DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గురివింద గింజల నలుపు దేశం ఎంపీలకు తెలియలేదా ?

అంతర్గత మీటింగ్ వీడియో బయటకు ఎలా వచ్చింది 

విశాఖపట్నం, జూన్ 30 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ పట్ల తెలుగుదేశం ఎంపీలకు ఉన్న అంతర్గత అభిప్రాయాలను బయట పెట్టిన

వీడియో తో ప్రస్తుతం పార్టీ పరువు రోడ్డున పడింది. దీనిపై తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు ఈ ఎంపీలకు ఫుల్ క్లాస్ కూడా తీసుకున్నారు. ఫుల్ మీల్స్ చేసిన ఎంపీలు

పూర్తిగా డిఫెన్సె లో పడ్డారు. దీన్ని ప్రతిపక్షాల వీడియో కుట్రగా దాడిచేస్తున్న ఎంపీలు ఇందులో కనీస లాజిక్ ఎలా మిస్సయ్యారో తెలియదు. టిడిపి ఎంపీ లు మాత్రమే

ఉన్న గదిలో జరిగిన సంభాషణలను ఎవరు వీడియో తీశారు, వీళ్లు చెప్తున్నట్టుగా వాటిని తారుమారు చేసిన వారెవరు? అసలు ఇంటర్నెట్ ద్వారా సోషల్ మీడియా లో పెట్టినవారెవరు ?

వీటన్నింటికీ సమాధానం వెదికితే వీడియో లు తీసిన వారు ఈ ఎంపీల వెనకాల తిరిగేవారు మాత్రమే తీసే అవకాశం ఉంది. తమ వెనక తిరిగే వారే తీసిన ఈ వీడియో గుంపగుత్తగా తమ

ఎంపీల పరువు పోయినా పట్టించుకోలేక పోయారంటే ఏమనుకోవాలి. పైగా ఒక్కొక్కరు గా ఈ తప్పిదాన్ని ప్రతిపక్షం పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష

పార్టీవాళ్లని తమ సహాయకులుగా, అనుయాయులుగా ఉంచుకునేంత తెలివి తక్కువతనం ఎవరికైనా ఉంటుందా ? అందునా వీరంతా భారత దేశ అత్యున్నత ప్రజా చట్ట సభ కు ఎన్నికైన వారు (

లోక్ సభ కావచ్చు, రాజ్య సభ కావచ్చు). అంటే పార్టీ పరువు పోతున్న పట్టింపు లేదు అంటే ఇక రాష్ట్రం పరువు పోయినా పట్టింపు ఉండదన్న మాటే కదా. ఈ వీడియో లోని మాటలే

వాస్తవాలు అనే అభిప్రాయాలకు వీళ్ళ చేష్టలే బలాన్ని చేకూరుస్తున్నాయి.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam