DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా. . జ్వరం, ఫ్లూలాంటిదే, భయం వద్దు : వైఎస్ జగన్‌

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , ఏప్రిల్ 01, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరగడం బాధ కలిగించిందని

ఏపీ సీఎం జగన్‌ అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్ని పెంపొందించారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  à°ˆ వైరస్‌తో ఆందోళన

వద్దని.. ఇది జ్వరం, ఫ్లూ లాంటిదే నని, భయపడవద్దని తెలిపారు. జ్వరం వస్తే నయమైనట్లే ఇది నయమవుతుందన్నారు. వయసు పైబడిన వాళ్లతో పాటు కిడ్నీ, బీపీ, షుగర్‌లాంటి వ్యాధులు

ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ సోకితే పాపంగానో, తప్పుగానో దయచేసి చూడొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి క్యాంపు

కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడారు. à°¡à°¿à°²à±à°²à±€ వెళ్లొచ్చిన వారి వల్ల అనేక మందికి కరోనా వైరస్‌ సోకిందని, అక్కడ జరిగిన సమావేశంలో

పాల్గొన్న ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారినీ గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ఎవరికి బాగోలేకపోయినా స్థానిక ఆరోగ్య

సిబ్బందికి తెలియజేయాలి. గ్రామవాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఎవరొచ్చినా వారికి చెప్పండని తెలిపారు. అలాంటి వారికి సంబంధిత పరీక్షలు చేయడమే కాకుండా

నయం కావడానికి అవసరమైన మందులు ఇస్తారు. రోజూ వచ్చి పరిశీలించి వెళ్తారు. ఆరోగ్యం విషమిస్తే నేరుగా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. జ్వరం, గొంతునొప్పి,

దగ్గు.. ఇలా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా 104కు ఫోన్‌ చేసి చెప్పాలి. à°ˆ విషయంలో ఏమాత్రం మొహమాటం వద్దు. దీంతో మీ కుటుంబసభ్యులతో పాటు పొరుగువారికి కూడా మేలు

జరుగుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా 81 శాతం కేసులు ఇళ్లలోనే ఉండి నయమైన పరిస్థితి ఉంది. ఎలాంటి భయాందోళన అవసరం లేదు’’ అని సీఎం సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam