DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూమర్స్ ని మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు

*ప్రభుత్వ బులిటిన్ చూసే వార్తలు మీడియా ప్రసారం చెయ్యాలి*

*కరోనా వైరస్‌పై మీడియా కవరేజీ కు ప్రభుత్వ మార్గదర్శకాలు*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 19, 2020 (డిఎన్ఎస్) : కరోనా వైరస్‌ కు సంబంధించిన మీడియా  à°•à°µà°°à±‡à°œà±€ పత్రికలు, టీవీఛానళ్ల అధిపతులు, ఎడిటర్లు, బ్యూరోచీఫ్‌లు,

పాత్రికేయులకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖా ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి మార్గదర్శకాలు సూచించారు. కేవలం ప్రభుత్వం విడుదల చేసే బులియన్ ల

ఆధారంగానే వార్తలు వ్రాయడం, కధనాలు చూపడం వంటివి చెయ్యాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. వాటిల్లో ప్రధానంగా . . . 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై

వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్‌ ఇస్తుంది. నిర్ధారించిన à°ˆ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణ నలోకి తీసుకోవాలి.

కరోనా వైరస్‌ కేసుల విషయంలో,

వైరస్‌ వల్ల మరణాల విషయంలో ఆధీకృత సమాచారం కాకుండా, నిర్ధారణలేని సమాచారాన్ని ప్రచురించరాదు. ప్రసారం చేయరాదు.  

మార్చి 20à°µ తేదీన విశాఖలో కరోనా వైరస్‌ మరణం

అటూ పలు వార్తసంస్థలు, ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నాం. 

అనుమానిత కేసుల పేరుతో సమాచారాన్ని ప్రచురించరాదు,

ప్రసారం చేయరాదు.

కరోస్‌ వైరస్‌ సోకి పాజిటివ్‌à°—à°¾ వచ్చిన కేసుల విషయంలో వారి పేర్లు, వారి చిరునామాలు ప్రచురించరాదు, ప్రసారం చేయరాదు. 

వదంతులు, ఊహాజనిత

అంశాలను ప్రసారం చేయరాదు, ప్రచురించరాదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వెబ్‌సైట్లు, డబ్ల్యూహెచ్‌à°“ నిర్వహిస్తున్న వెబ్‌సైట్లను

అనురించడంద్వారా వైరస్‌కు సంబంధించి సరైన సమాచారాన్ని పొందవచ్చు. 

మూఢ నమ్మకాలను వ్యాప్తిచేసేలా సమాచారాన్ని ప్రచురించరాదు, ప్రసారం

చేయరాదు. 

మార్గదర్శకాలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. 

కరోనా వైరస్‌ నివారణలో, ప్రజలకు అవగాహన కల్పించడంలో  à°®à±€ సహకారాన్ని

కోరుతున్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam