DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*సంఘ సంస్కర్త రామానుజార్య దివ్యజ్ఞా వర్ధతామ్ అభివర్ధతామ్*

ఆధునిక సమాజానికి వెయ్యేళ్ళ క్రితమే మార్గదర్శకం 

ఆళ్వార్లలో అత్యధిక స్థానం అందరికీ కల్పించిన సంఘ సంస్కర్త 

సంప్రదాయమే పరమౌషధం అని

నిరూపించిన మహనీయులు 

*28 న రామానుజ తిరునక్షత్ర వేడుకల ప్రత్యేకం. ..*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 28, 2020 (డిఎన్ఎస్) :

ఆధునిక సమాజానికి అభ్యున్నత  à°®à°¾à°°à±à°—దర్శకం చూపించిన ఆధ్యాత్మిక వేత్తల్లో అగ్రగణ్యులు భగవద్రామానుజులు. అంటరానితనం అనే జాడ్యాన్ని అంతరింపచేసే విధంగా ఆయన

సుమారు వెయ్యేళ్ళ క్రితమే ఆధునిక సమాజానికి దిశా నిర్దేశం చేసారు.  à°¤à°® ఆచార్యుల నుంచి తానూ నేర్చుకున్న మంత్రోపదేశాన్ని ఇతరులకు చెప్తే నరకానికి పోతావు అని

శపించినప్పడికీ  à°—ోష్ఠిపురం ఆలయ శిఖరం ఎక్కి మరీ ప్రజలందరికీ ఉపదేశం చేసి తానూ నరకానికి వెళ్లినా సరే ప్రజలందరూ ముక్తిని పొందడం తనకు ముఖ్యం అని వెయ్యేళ్ళ

క్రితమే నిరూపించిన సమాజ అభిలాషి రామానుజులు. 

సంఘ సంస్కర్త భగవద్రామానుజులు : . .

సంఘం లో జరిగే అసమానతలను వెయ్యేళ్ళ క్రితమే రామానుజులు సరిదిద్ది , సంఘ

సంస్కర్త గా అందరికి మార్గదర్శకులుగా నిలిచారు. అదే సమయంలో ఆనాడు సమాజం లో కొందరికి ఆలయ ప్రవేశం లేకపోవడాన్ని రామానుజులు తప్పు పట్టి వారందరిని స్వయంగా

ఆలయంలోకి తీసుకు వెళ్లి ఆనాడే సంఘ సంస్కర్తగా నిలిచారు. 

దివ్య దేశాల్లోనూ సంపూర్ణ దిశానిర్దేశం చేసి ఆయా ఆలయాల సంప్రదాయాలను పూర్తిగా అమలు చేసే విధంగా

దిశానిర్దేశం చేసారు. తిరుమల ఆలయంలో సైతం రామానుజుల ఆదేశాల ప్రకారమే నాటి నుంచి నేటి వరకూ సుప్రభాతం నుంచి రాత్రి జరిగే ఏకాంత సేవ వరకూ ఎలా జరగాలి అనే విధానాలను

ఆగమ విధానంగా ప్రకటింపచేశారు. అర్చనల్లో వైఖానసం పర్యవేక్షణ పాంచరాత్ర ఆగమం ప్రకారం జరగాలి అని రామానుజులు ఆదేశించారు. 

ఏదేని వైష్ణవ ఆలయం దివ్యక్షేత్రం

à°—à°¾ కొలవబడాలి అంటే à°† ఆలయంలో 12  à°®à°‚ది వైష్ణవ ఆళ్వార్లు కొలువై ఉండాలి. వారిలో మహిళా సహా సమాజం లోని  à°…న్ని వర్గాలవారూ ఉండడం గమనార్హం. వీళ్లంతా తమ రచనల ద్వారా

పాశురాల ద్వారా శ్రీమన్నారాయణుని కొనియాడారు. వీరి పుట్టుకతో ప్రమేయం లేకుండా కేవలం స్వామి పై ఉన్న భక్తి ఆధారంగా వీరు ఆచార్యత్వాన్ని పొందారు. వీరిలో ఆండాళ్ (

గోదా) , పెరియాళ్వార్ నమ్మాళ్వార్లు , కులశేఖరాళ్వార్లు , తిరుమంగైయాళ్వార్లు ,  à°¤à°¿à°°à±à°ªà±à°ªà°¾à°¨à±à°¯à°¾à°³à±à°µà°¾à°°à±à°²à± , తదితరులంతా ప్రముఖులు. వీరి విగ్రహాలు ఉన్న ఆలయాన్ని

దివ్యక్షేత్రం గా పిలవబడుతుంది. భారత దేశంలోని అన్ని ప్రసిద్ధ ఆలయాల్లో వీరి మూర్తులను ఏర్పాటు చేసి ఒక సత్సంప్రదాయాన్ని నెలకొల్పినవారు

రామానుజులు..

భక్తి మార్గానికి మార్గదర్శకులు.  . .

తొలినాళ్లలో శంకరాచార్యులు ప్రారంభించిన భక్తి ఉద్యమాన్ని కొనసాగింపుగా వీరు ఎన్నో క్షేత్రాలు

దర్శించి , ఆయా సంప్రదాయాలను యధావిధిగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఎందరో పండితులు పీఠాధిపతులను సైతం ఎదిరించి , భక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. దానిలో

భాగమే తిరుమల క్షేత్రంలో నిత్యా ఆరాధనలు ప్రతి శుక్రవారం స్వామికి అభిషేకం , బ్రహ్మోత్సవాలను తిరుమల క్షేత్రంలోనే నిర్వహించే లా చెయ్యడం , జీయర్ వ్యవస్థను

నెలకొల్పి స్వామికి వీరి సారథ్యంలోనే నిత్యా ఆరాధనలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. స్వామి కి పంచ సంస్కారాలు నిర్వహించి తిరుమల శ్రీనివాసునికి ఆచార్యులుగా

మారారు రామానుజులు.  

సింహాచల క్షేత్రం లోనూ . . .

భగవద్రామానుజుల రాకతో సింహాచల క్షేత్రంలోనూ ఎన్నో సంస్కరణలు , ఆచారాలను కూడా ప్రవేశ పెట్టడం జరిగింది.

వాటిల్లో ప్రధానమైనది. .. శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం లభించే వైశాఖ శుద్ధ తదియ ( అక్షయ తృతీయ) రోజున ఏ విధంగా అర్చనలు జరగాలి అనేవి తెలియచేసారు. అదే

రోజు సాయంత్రం స్వామికి అభిషేకం నిర్వహించే విధానంలో సహస్ర ఘట్టాలతో స్వామికి పవిత్రమైన à°—à°‚à°— ధారా నుంచి  à°ªà°‚à°š సంస్కరపరులైన శ్రీవైష్ణవ స్వాములచె స్వయంగా

జరగాలి అని వెయ్యేళ్ళ క్రితమే దిశా నిర్దేశం చేశారు రామానుజులు. ఇదే క్షేత్రంలో కృష్ణమయ్య అనే పండితునికి భగవంతుని చేరుకునే మార్గాన్ని కూడా

తెలియచేసారు. 

తిరుమేని ప్రత్యక్ష నిదర్శనం శ్రీరంగమే. ..

భారత దేశం మొత్తం పర్యటించి భక్తిమార్గాన్ని అందించిన భగవద్రామానుజులు చరమాంకంలో తన ప్రారంభ

స్థానమైన శ్రీరంగానికి చేరుకున్నారు. సమాధి స్థితి కి చేరుకున్న రామానుజుల తిరుమేని ( శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం ) 1000 సంవత్సరాలుగా శ్రీరంగ క్షేత్రంలోనే

భద్రపరచబడింది. తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి

స్వయంభువుగా అవతరించారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల

వారి శరీరం.

పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా

రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని

వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ

అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

రామానుజాచార్యుల గొప్పదనం:. . .

రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై

పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష

కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam