DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరణించిన ప్రతి ఒక్కరికి రూ.  కోటి ఆర్ధిక సాయం:సీఎం వైఎస్ జగన్*  

*విశాఖ లో పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదం చాలా విషాదకరం* 

*చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి పరామర్శ.*

*ప్రతి గ్రామస్తునికీ రూ. 10 వేల రూపాయల

ఆర్ధిక సాయం.* 

*రాష్ట్ర యంత్రాంగం మొత్తం విశాఖకు తరలి వచ్చింది.* 

*ఘటన చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 07, 2020 (డిఎన్ఎస్) : విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్. వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలైన

దుర్ఘటన చాలా విషాదకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో గాయాలపాలై స్థానిక కింగ్ జార్జ్

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని అయన పరామర్శించారు. విజయవాడ నుంచి విశాఖ వచ్చిన ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యావత్తూ తరలి వచ్చింది. ఈ ఘటన

కారణంగా 9 మంది అమాయకులు మరణించడం చాలా దురదృష్టకరమన్నారు. వీరి కోటి రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు.  à°ˆ ఘటనలో మరణించిన  9 మంది కుటుంబాలకు అన్ని రకాలుగా

తోడు ఉంటానని మంచి మనిషిగా తోడు ఉంటానన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందేవారికి లక్ష రూపాయలు, వెంటిలేటర్ సహాయంతో ఉండవలసి వస్తే వారికి 10 à°²à°•à±à°·à°² సహాయం

చేస్తామన్నారు. 

ఎల్జీ వంటి మల్టి నేషనల్ సంస్థ లో ఇలాంటి ఘటన చాల బాధాకరమన్నారు. ఘటన పై పూర్తి విచారణకు కమిటీ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, నగర పోలీస్

కమిషనర్, ఇతర ఐఏఎస్ అధికారులతో ఐదుగురితో కమిటీ తో విచారణకు ఆదేశించారు. గ్యాస్ లీక్ అయినప్పుడు మొగవలసిన అల్లారం ఎందుకు మోగలేదని ప్రశ్నించారు. 4 గంటల సమయానికే

జిల్లా కలెక్టర్ సహా అధికారులంతా అక్కడికి చేరుకొని, అంబులెన్స్ లను పంపి, చాలామంది ని కాపాడగలిగారని అందరిని అభినందించారు. 
అపస్మారక స్థితిలో చాలామందిని

ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందన్నారు. ఈ గ్రామాల్లో 15 వేల మంది నివాసం ఉంటున్నారని, ప్రతి ఒక్కరికీ 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు. మెరుగైన

వైద్య సదుపాయాలను అందిస్తామన్నారు.  

మరణించిన ప్రతి జంతువుకూ రూ. 20 వేలు ఆర్ధిక సాయం చెయ్యడం జరుగుతుందన్నారు. మనుషులతో పాటు అవికూడా సమాజంలో జీవనం సాగిస్తూ

వారి జీవన విధానం లో భాగమై, à°ˆ దుర్ఘటనలో మరణించడం జరిగిందన్నారు.  

ముఖ్యమంత్రి వెంట ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ

శ్రీనివాస్ (నాని) , ఇతర మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, ఆరోగ్య శాఖా ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖా ఉన్నతాధికారి హరినారాయణన్, సహా ఇతర

ఉన్నతాధికారులు వచ్చారు. 

ఘటన జరిగిన  à°ªà°°à°¿à°¸à±à°¥à°¿à°¤à±à°²à°ªà±ˆ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ వి వినయచంద్, పోలీస్ కమిషనర్ ఇతర అధికారులను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. అంతకు

ముందు కె జి హెచ్ లో చికిత్స పొందుతున్న పలువురిని ఘటన జరిగిన సమయంలో వారు ఎదుర్కొన్న భయానక వాతావరణాన్ని విని ఆవేదన చెందారు. చికిత్స జరుగుతున్న ప్రతి ఒక్కరికీ

అత్యున్నత స్థాయి చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆదేశించారు. అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam