DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం ఆలయం లో  అనాచారాలపై సమగ్ర విచారణకి  డిమాండ్ 

*ఆదాయానికి భారీ à°—à°‚à°¡à°¿, à°•à°¾à°Ÿà±‡à°œà±€à°²à±‹ ఏసీ గది అద్దె రోజుకు రూ. 100 లేనా?* 

*నెలల తరబడి ఏసీ గదిలోనే  à°¦à±‡à°µà°¸à±à°¥à°¾à°¨à°‚ కాటేజీల్లోనే  à°à°ˆà°“ మకాం?*.

*నెలకు రూ. 37500 కు బదులుగా

కేవలం రూ. 3 వేలే చెల్లింపులు?*    

*జీతం పొందేది రూ. లక్షకు పైగానే. . చెల్లించేది  à°°à±‚. 100 మాత్రమేనా?* 

*బ్రాహ్మణా సంఘం జాతీయ కార్యదర్శి M L N శ్రీనివాస్

మండిపాటు* 

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , రిపోర్టర్ , విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) : ఉత్తరాంధ్ర జిల్లాల భక్తుల ప్రత్యక్ష దైవమైన శ్రీ సింహాచల

క్షేత్రం లో జరుగుతున్నా అనాచారాలకు, తప్పిదాల పై పూర్తి విచారణ చెయ్యాలని అఖిల భారత బ్రాహ్మణా సంఘం జాతీయ కార్యదర్శి ఎం ఎల్ ఎం శ్రీనివాస్ డిమాండ్ చేసారు.

శ్రీవైష్ణవ క్షేత్రంలో బ్రాహ్మణా, అర్చక, వైదిక వర్గాలకు ఘోర అవమానం చేస్తున్నా పట్టించుకునే నాధుడే లేదన్నారు. వీటికి ప్రధాన కారణమైన సిబ్బంది పై కఠిన చర్యలు

తీసుకోవాలని డిమాండ్ చేసారు. 

ఇటీవల జరిగిన చందన యాత్ర లో జరిగిన తప్పిదాలకు భాద్యులను వదిలి పెట్టి అమాయక అర్చకునిపై వేటు వెయ్యడాన్ని తప్పు పట్టారు. ఆలయం

లో జరుగుతున్న వైదిక కార్యక్రమాల్లో సైతం ఇతరుల జోక్యం ఎక్కువై పోయిందన్నారు. దీనికి నిదర్శనమే చందనయాత్రలో ఈఓ వెనుక ఆలయం లోకి నిబంధనలకు విరుద్ధంగా ఏ ఈ ఓ తులా

రాముడు  à°µà±†à°³à±à°²à°¿à°¨ సమయంలో అడ్డుకున్న స్థానాచార్యులు ఎదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. 

ఇదే  à° à°ˆ à°“  à°ªà±ˆ గతంలోనూ ఎన్నో అభియోగాలు ఉన్నాయని, à°† కారణంగానే

అన్నవరం దేవస్థానం నుంచి ఇతన్ని తొలగించడం జరిగిందన్నారు. అయితే కోర్టు ను ఆశ్రయించి, ఉద్యోగం పొందేందుకు పలు దేవాలయాలను ఆశ్రయించారని, అయితే వారందరూ ఇతన్ని

చేర్చుకునేందుకు తిరస్కరించడంతో దేవాదాయ శాఖలోని పలువురు అధికారుల ఆశీస్సులతో సింహాచలం దేవస్థానం లోకి వచ్చి చేరారన్నారు. ఇక్కడికి వచ్చాక అయినా నిబంధనల

ప్రకారం విధులు నిర్వహించినవలసి ఉండగా, వాటికి ఏనాడో తిలోదలకిచ్చేసాడన్నారు. దానిలో భాగమే దేవస్థాన కాటేజీలో నెలల తరబడి మకాం ఉండడమేనన్నారు. 

ఏ సి గది

అద్దె రోజుకు రూ. 100 లేనా .? . . . .

దేవస్థానం పరిధిలోని పలు కాటేజీలను అనుయాయులకు అతి తక్కువ ధరకే నెలల తరబడి కేటాయించడం పై శ్రీనివాస్ మండి పడుతున్నారు. అప్పన్న

దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్ధం వసతి ఇచ్చేందుకు కొండక్రింద సింహాచల గ్రామం లో దేవస్థానం కొన్ని వసతి గృహాల సముదాయాన్ని ( కాటేజీ) లని నిర్మించింది.

వీటిలో ఏ సి గదులు, నాన్ ఏ సి గదులు ఉన్నాయి. వీటిలో ఏ సి గది అద్దె రోజుకు రూ. 1250 గా నిర్ణయించారు. ఇది సాధారణ భక్తులకు మాత్రమే కాకుండా దేవస్థాన సిబ్బంది కూడా

చెల్లించవలసి ఉంటుంది. దేవస్థాన కార్యనిర్వహణాధి కారి కార్యాలయానికి కూడా వేటు దూరం లో ఉన్న నృసింహ సదనంలోనూ కొన్ని ఏసీ గదులు ఉన్నాయి. వీటిని భక్తులకు అద్దెకు

ఇవ్వడం జరుగుతుంది. కనీస ధరావత్తు కూడా చెల్లించాల్సి యుంటుంది. 

కొత్తగా వేరే ప్రాంతం నుంచి సింహాచల క్షేత్ర ఆలయానికి బదిలీ పై వచ్చిన సిబ్బంది కి కూడా ఈ

గదులను అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. అయితే వారు నిర్దేశిత అద్దె కచ్చితంగా చెల్లించాల్సి యుంటుంది.  

పూర్తిగా అద్దె వసూలు చెయ్యవద్దా?. . .

ఆలయానికి సహాయ

కార్యనిర్వహణాధి కారి à°—à°¾ విధుల్లోకి వచ్చిన  à°¨à°¾à°Ÿà°¿ నుంచి  à°¤à±à°²à°¾ రాముడు à°ˆ కాటేజీ సముదాయంలో à°’à°• ఏసీ గది లోనే బస చేసినట్టు తెలుస్తోందన్నారు. నిబంధనల ప్రకారం

సిబ్బంది ఆలయ కాటేజీలో ఉండకూడదన్నారు. దేవస్థానం సిబ్బంది కావడం, పైగా à°ˆ కాటేజీలకు ఇంచార్జి కూడా కావడం తో ఇతనికి à°’à°•  à°—దిని కాటేజీ నిర్వహణ సిబ్బంది

కేటాయించడం జరిగింది. à°ˆ విషయాన్నీ ఎవ్వరూ తప్పు పట్టడం లేదని శ్రీనివాస్ తెలిపారు. 

జీతం పొందేది లక్షకు పైగానే. . చెల్లించేది  à°°à±‚. 100 మాత్రమేనా?  . .  

ఏ ఈ ఓ

అధికారి దేవస్థానం నుంచి తీసుకునేది నెలసరి వేతనం లక్ష రూపాయలకు పైగానే. అయితే ప్రతి రోజు అద్దె విషయం పై ఎటువంటి లెక్కలు రాయనివ్వకుండా, కార్యనిర్వహణాధికారి

తో మాట్లాడి నిర్ణయించవచ్చని సూచించారు. దీంతో ఇతను తమ పై అధికారి కావడం తో కాటేజీ సిబ్బంది మాట్లాడలేక పోయారు. అయితే నెలాఖరు గడిచే సరికి నెలసరి అద్దె రూ. 37500 ( 30

రోజులకు గాను) చెల్లించాల్సి ఉండగా, ఏ à°ˆ à°“ కేవలం రూ. 3000 మాత్రమే చెల్లించడంతో వీరు  à°•à°¾à°°à±à°¯à°¨à°¿à°°à±à°µà°¹à°£à°¾à°§à°¿à°•à°¾à°°à°¿ దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే ప్రయోజనం

లేకపోయిందన్నారు. à°’à°• అధికారి à°—à°¾ ఉండి , క్రింది స్థాయి తప్పు చేస్తే దండించవలసిన హోదా ఉన్న వ్యక్తే తానూ తప్పు చేస్తే ఈఓ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.  à°¦à±€à°¨à°¿à°ªà±ˆ

కూడా సమగ్ర విచారణ జరపాలన్నారు. 

నెలకు ఏఈఓ ద్వారా రూ. 34500 ఆదాయం à°—à°‚à°¡à°¿ . . . 

ఏ ఈ ఓ తులా రాముడు విధుల్లో చేరి సుమారు ఐదు నెలలు కావడం, పైగా ప్రతి నెలా కేవలం రూ. 3000

 à°®à°¾à°¤à±à°°à°®à±‡ చెల్లిస్తుండడం తో నెలకు సింహాచల దేవస్థానానికి రూ.34500 à°—à°‚à°¡à°¿ పడుతోందని ఆలయ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. దీనిపై చర్యలు తీసుకునే సాహసం దేవస్థానం లో

ఎవరూ చెయ్యక పోవడం గమనార్హం. ఆలయ నిర్వహణలో ఏ à°ˆ à°“ ప్రభావం ఎంతలా ఉందొ తెలుస్తోందని, ఆలయ సిబ్బంది, భక్తులు ఆవేదన చెందుతున్నారు.   

ప్రస్తుతం ఆలయంలో

జరుగుతున్న కొన్ని ఘటనల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈయన ప్రభావం కూడా ఉందని శ్రీనివాస్ మండిపడుతున్నారు. 

తక్షణం ఆలయంలో జరుగుతున్న అన్ని అపచారాలపై

సమగ్ర విచారణ చేయించి, దోషులందరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam