DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వచ్చంద కర్ఫ్యులో ఇంటికే పరిమితమైన విజయవాడ బ్రదర్స్ 

"కరోనా"  à°¤à°°à°¿à°®à°¿à°•à±Šà°¡à°¦à°¾à°‚ : దేవదాయ మంత్రి వెల్లంపల్లి 

*ఇష్ట దైవ ప్రార్ధనలు చెయ్యండి: బ్రాహ్మణా కార్పొ చైర్మన్ విష్ణు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 22 , 2020 (డి ఎన్ ఎస్) : భారత జాతి యావత్తు ఏకతాటి పై నిలిచి కరోనా మహమ్మారి పై యుద్ధం ప్రకటిస్తూ ఆదివారం జనతా కర్ఫ్యూను పాటిస్తోన్న

తరుణంలో విజయవాడ బ్రదర్స్ గా పేరు పొందిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్లు సైతం తమ ఇంటికే

పరిమితమయ్యారు. వీరు రోజు వారీ కార్యక్రమాలను పూర్తిగా ప్రక్కన బెట్టి కుటుంబ సభ్యులకే సమయాన్ని కేటాయించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను ప్రసార

మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నారు. à°ˆ సందర్బంగా వారు ప్రజలకు తమ సందేశాన్ని ఇచ్చారు. 

"కరోనా"  à°¤à°°à°¿à°®à°¿à°•à±Šà°¡à°¦à°¾à°‚ : దేవదాయ మంత్రి వెల్లంపల్లి 

ప్రజలంతా

సంఘీభావంతో ఉండి, కరోనా మహమ్మారిని తరిమి కొడదామని, రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ

దేవాలయాల్లోనూ ఆదివారం విపత్తు నివారణా హోమాలు జరుపుతున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు కుప్పిలి

శంకర శర్మ నేతృత్వంలో అరుణ హోమం, సూర్య నమస్కారాలు, సౌర యాగం జరుగుతోందన్నారు. 

ఇష్ట దైవ ప్రార్ధనలు చెయ్యండి: బ్రాహ్మణా కార్పొ చైర్మన్

విష్ణు 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు క్లిష్ట పారిస్తుతులను ఎదుర్కొంటున్నారని, కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ వారి ఇష్టదైవం ప్రార్థనలను

చేయవలసిందిగా ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు మల్లాది విష్ణు, ప్రజలకు సూచించారు. సమస్యను సమర్ధవంతంగా

ఎదుర్కొనేందుకు దేవీ దేవతలా సహకారం తప్పని సరిగా అవసరం అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యవంలో జపతపాదులు, విపత్తు నివారణా

హోమాలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి, తమ వంతు సంఘీభావంగా దైవ ప్రార్ధనలు చేయవలసిందిగా సూచించారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam