DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘనంగా అల్లూరి జన్మదినోత్సవాలు : మంత్రి అయ్యన్న

విశాఖపట్నం, జులై 2 , 2018 (DNS Online ): ఈ నెల 4వ తేదీన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నట్లు రహదారులు భవనాల శాఖ మంత్రి

చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లూరి ఉత్సవాలను అధికారికంగా

నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా కృష్ణదేవిపేట లోని సీతారామరాజు పార్కులో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

చేస్తున్నామన్నారు విద్యార్థులకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు అల్లూరి, అతని అనుచరుల కుటుంబ సభ్యులకు సన్మానాలు ఉంటాయన్నారు. ఆర్డిఓ ఆధ్వర్యంలో

అధికారులు ప్రజా ప్రతినిధులు ఉత్సవాల ఏర్పాట్లను చూస్తున్నారని తెలిపారు.
జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలంటూ నిరాహార దీక్షలు చేస్తామంటూ సీతారామరాజు సంఘాల

పేరిట కొంతమంది ప్రకటనలు ఇస్తున్నారని మంత్రి పేర్కొంటూ విశాఖపట్నం జిల్లాకు శ్రీ అల్లూరి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని, విశాఖపట్నం రెండు జిల్లాల

అయితే కొత్తగా ఏర్పడే జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని ఏనాడో తీర్మానించాం అన్నారు. పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ మంత్రి చంద్రబాబు

నాయుడు లిఖితపూర్వకంగా కోరారన్నారు. ఈరోజు అల్లూరి సేవకుల మంటూ వచ్చినవాళ్లు ఇంతకుముందే ఎప్పుడైనా అల్లూరి స్మారకాల అభివృద్ధిలో భాగం పంచుకున్నారు అంటూ

సూటిగా ప్రశ్నించారు. మాజీ పార్లమెంటు సభ్యురాలు మేరీవిజయ కుమారి మొదటగా 50లక్షల నిధులను ఇచ్చి సూరి పార్కు అభివృద్ధికి పునాది వేశారన్నారు. ఆ తరువాత తమ ప్రభుత్వం

అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం పేరుతో ఉన్న జిల్లాను పేరు మార్చడం అంత సులభం కాదని, ప్రజా బాహుళ్యంలో

నాటుకుపోయిన పేర్లను మార్చలేము అన్నారు. ఉదాహరణగా వైఎస్ఆర్ కడప, పీవీజీ విజయనగరం జిల్లాల పేర్లు మార్చినప్పటికీ వాడుకలో లేవని చెప్పారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam