DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయం - జాతి ఐక్యతకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం

*దేశ వ్యాప్తంగా కొన సాగుతున్న జనతా కర్ఫ్యూ. . .* 

నిర్మానుష్యం à°—à°¾ శ్రీకాకుళం జిల్లా  . . .

DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం,

మార్చి 22, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారత దేశం మొత్తం

స్వచ్చందంగా జనతా కర్ఫ్యులో పాల్గున్తున్నది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ సాగే ఈ మహా యజ్ఞంలో గ్రామాల్లోని గల్లీ నుంచి రాజధాని ఢిల్లీ వరకూ అందరూ

పాల్గొంటున్నారు. ప్రజా రవాణా సంస్థ పూర్తిగా నిలిచిపోయింది. పెట్రోల్ బంక్ లు సైతం మూసివేసి, కేవలం అత్యవసర సేవల వారికి మాత్రమే పెట్రోల్ నింపుతామని పెట్రోల్

బంకుల సంఘాలు ముందుగానే ప్రకటించాయి. 

నిర్మానుష్యం à°—à°¾ శ్రీకాకుళం జిల్లా  . . .

నిత్యం అత్యంత రద్దీగా ఉండే శ్రీకాకుళం జిల్లా లోని మొత్తం పట్టణ,

గ్రామీణ ప్రాంతాల పరిసరాలన్నీ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి.  à°¦à±‡à°¶ భద్రతా, సమాజ శ్రేయస్సు కోసం జరుగుతున్న à°ˆ స్వచ్చంద కర్ఫ్యూ లో పట్టణ ప్రజలతో పాటు,

గ్రామా స్థాయిల్లో సైతం పూర్తిగా మద్దతు ప్రకటించి, దేశ ఐక్యతను చాటారు. శ్రీకాకుళం జిల్లా లో సాగుతున్న పరిశుభ్ర కార్యాచరణ పై, జిల్లా కలెక్టర్ నివాస్, సంయుక్త

కలెక్టర్లు అత్యవసర సమావేశం నిర్వహించి, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పారిశుధ్య కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేసారు. జిల్లాలోని అన్ని గ్రామా,

మండల ప్రాంతాలలోని అధికారులు, విధుల్లో ఉన్న సిబ్బందితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితులను ఎప్పడికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జన సమూహం

ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆదేశించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam