DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ అనుభవుజ్ఞుని దూరదర్శనానికి అభివాదములు 

*ఈసీ à°•à°¿ ధన్యవాదాలు చెప్పవలసిన భాద్యత లేదా?* 

*కరోనా వ్యాప్తి పై రమేష్ కుమార్ ముందు చూపు. ..* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం,

మార్చి 23 , 2020 (డి ఎన్ ఎస్) : రెండు వారాల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ఒక అనుభవుజ్ఞుని దూరదర్శనానికి సర్వత్రా హర్షం

వ్యక్తమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పై ఎటువంటి ప్రభావం చూపకూడదని స్థానిక ఎన్నికలను ఆరు

వారాల పాటు వాయిదా వెయ్యడం జరిగింది. ఆయన ఈ నిర్ణయం ప్రకటించే నాటికి భారత దేశంలో ఈ ప్రభావం అంతగా లేకపోవడంతో అధికార పార్టీలోని ప్రజా ప్రతినిధుల నుంచి సామాన్య

కార్యకర్తల వరకూ అందరూ ఈయనపై మీడియా ముఖంగా విస్తృతంగా దాడి చెయ్యడమే కాక, ఆయనపై వ్యక్తిగత దూషణలకు కూడా దిగడం జరిగింది. పైగా ఆయన కుటుంబ సభ్యులను కూడా వివాదం

లోకి లాగడం గమనార్హం. 
ఇలాంటి అధికారి ని కలవాలంటే ముందుగా అప్పాయింట్ మెంట్ తీసుకోవాలి అనే కనీసం నిబంధనలు కూడా తెలియని వాళ్ళు కూడా స్థానిక ఎన్నికల వాయిదా

ప్రకటన చెయ్యగానే నోటికి వచ్చిన విమర్శలు గుప్పించేశారంటే ఈయన నిర్ణయాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో తెలుస్తోంది. 
అయితే దీనికి స్పందన గా ఆయన ఒక్క మాట కూడా

మాట్లాడక పోవడం ఆయన ఔదార్యానికి నిదర్శనం గా నిలిచింది. తీవ్ర స్థాయిలో ఆయన పై జరుగుతున్నా దూషణల దాడికి కించిత్ బాధపడిన ఆయన వెంటనే రాష్ట్ర గవర్నర్ ను కలిసి

తానూ తీసుకున్న నిర్ణయానికి గల కారణాలను వివరించారు. ఆఖరికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఎన్నికలు జరపడానికి తాము, తమ అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు

అని చెప్పినా కూడా, ఈయన తన వాయిదాను వెనక్కి తీసుకోక పోవడం ఈయన అనుభవం, ముందుచూపుకు నిదర్శనం. 

సరిగ్గా వారం దాటక ముందే  à°ˆ ప్రభావం భారత్ లో విస్తృతంగా

పెరగడం మొదలు పెట్టింది. సరిగ్గా ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగవలసిన తేదికి పరిస్థితి విస్తృతంగా మారిపోయింది. రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ చెయ్యవలసిన

పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు, విమర్శలకు లొంగి గానీ, భయపడి గానీ ఈయన స్థానిక ఎన్నికల వాయిదాను వెనక్కి తీసుకోవడం జరిగితే. ..  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à°¿ అంచనా

వెయ్యడం కష్టమే. 

రాజకీయ కోణాలు, ఇతర లబ్ది ఎలా ఉన్నప్పడికి ఒక అపరమేధావి తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయం రాష్ట్ర ప్రజలకు గొప్ప ఉపశమనం లభించింది. రాష్ట్ర

ప్రజల అభినందనలు అందుకునేందుకు ఈయన పూర్తిగా అర్హులు అన్నది అక్షర సత్యం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam