DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకాపా నగరాధ్యక్షుడే గతి తప్పితే క్యాడర్ పాటిస్తుందా?

*కంచె చేను మేస్తే. . . దూడ గట్టున మేస్తుందా?*

*పంపిణీ సరే. .నిబంధనలు తుంగలోకి తొక్కవచ్చా?*

*కనీస దూరం కనుచూపు మేరలో కానరాలేదు. . .*

*అత్యుత్సాహంతో

 à°…తలాకుతలం చేస్తే ఎలా?*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మే 04, 2020 (డిఎన్ఎస్) : పదిమందికి సాయం చెయ్యాలి అనుకోవడం మంచిదే అయితే దానికోసం

నిబంధనలు తుంగలోకి తొక్కేస్తే ఎలా? అంటున్నారు విశాఖనగరవాసులు.  à°•à°°à±‹à°¨à°¾ ప్రభావానికి అవస్థలు పడుతున్న వారికి ఆహార పదార్ధాలు అందించేందుకు అధికార పార్టీ

సభ్యులు చేస్తున్న కార్యక్రమాల్లో కనీస దూరం కనుచూపు మేరలో ఎక్కడ కనపడడం లేదు. పైగా సోమవారం విశాఖపట్నం లోని శివాజీపాలెం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర

అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ స్వయంగా నిర్వహించారు. ఈ పంపిణీలో పాల్గొన్న వారికి కనీస దూరం ( సోషల్ డిస్టెన్స్ ) అనే పదానికి అర్ధం కూడా తెలియని విధంగా

కనిపించింది. దీనిపై పలు విమర్శలు ఘాటుగానే వినిపిస్తున్నాయి. పంపిణీ చెయ్యడానికి కనీసం రెండు డజన్ల మంది రావడం, ఏ ఇద్దరి మధ్య కనీసం ఒక సెంటి మీటరు దూరం కూడా

లేకపోవడం గమనార్హం. à°† సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఉండడం గమనార్హం. 

నగర అధ్యక్షుని నేతృత్వం లో జరిగిన కార్యక్రమంలోనే కనీస దూరం

పాటించక పొతే. . . ఇక పార్టీ క్యాడర్ చేసే కార్యక్రమాల్లో అదేదో బంపర్ ఆఫర్ బజార్ లాగానే తయారవుతోందని పార్టీ అభిమానుల నుంచే విమర్శలు

వ్యక్తమవుతున్నాయి. 

అయితే అధికార పార్టీ కావడంతో పోలీసులు సైతం చర్యలు తీసుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందోనని భయంతో ఉన్నారని కొందరు ప్రతినిధులు

అభిప్రాయపడుతున్నారు. ఇక నగర పరిధిలో ప్రజా ప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలు అయితే అదేదో గ్రామా జాతర గానే దర్శనమిస్తున్నాయి. 

వీళ్ళని ఆదర్శంగా

తీసుకుని కొన్ని స్వచ్చంద సంస్థల వ్యక్తులు, పంపిణీలో ముగ్గురు కి మించి పాల్గొంటే వాళ్లపై మాత్రం అధికార కొరడా ఝుళిపిస్తోంది. అధికార పార్టీకి ఒక రూలు,

సామాన్యులకు à°’à°• రూలా అని ప్రశ్నిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam