DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా నుంచి కాపాడుకోవడంపై అవగాహన పెంచండి

*జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలి : జనసేనాని  à°ªà°µà°¨à±* 

*ప్రధాని నరేంద్ర మోదీ  à°¸à±‚చనలు పాటించాలి* 

*కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు అమలు కావాలి*  

*(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 21 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా నుంచి కాపాడుకోవడంపై అవగాహన పెంచాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

పిలుపునిచ్చారు. జనసేన నాయకులతో టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి మనకు మనమే నియంత్రణలు విధించుకొని వైద్య

నిపుణులు చెప్పిన విధానాలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ మహమ్మారి మానవాళిపై విరుచుకుపడుతున్న తీరుపై ఉన్న గణాంకాలు ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నాయి అన్నారు.

కరోనా నియంత్రణపై ప్రజలందరికీ అవగాహన కలిగించడం సామాజిక బాధ్యతగా భావించాలి అని జనసేన నాయకులకు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం పార్టీ నాయకులతో టెలీ

కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. à°ˆ వ్యాప్తిని నిరోధించే క్రమంలోనే మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

 à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ ఉదయం 7 à°—à°‚. నుంచి రాత్రి 9 à°—à°‚. వరకూ జనతా కర్ఫ్యూ  à°ªà°¾à°Ÿà°¿à°‚చాలని పిలుపునిచ్చారు. à°ˆ కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎవరికి వారు స్వచ్ఛందంగా à°ˆ కర్ఫ్యూలో

పాల్గొని ఇంట్లోనే ఉండేలా మన నాయకులు, శ్రేణులు అందరికీ అవగాహన కల్పించాలి. ఈ వైరస్ కు ఇప్పటి వరకూ ఇంకా మందు కనిపెట్టలేదు. ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు

పాటించడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండం లాంటివి అవసరం. ప్రధాని చేసిన సూచనలు అందరూ పాటించాలి. అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన

మార్గదర్శకాలు అమలు చేయాలి. 
కరోనా మహమ్మారి ప్రమాదకరం అని తెలిసీ ప్రాణాలుపణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది,

à°† విభాగంలో పని చేస్తున్నవారు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు  à°‡à°‚à°Ÿà°¿ బయటకు వచ్చి

కరతాళ ధ్వనులు ద్వారానో, à°—à°‚à°Ÿà°¾ నాదం ద్వారా మన కృతజ్ఞత చెప్పుకొందాం. à°ˆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి” అన్నారు. 

సామాజిక బాధ్యతగా భావించండి:

నాదెండ్ల మనోహర్  

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఇదొక విపత్కర సమయం. à°ˆ దశలో మనందరం à°’à°• సామాజిక బాధ్యతగా కరోనా నుంచి

విముక్తి పొందే దిశగా పని చేయాలి. దీనిపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. మన అధ్యక్షులు  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రమాదకర పరిస్థితులు నెలకొంటే

రాష్ట్ర  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ స్థానిక ఎన్నికల కోసమే ప్రయత్నించింది. అప్రమత్తతతో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలి” అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam