితే ఈ పర్యాయం కేవలం స్థానిక ఎన్నికలకు ఈ కోట పరిమితం కాదని భవిష్యత్తులో జరిగే ప్రతి ఉద్యమంలోనూ కలిసి నడుస్తామని

తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా పరిపాలనకు కంటక పరిపాలనకు అడ్డుకట్ట వేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ తొలి అడుగు వేసి బిజెపి కేంద్ర

అధిష్టానానికి à°’à°• ఆహ్వానాన్ని పంపారన్నారు.  à°ˆ క్రమంలో విస్తృతంగా జరిగిన మధ్య రాష్ట్ర అభివృద్ధి కార్యాచరణకు తొలి శ్రీకారం à°—à°¾ రెండు పార్టీలు కలిసి స్థానిక

ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రారంభం కావాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం వన్ ఎన్నో పథకాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం అడుగులు వేసింది మండిపడ్డారు.  à°—్రామ స్వరాజ్యం

కోసం పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి పరుస్తామన్నారు. 

జనసేన ప్రధాన కార్యదర్శి శివ శంకర్ మాట్లాడుతూ

తాము రాష్ట్ర అభ్యున్నతికోసమే 2014 లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ప్రకటించామని తెలిపారు. అయితే గెలిచినా తదుపరి టిడిపి స్వార్ధ పూరిత రాజకీయాలను

చెయ్యడంతో తాము కూటమి నుంచి బయటకు వచ్చామన్నారు. ప్రస్తుతం ఏర్పడిన కూటమి రానున్న కాలంలో మరిన్ని అడుగులు కలిసి వేస్తుందన్నారు. 

అధికార కుట్రతోనే ఎన్నికల

జీవో : మాజీ ఎమ్మెల్యే విష్ణు 

రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రతోనే ఎన్నికల జీవో ను తీసుకు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్

రాజు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం లో డబ్బులు పంచకూడదని, మద్యం పంపిణీ చెయ్యకూడదు అనే నిబంధనను తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఈ జీవో కు మరొక కుట్ర ను కూడా

చర్చారన్నారు. కేవలం ఐదుగురు మనుషులు ఫిర్యాదు చేస్తే అభ్యర్థుల నామినేషన్ రద్దు చేసే విధంగా జీవో ను విడుదల చెయ్యడం క్షమించరాని నేరమన్నారు. ఈ నిబంధన ప్రకారం

అధికార పార్టీ పూర్తిగా కుట్రలకు పాల్పడి ప్రత్యర్థులపై కేసులు పెట్టేందుకు పూర్తిగా స్వేచ్ఛనిచేశారన్నారు. దీంతో పోటీ చేసే అభ్యర్థులను భయపెట్టి,

బెదిరించి, అసలు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండానే చేస్తున్నారని, ఒకవేళ పోటీ చేసినా ఈ జీవో నిబంధన అంటూ కొందరితో దొంగ ఫిర్యాదులు చేయించి ప్రత్యర్థి పోటీని

అనర్హత గా తేల్చేందుకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోందన్నారు. ఈ వైకాపా ఎన్నికల కుట్రలను జనసేన తో కలిసి సమర్ధవంతంగా భగ్నం చేస్తాం అని

తెలిపారు.

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇరు పార్టీల సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులు సమావేశమై మహా విశాఖ నగర మునిసిపల్

కార్పొరేషన్ పరిధిలోని 98 వార్డులలో పోటీ చేసే ఇరు పార్టీ ల అభ్యర్థులను ఖరారు చెయ్యడం జరుగుతుందన్నారు. అదే విధంగా జిల్లాలోని ఎంపిటిసి, జె డి పిటిసి పోటీదారుల

ఎంపిక కూడా జరుగుతుందన్నారు.   

à°ˆ సమావేశంలో  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ తరపున విశాఖ నగర అధ్యక్షుడు రవీంద్ర, రాష్ట్ర కార్యదర్శి సాగి కాశీవిశ్వనాధ రాజు, అధికార

ప్రతినిధి సుహాసిని ఆనంద్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కెవివి సత్యనారాయణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.   

జనసేన ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్,

కోన తాతారావు, పి ఉష కిరణ్, రఘు, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam