DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా రాక్షసిని పారద్రోలమని కోరుతూ చిన్న జీయర్ సుందరకాండ పారాయణ  

*మానవాళి శ్రేయస్సుకై 9 రోజుల పాటు సుందరకాండ పారాయణ*

*కరోనా నుంచి రక్షించమని ప్రార్ధిస్తూ  à°¸à±€à°¤à°¾à°°à°¾à°® కళ్యాణం* 

*ఆలయాల్లో భక్తులు లేకున్నా అదే

వైభోగం. . .* 

*6 గంటలకే ముగింపు, ఆలయాలకు తాళాలు . . .*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 02, 2020 (డిఎన్ఎస్) : ప్రపంచాన్ని

వణికిస్తున్న కరోనా అనే మహమ్మారి రాక్షసిని à°ˆ ప్రపంచం నుంచి పారద్రోలమని శ్రీరామచంద్ర ప్రభువు ను  à°•à±‹à°°à±à°¤à±‚ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి  à°šà°¿à°¨à±à°¨ జీయర్ స్వామి

ప్రత్యక్ష పర్యవేక్షణలో సుందరకాండ పారాయణ నిర్వహించారు. 

గురువారం శంషాబాద్ లోని జీవా ఆశ్రమం లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి  à°šà°¿à°¨à±à°¨ జీయర్ స్వామి

ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రపంచ శాంతి ని కాంక్షిస్తూ తొమ్మిది రోజుల పాటూ  à°¸à±à°‚దరకాండ పారాయణ నిర్వహించారు. à°—à°¤  à°¨à±†à°² 25 నుంచి ఏప్రిల్ 2 ( గురువారం) వరకూ సాగిన à°ˆ పారాయణ

యజ్ఞంలో ఆన్ లైన్  à°¦à±à°µà°¾à°°à°¾ వేలాది మంది భక్తులు పాల్గొని పారాయణ చేపట్టారు.  à°µà°¸à°‚à°¤ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా గురువారం వసంత ఋతువు,

చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం సందర్బంగా శ్రీ రామ జననం, సీతారామ కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 

ఈ సందర్బంగా జీయర్ స్వామి అనుగ్రహ భాషణం

చేసారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా అనే మహమ్మారి రాక్షసిని ఈ ప్రపంచం నుంచి పారద్రోలమని సంకల్పించి గత తొమ్మిది రోజులుగా సుందరకాండ పారాయణ

నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం జీవా ఆశ్రమం లోని సాకేత రాముని సన్నిధిలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. గత నెల 24 న శ్రీ విరాట్ శ్రీ విష్ణు

సహస్రనామ స్తోత్ర పారాయణ ను నిర్వహించుకున్నామన్నారు. 
అంతకు ముందు జీయర్ ఆశ్రమ వేదవిద్యార్థులు లోక శాంతి కోసం వేదపారాయణ జరిపారు. 

ఈ కల్యాణ మహోత్సవం లో

త్రిదండి అహోబిల జీయర్ స్వామి,  à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿ దేవనాధా జీయర్ స్వామి, ఉభయ వేదాంత ప్రవర్తకులు నేపాల్ కృష్ణమాచార్య, ఆశ్రమ వేద విద్యార్థులు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à±

పాల్గొన్నారు. 

భక్తులు లేకున్నా. . అంటే వైభవం:

ప్రస్తుత కరోనా మహమ్మారి విపత్తు నుంచి ఈ ప్రపంచాన్ని పరిరక్షించమని కోరుతూ దేశ వ్యాప్తంగా

అన్నిఆలయాల్లోనూ, హిందూ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ సీతారామ కల్యాణాన్ని నిర్వహించారు. 

దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ సీతారామ కల్యాణాన్ని

వైభవంగా నిర్వహించారు. అయితే భక్తులకు అనుమతి లేకున్నా . . అదే వైభవంగా ఆలయాల్లోని అర్చకులు కల్యాణాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటల కె ఆలయాలను మూసి వెయ్యాలి అనే

నిబంధన ఉండడంతో చాలా ఆలయాల్లో  à°‰à°¦à°¯à°‚ 4 గంటలకే సుప్రభాతం, ఆరాధన చేసి, కల్యాణాన్ని కూడా ముగించడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam