DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాల్గార్ ఘటన అత్యంత దుర్మార్గం: త్రిదండి అహోబిల జీయర్ 

*సాధువుల హత్య  à°‰à°¦à°‚తం పై చిన్న జీయర్ ఆవేదన వ్యక్తం*. .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

శంషాబాద్ / విశాఖపట్నం, మే 01, 2020 (డిఎన్ఎస్) : గత నెల

మహారాష్ట్రలోని పాల్గార్ లో నాగ సాధువులను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనను త్రిదండి అహోబిల జీయర్ స్వామి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన పై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త

చిన్న జీయర్ స్వామి శిష్యులు అహోబిల జీయర్ స్వామి వీడియో ద్వారా శుక్రవారం à°’à°• ప్రకటన విడుదల చేసారు. 

శంషాబాద్ లోని చిన్న జీయర్ స్వామి ( జీవా) ఆశ్రమం లో

ప్రస్తుతం పీఠాధిపతులు మాత్రమే ఉన్నారని, లాక్ డౌన్ సందర్బంగా భక్తులు ఎవరూ రావడం లేదని, ఆశ్రమం బయట జరిగే విషయాలు తమకు చేరే అవకాశం లేదన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఆశ్రమం

లోని శ్రీరంగ నాధా ఆలయంలో ఉత్సవాల సందర్బంగా వచ్చిన భక్తుల ద్వారా ఈ విషయం చిన్న జీయర్ స్వామికి తెలిసి చాలా కలత చెందన్నారు. వారి ఆదేశం మేరకు ఈ ప్రకటన విడుదల

చేస్తున్నట్టు వారి శిష్యులు అహోబిల జీయర్ స్వామి తెలిపారు. 

ఎక్కడో  à°­à°—వదారాధనలో ఉంటూ ఎవరికీ హాని చెయ్యని సాధువులు, పైగా వయో వృద్ధులు పై పోలీస్ à°²

సమక్షంలోనే  à°®à±‚కుమ్మడిగా ముష్కరులు దాడి చేసి హతమార్చడం సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం అన్నారు. à°ˆ ఘటన విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని, ఒకవేళ వారు

తప్పు చేసి ఉంటె ఈ దేశంలో చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అంతేకానీ సాధువులు, వయో వృద్ధులను, రక్షించమని ప్రార్ధన

చేసినప్పటికీ అత్యంత కిరాతకంగా దాడి చేసి హతమార్చడం బాధాకరం అన్నారు. ఈ దేశంలో సర్వేజనా సుఖినో భవంతు అని నిత్యం కోరుకునే వారు సాధువులు, సంత్ లేనన్నారు. అలాంటి

వారికే ఈ దేశంలో రక్షణ లేకపోతె సామాన్యులకు ఎలా లభిస్తుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ ఘటన జరిగిన మరో నాలుగు రోజుల తర్వాత ఉత్తర ప్రదేశ్ లోనూ

ఇలాంటి ఘటనే జరిగిందని తెలుస్తోందన్నారు. 

à°ˆ సాధువులకు ఉత్తమ గతులు లభించాలి అని, దుర్మార్గపు ఆలోచనల్లో ఉన్నవారికి సద్బుద్ధి కలగాలని అని ఆశించారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam