DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో 9 వ తరగతి వరకూ నేరుగా ప్రమోషన్ : మంత్రి సురేష్

*ఏపీ విద్యాశాఖామంత్రి సురేష్ ప్రకటన*

*13 నాటికే ప్రాధమిక తరగతుల పరీక్షలు పూర్తి*   

*ఇంకా పరీక్షలు పెట్టని ప్రయివేట్ స్కూల్స్ స్థితి  à°…గమ్య గోచరం.

.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 26 , 2020 (డి ఎన్ ఎస్) : ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్న 6 వ తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులను

హాజరు ఆధారంగా తదుపరి తరగతిలోకి ప్రోమోట్ చేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. గురువారం విడుదలైన ఈ ప్రకటనతో

ఇటు విద్యార్థులు, అటు పాఠశాలల యాజమాన్యాలకు à°Šà°°à°Ÿ లభించినట్లయింది. 

 à°•à°°à±‹à°¨à°¾ మహమ్మారి వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో ఆంధ్ర

ప్రదేశ్ లో అన్ని పాఠశాలలకూ సెలవలు ఇవ్వడం జరిగింది. అయితే వార్షిక పరీక్షలు జరగవలసి ఉన్నందున ఇటు విద్యార్థులకు, అటు పాఠశాలల యాజమాన్యాలకు ఇబ్బందికర

పరిస్థితులు నెలకొన్నాయి. à°ˆ క్రమం లోనే ఏప్రిల్  14 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని దేశ ప్రధాని ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం à°’à°• ప్రకటన చేసింది.  

అయితే

ప్రాధమిక తరగతులకు స్పష్టత లేదు:. .

ఉన్నత తరగతులను ప్రమోట్ చేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడంతో క్రింది తరగతుల విద్యార్థుల పరిస్థితి

తెలియడం లేదు. అయితే ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 1 వ తరగతి నుంచి 5 వ తరగతి వరకూ విద్యార్థులకు ఈ నెల 13 లోగానే పరీక్షలు నిర్వహించాల్సి యుంది. అయితే

కేవలం ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మాత్రమే క్రింది స్థాయి తరగతులకు వార్షిక పరీక్షలు ( ఎస్ ఏ 2 ) ముగించాయి. ప్రయివేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాథశాలలు ఈ

నెలాఖరు నాటికి పరీక్షలు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. అనుకోని విధంగా విపత్తు రావడంతో తక్షణం పాఠశాలలకు సెలవలు ప్రకటించవలసి వచ్చింది. ఈ

నేపథ్యంలో పరీక్షలు నిర్వహించకుండా ఉన్న పాఠశాలలు ఏ విధంగా నడుచుకోవాలో తెలియని పరిస్థితి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుగానే పరీక్షలు నిర్వహించాల్సి యుంది.

మరి వీళ్ళు నిర్వహించలేదు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే అది నిబంధనలకు విరుద్ధం. అయితే ఈ అంశం పై ప్రభుత్వ అధికారులకు సంప్రదించే ప్రయత్నం

ఆయా పాఠశాలల యాజమాన్యాలు, సంఘాలు చెయ్యవలసి యుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam