DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 న జనతా కర్ఫ్యూ,  ఆలయాలు, బజారులు మూసివేత 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 20, 2020 (డి ఎన్ ఎస్) : శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండే విధంగా దేశ

ప్రధాని నరేంద్ర మోడి పిలుపు మేరకు ఆదివారం జిల్లాలో జనతా కర్ఫ్యూ పాటిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఇందులో భాగంగా ఆదివారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి

వారి ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రకటించారు. ఆది వారం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కరోనా

వ్యాప్తికి అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భక్తులు ఎవరు రావద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని వర్గాలు సహకరించాలని

పిలుపునిచ్చారు. జిల్లాలో కరోనా వైరస్ సోకకుండా సమరం సాగిస్తున్నామని, అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. జనతా కర్ఫ్యూ లో భాగంగా ఆదివారం రైతు

బజార్లు మూసివేస్తున్నామని., వారం రోజులపాటు సినిమా హాళ్ళు మూసివేస్తున్నామని ప్రకటించారు. జన సంద్రంగా ఉండే అన్ని ప్రాంతాలు మూసివేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలు ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచించారు. ప్రజలు, ప్రయాణీకులు, భక్తులు సురక్షిత చర్యలు తీసుకోవాలని కోరారు. 

కరోనా కంట్రోల్ రూమ్ – విదేశాల నుండి

వచ్చే వారి వివరాలు ఇవ్వాలి : 

విదేశాల నుండి జిల్లాకు వచ్చేవారు తమ వివరాలు కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. విదేశాల నుండి వచ్చే వారి

వివరాలు తెలిసిన వారు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 9491222122, 08942 240699 ఫోన్ నంబర్లకు తెలియజేయవచ్చని చెప్పారు. కరోనా వైరస్ స్ధితిపై

ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు జిల్లా ఉపాధికల్పన అధికారి జి.శ్రీనివాసరావును ప్రత్యేక అధికారిగా నియమించామని చెప్పారు. విదేశాల నుండి వచ్చే వారు విధిగా స్వీయ

గృహ నిర్భందంలో ఉండాలని ఆయన స్పష్టం చేసారు. బయటకు తిరిగితే ఐపిసి సెక్షన్ 188 క్రింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్సు

ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు. విదేశాల నుండి వచ్చే వారి నిర్లక్ష్యం వలన జిల్లాలోని 28 లక్షల మంది జనాభాను ప్రమాదకర పరిస్ధితుల్లో పెట్టలేమని ఆయన స్పష్టం చేసారు.

ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలని కోరారు. విదేశాల నుండి వచ్చి వారు తమ ఇళ్ళల్లో ప్రత్యేక గదుల్లో ఉండాలని, ప్రత్యేక గదులు లేనప్పుడు ఉన్న స్ధలంలో ప్రత్యేక

ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.   

విద్యార్ధులు, యువత జాగ్రత్త : 

కరోనా వ్యాధి వ్యాప్తి నివారణలో భాగంగా విద్యాసంస్ధలకు సెలవులు ప్రకటించడం

జరిగిందని, సాధారణ సెలవులుగా తీసుకుని బయట తిరిగరాదని కలెక్టర్ కోరారు. ఇతరులతో కలవడం వలన కరోనాకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ కాంటాక్టు ఉండరాదని

సెలవులు ప్రకటించడం జరిగిందని అన్నారు. ఇళ్ళ వద్దనే పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం, శానిటైజర్లు

వినియోగించడం, మంచి నీటిని తాగడం చేయాలని సూచించారు. ప్రయాణాలు పెట్టుకోవద్దని అన్నారు. మాట్లాడేటపుడు దూరం పాటించాలని అన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam