DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాస్క్ ఉంటేనే కిరాణా అయినా మద్యం అయినా,  కలెక్టర్ నివాస్

*Saloons not permitted in district ,Srikakulam Collector*

*‌జిల్లాలో సెలూన్లకు అనుమతి లేదు: కలెక్టర్ నివాస్* 

*మాస్క్ ఉంటేనే కిరాణా అయినా మద్యం అయినా* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ ,

శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మే 05, 2020 (డిఎన్ఎస్) : 

శ్రీకాకుళం, మే 5: జిల్లాలో క్షౌర శాలల(సెలూన్లు)కు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు

మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  à°…ధికారులతో సమీక్షించారు. క్షౌర శాలల ద్వారా అనేక ప్రాంతాల్లో కరోనా కేసులు ప్రబలిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఒకే కుర్చీ,

ఒకే ఒక్క వస్త్రం అనేక మందికి వినియోగించడం జరుగుతుందని తద్వారా వైరస్ వ్యాప్తి పెరగగలదని పేర్కొన్నారు. మద్యం కొనుగోలుదారులు విధిగా గొడుగు, మాస్కు

వేసుకోవాలని కలెక్టర్ అన్నారు.  à°—ొడుగు వేసుకోవడం వలన à°Žà°‚à°¡ వేడిమి నుండి రక్షణతో పాటు భౌతిక దూరం పాటించుటకు అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు

ధరించాలని స్పష్టం చేసారు. మాస్క్ ధరించని వారికి సరుకుల విక్రయం ఉండదని చెప్పారు. నో మాస్క్ - నో (గ్రోసరి)కిరాణా అన్నారు. విక్రయదారులు, కొనుగోలుదారులు ఇద్దరూ

విధిగా మాస్క్ ధరించాలని చెప్పారు. శానిటైజర్లు కలిగి ఉండాలని, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. 

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. కె.

శ్రీనివాసులు, ఐటీడీఏ పిఓ సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, జిజిహెచ్ పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణ మూర్తి,

డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు, డీఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, డిపిఓ వి.రవికుమార్, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య,

ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, ఇన్ ఛార్జి ఆర్డీఓ ఆర్.గణపతి, ఎస్డీసి అప్పారావు, డిటిసి డా.వడ్డి సుందర్, విపత్తుల విభాగం ఇన్ ఛార్జి డిఎం బి.నగేష్, ప్రత్యేక అధికారి

జి.శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, డా.లీల, డా.రామ్మోహన్, డా. కృష్ణ మోహన్ తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam