DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ లో గడప దాటితే వచ్చేది నరక లోక గడప లోకే: యముడు

*సత్తెనపల్లిలో యముడు, చిత్రగుప్తుడు వేషాల్లో హెచ్చరిక* 
 
*ప్రత్యక్షంగా ప్రజలకు అవగాహన చేస్తున్న పాత్రికేయులు* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి). .

అమరావతి, ఏప్రిల్ 16, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్దంగా ఇంటి గడప దాటితే అడుగు పెట్టేది నరక లోక ద్వారం లోకేనంటూ

యమధర్మరాజు, చిత్రగుప్తులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో గురువారం అత్యంత ఆసక్తి కరంగా రోడ్లపైకి యమధర్మరాజు,

చిత్రగుప్తులు ప్రత్యక్షం అయ్యారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి నిరోధించేందుకు ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకూడదని ప్రభుత్వం

ఆదేశించిందని, వాటిని పాటించాలన్నారు. అవసరం లేకుండా రోడ్డు పైకి వస్తున్న పలువురికి హెచ్చరికలు జారీ చేసారు. ఈ దృశ్యం చూసిన వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

వివరాల్లోకి వెళితే. . .

నిత్యం సమాచారం , వార్తల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్న పాత్రికేయులు గురువారం ప్రత్యక్ష ప్రచార రంగం లోకి దిగారు. సత్తెన పల్లి కి

చెందిన సత్తెనపల్లి పట్టణ విలేఖరి వళ్ళెం చెన్నకేశవ వినూత్నంగా  à°¯à°®à°§à°°à±à°®à°°à°¾à°œà± వేషాధారణలో ప్రత్యక్ష ప్రచారానికి సిద్ధపడ్డారు.  à°¤à°¨ వెంట చిత్రగుప్తుడు వేష

ధారుని తో కలిసి  à°ªà±à°°à°§à°¾à°¨ కూడళ్ళల్లో తనదైన శైలిలో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. 

ఈ సందర్బంగా యమధర్మ రాజ వేష దారి చెన్నకేశవ మాట్లాడుతూ మన పట్టణంలో

కరోనా వైరస్ ఇప్పటి వరకు దరిజెరలేదని 3వ ఫెజ్లోకి వైరస్ విజృంభించిన కారణంగా ఇప్పటి నుంచే ప్రజలు తగు జాగర్తలు పాటిచాలన్నారు. మనచుట్టూ మండలాల్లో వైరస్

ప్రబలిందని మన ప్రజలు 90 శాతం ప్రభుత్వ నియమాలను అనుసరిస్తున్నారన్నారు.  మిగిలిన వారి కోసమే పోలీసు యంత్రాంగం శ్రమించాల్సి వస్తుందన్నారు. à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±ˆà°¨à°¾ ప్రజలు

ఇంట్లో నుంచి బైటకి రావద్దని, హద్దుమీరి వస్తే యమలోకం నుండి నేరుగా యమధర్మరాజు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. 

అనంతరం పట్టణ సిఐ విజయచంద్ర

మాట్లాడుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడం కోసం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చిన పట్టణ విలేకరి చెన్నకేశవ్ ని అభినందించారు. ప్రజల శ్రేయస్సు కోసం వేలాది

మంది నిత్యం విధి నిర్వహణలో ఉన్నారని, వారికి మద్దతుగా పాత్రికేయులు పత్రికల్లో వార్తలు వ్రాయడమే కాక నేరుగా అవగాహనా కల్పించడం ద్వారా సమాజం పట్ల వారు ఎంత

భాద్యతగా ఉన్నారో తెలుస్తోందన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam