DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనాతో మృతి చెందిన ఏఎస్ఐ కుటుంబానికి రూ. 50 లక్షలు: డిజిపి

*సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు*

*అనంత పర్యటనలో సీఎం à°•à°¿ కృతఙ్ఞతలు తెలిపిన గౌతమ్ సవాంగ్* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 25, 2020 (డిఎన్ఎస్) : కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ కు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కృతజ్ఞతలు తెలియచేసారు. శనివారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన బాధిత కుటుంబానికి చెక్ అందించారు. అత్యంత

ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కి అండగా నిలబడడం తన భాద్యతగా ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం

ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమేనన్నారు. కరోనా కష్టకాలంలో అమూల్యమైన సేవలు అందిస్తున్న వారికి సలాం చేస్తున్నట్టు తెలిపారు. 

సోషల్ మీడియాలో

తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేవలం ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే మీడియా వారు సైతం వార్తలు ప్రచురించాలని, సోషల్

మీడియా లో ఎవరికీ తోచినట్టు వారు అవాకులు ప్రచారం చేస్తే ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయన్నారు. తద్వారా రాష్ట్రంలో పరిస్థితులు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఈ

రూమర్ల పై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామన్నారు. 

కరోనా పాజిటివ్ లు వచ్చిన వారి ద్వారా జరిగిన కాంటాక్ట్ వ్యక్తులను సాధ్యమైనంత త్వరగా గుర్తిస్తున్నాం అని, ఏపీకి

28000 మంది విదేశాల నుండి, ఢిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చారు, అందర్నీ గుర్తించి క్వారంటెన్ లో ఉంచామన్నారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న

ఘనత ఏపీ ప్రభుత్వానిదేనన్నారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతి ఇచ్చాం అని, అన్ని శాఖలతో పోలీసులు సమన్వయం చేసుకుంటు ముందుకుసాగుతున్నామన్నారు.

పోలీసులకు పీపీఈ కిట్లు కొనుగోలు కోసం ప్రభుత్వం 2.89 కోట్లు మంజూరు చేసిందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam