DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏకాంతం లోనే సింహాచల క్షేత్ర చందనయాత్ర నిర్వహణ:

*ఆన్ లైన్ లో భక్తుల చెల్లింపులు- ఆలయంలో సేవలు. .*  

*15 మంది వైదిక సిబ్బంది తోనే చందనయాత్ర. . .*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం,

ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలూ భక్తుల రాకను నిషేధించాయి. విశాఖ సాగర తీర సమీపాన సింహాచల

క్షేత్రం లో  à°µà±†à°²à°¸à°¿à°¨ శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దివ్యక్షేత్రంలో కూడా భక్తులకు ద్వారాలు మూసుకుపోయాయి. à°ˆ సమయంలోనే వైశాఖ శుద్ధ తదియ ( అక్షయ తృతీయ) రోజు

 à°à°¡à°¾à°¦à°¿ à°•à°¿ ఒక్కసారే లభించే స్వామి నిజరూప దర్శనం చందన ఉత్సవం కూడా రావడంతో ప్రభుత్వ ఆదేశాల నిబంధనల ప్రకారం à°ˆ వేడుకలను కూడా ఏమాత్రం ఆర్భాటం లేకుండా ఏకాంతంలో

నిర్వహిస్తున్నారు.  à°ªà±à°°à°¤à°¿ ఏడాది రెండు వారాల ముందుగానే అత్యంత భారీ ప్రచారాలతో, స్వచ్చంద సంస్థలు, వైదిక బృందాల ప్రచారాలతో ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాక, రెండు

తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేయడం జరిగేది. ఈమారు కనుచూపు మేరకు కానరాకుండా సాదా సీదాగా నాలుగు గోడల మధ్యే నిర్వహిస్తున్నారు. 

*15 మంది వైదిక

సిబ్బంది తోనే చందనయాత్ర. . .*

ఈ క్రమంలోనే ఈ నెల 26 న జరుగనున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం ఉత్సవాల్లో భక్తులకు ప్రత్యక్షంగా పాల్గొనే

అవకాశం లేకపోవడం తో దేవస్థానం ఆన్ లైన్ ద్వారా సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సింహాచల క్షేత్రంలోకి

భక్తుల రాకను నిషేధించడం తో కేవలం 15 మంది వైదిక సిబ్బంది / అర్చకుల తోనే à°ˆ సారి చందనయాత్ర జరుగనుంది. à°ˆ మేరకు ఆలయ ఈఓ వెంకటేశ్వర రావు  à°ªà±à°°à°•à°Ÿà°¨ విడుదల చేసారు. 

ఆన్

లైన్ లో చెల్లింపులు- ఆలయంలో సేవలు. .   

ఈ చందనయాత్రలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనందున ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లింపులు జరపాలని, ఆలయంలో

స్వామికి ఆరాధనలు, అర్చనలు నిర్వహిస్తామని ఈఓ ఒక ప్రకటన విడుదల చేసారు. స్వామికి అర్పించే చందనాన్ని కూడా భక్తులు సమర్పించుకునే అవకాశాన్ని ఈ సారి

కల్పిస్తున్నారు. దీని ప్రకారం à°’à°• కేజీ చందన సమర్పణకు రూ. 20 వేలు చెల్లించాలన్నారు. అరకేజీ చందనానికి రూ. 10 వేలు చెల్లించవచ్చన్నారు.  à°ˆ చెల్లింపులను  à°«à±‹à°¨à± పే : eosvlnsd@sbi

లేదా ఆన్ లైన్ transfer no: 11257208642, IFSC Code :SBIN0002795 ద్వారా చెల్లించమని సూచించారు. 

అదే విధంగా చందనోత్సవ సమయంలో ప్రత్యక పూజ కోసం రూ. 500/- లను  à°«à±‹à°¨à± పే  eosvlnsd@sbi ద్వారా చెల్లించమనవి. మీరు

చెల్లించిన వివరములు à°ˆ దేవస్థానం నెంబర్ 9949725433 à°•à°¿ వాట్స్ అప్ ద్వారా చెల్లించే అవకాశం ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam