DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్ట్ లకు రక్షణ సూట్ ఇవ్వాలి : డా. కూటికుప్పల.

*ఆరోగ్యవంతులకు మాస్కులు అవసరం లేదు డా. సుధాకర్*

*సభ్యుల సంక్షేమమే మా లక్ష్యం: విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 20 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°¨à°¿à°°à°‚తరం ప్రమాదకాలమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించే పాత్రికేయులకు రక్షణ సూట్ ( సేఫ్టీ సూట్) లు ఇవ్వాలని డాక్టర్

కూటికుప్పల సూర్యారావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై అవగాహన, జర్నలిస్టులకు మాస్కుల పంపిణీ కార్యక్రమం

నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సమాజంలో ఏ కారక్రమం జరిగినా ముందస్తుగా అక్కడకు చేరుకునేది పాత్రికేయులు, ఆ తర్వాతే సంబంధిత

అధికారులున్నారు. అదే విధంగా చైనాలో కరోనా వైరస్ పై సమాజానికి సమాచారాన్ని ముందస్తు గా అందించిన వారు కూడా పాత్రికేయులేనన్నారు. ప్రస్తుతం ఆ వైరస్ వ్యాప్తి

నిరోధకానికి కూడా కృషి చేస్తున్న వారిలో పాత్రికేయులు కూడా ఉండడం గమనార్హం అన్నారు. అలంటి వీరికి రక్షణ చాలా అవసరం అన్నారు. కార్యక్రమం లో పాల్గొన్న ఆంధ్రా

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా మహమ్మారిని సులభతరంగా నివారించవచ్చనని తెలిపారు.

ప్రతి ఒక్కరు కరోనా పై అప్రమత్తంగా వుండాలన్నారు. అయితే ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆరోగ్యవంతులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్నారు.

అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని, ఏమాత్రం జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు

జీవీఎంసీ

ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె ఎస్ ఎల్ జి శాస్త్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలన్నారు. జర్నలిస్టులు కూడా మాస్కులు లేకుండా ఎవరి

ఇంటర్వ్యూలు తీసుకోరాదన్నారు. ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. జర్నలిస్టులు అందరూ ఒకేచోట కాకుండా విడివిడిగా కార్యక్రమాలకు

హాజరు కావాలన్నారు. చేతులను పరిశు భ్రంగా వుంచుకోవాలని పిలుపునిచ్చారు. విదేశాల నుంచి నగరానికి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా వుండాలని కోరారు. వైద్యరంగ

పరిశోధకులు, పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు మాట్లాడుతు ప్రధాని మోడీ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. మోడీ వేసిన జనతా కర్ఫ్యూ

అణుబాంబుతో కరోనా దూరం కానుందన్నారు. గతంలో ఎయిడ్స్ విషయంలో కూడా అనేక భయాందోళనలు నెలకొన్నాయని అయితే మీడియా సహకారంతో ఊహించిన దానికంటే తీవ్రత తగ్గుముఖం

పట్టిందన్నారు. కరోనాకు కూడా కొన్ని చోట్ల అవసరమైన మందులు వినియోగం లోకి తీసుకురావడం జరిగిందన్నారు. సింగపూర్, థాయిలాండ్ లో కొన్ని మందుల వల్ల ఇటువంటి వైరస్

బారిన పడిన సుమారు 15మందిని ఆఖరి నిమిషంలో రక్షించుకోగలిగారన్నారు. ప్రస్తుతం కొన్ని మందులు అందుబాటులోకి వస్తున్నాయని అయితే వీటిని అమెరికా పరిశోధనా సంస్థలు

పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి అందుబాటులోకి తెచ్చే అవసరముందన్నారు. ప్రజలు భయాందోళన చెందకుండా ఇళ్లలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ క్వారంటైన్ సెల్ లు

ఏర్పాటుచేసుకోవాలన్నారు. వీలైనంతమేరకు సభలు, సమావేశాలు, శుభకార్యాలు వాయిదా వేసుకుని ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపీ పవర్ డిప్లమో

ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వివి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం జర్న లిస్టుల కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు

నిర్వహించడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షులు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తమకు సభ్యుల సంక్షేమమే ముఖ్యమన్నారు.

జర్నలిస్టులకు అవసరమైన మాస్కులను ప్రెస్ క్లబ్ లో అందుబాటులో అవసరమైన మాస్కులను ప్రెస్ క్లబ్ లో అందుబాటులో వుంచుతామన్నారు. వీజెఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి

దుర్గారావు మాట్లాడుతూ కరొనా వైరస్ నివారణకు వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకుని కరోన పట్ల జాగ్రత్త గావుండాలని

పిలుపునిచ్చారు. వీజేఎఫ్ ఉపాధ్యక్షులు ఆర్ నాగరాజు పట్నాయక్, జాయింట్ సెక్రెటరీ దాడి రవికుమార్, కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, గయాజ్, శేఖర్ మంత్రి, పి

వరలక్ష్మి, పెద్ద ఎత్తున ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam