DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైరస్ పెరగడానికి మీరు కారణం కావద్దు, భాద్యత వహించండి

*పార్టీ నేతల వెంట గుంపులుగా తిరగద్దు, భయాన్ని పెంచొద్దు.*

*పాజిటివ్ కేసులు కారణాలు ఇవి కూడా కావచ్చు. . ఇవి చెయ్యకండి.* 

*పంపిణీల్లో ఫోటో, వీడియో

గ్రాఫర్లను అనుమతించవద్దు.*  

*చాలా చోట్ల కనీస దూరం పట్టించుకోకుండా తిరుగుతున్నారు.*

*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డా. కెవివివి సత్యనారాయణ

సూచనలు* 

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , రిపోర్టర్ , విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, మే 08, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి ప్రజల చెంతకు చేరనివ్వకుండా వేలాది

మంది ప్రభుత్వ అధికారులు, పోలీస్ లు, పారిశుధ్య విభాగం సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి పనిచేసి, ప్రజలను హెచ్చరిస్తూ, అవగాహనా కల్పిస్తున్నా . . రాష్ట్రంలో పాజిటివ్

కేసులు పెరుగుతుండడం పట్ల భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, డాక్టర్ కెవివివి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రాణాలకు తెగించి

ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి ఆశించిన రీతిలో సహకారం లభించడం లేదన్నారు. ప్రధానంగా లాక్ డౌన్ నిబంధనల ప్రకారం ప్రజలు ఇళ్లకే పరిమితం

కావాలన్నారు. అయితే కేవలం నిత్యావసరాల కొనుగోళ్ళకు ఒక్కరు మాత్రమే బయటకు రావాల్సి ఉండగా, ఇబ్బడి ముబ్బడిగా రోడ్లమీద జన సంచారం ఉందన్నారు. 

పేదలకు

నిత్యావసరాల పంపిణీ పేరుతో కొందరు చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో గుంపులు గుంపులుగా పాల్గొంటూ కనీస దూరం అనే పదానికి అర్ధం పూర్తిగా చెడగొడుతున్నారని

మండిపడ్డారు. ప్రధానంగా అధికార పార్టీ క్యాడర్ వెంట జాతరగా పాల్గొనడం అత్యంత బాధాకరం అన్నారు. పైగా అధికారగణం వీరికి దూరంగా ఉండడం గమనార్హం అన్నారు. ప్రధానంగా

పాజిటివ్ కేసులు పెరగడానికి కొన్ని కారణాలు ఇవి కూడా కావచ్చన్నారు. 

పాజిటివ్ కేసులకి à°•à°¾à°°à°£à°¾à°²à± ఇవి కూడా కావచ్చు. . . . 

*ప్రజల్లో భాద్యత లేకపోవడం / వహించక

పోవడం వలన .*

*బయట తిరిగినప్పుడు కనీస దూరం (social distance ) పాటించకపోవడం వలన.*

*పంపిణీల పేరిట విచ్చలవిడిగా తిరగడం వలన.?* 

*పార్టీ నేతల వెనకాలే ఎక్కువ మంది తిరగడం

వలన.*

*సూచన: మీరు బయట తిరిగినప్పుడు బాధ్యతారాహిత్యంగా ఉండి, వైరస్ వ్యాప్తిచెందడానికి కారణం కావద్దు. విశాఖ నగరంలో ప్రజలు ఎంతో భాద్యత గా ఉన్నారు అని

నిరూపించడం మన ధర్మం అన్నారు.*

దీనికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించవలసిన విషయాలు ఇవే:. . .

*1 . బయటకు వచ్చినప్పుడు ప్రక్కవారి నుంచి కనీసం రెండు మీటర్ల

దూరం పాటించండి.*

*2 . ఆహార పదార్ధాలు, నిత్యావసర సామాగ్రి పంపిణీ పాల్గొనాలంటే కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనండి. గుంపులుగా పాల్గొనవద్దు.*

*3. పార్టీ నేతల

వెనక కూడా ఇద్దరే ఉండండి. 20  à°²à±‡à°¦à°¾ 30 మంది పాల్గొని, ప్రజలని భయపెట్టవద్దు. వాళ్ళు ( పార్టీ నేతలు) కూడా à°ˆ ఊళ్ళో ఉండేవాళ్ళే,  à°Žà°•à±à°•à°¡à±‹ ఆకాశం నుంచి క్రిందకి దిగి రాలేదు.

వాళ్ళ పని వాళ్ళని చెయ్యనివ్వండి.*

అధికారులకు విన్నపం :. .

ప్రతి రోజూ కొనసాగుతున్న నిత్యావసర వస్తువుల పంపిణీ , ఆహార పదార్ధాల పంపిణీ కార్యక్రమాల్లో

సగానికి పైగా సొంత ప్రచారం, మెహర్బానీ కోసమే జరుగుతున్నాయన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో సెల్ ఫోన్ లు , స్టిల్ కెమెరాలు, వీడియో కెమెరాలను

అనుమతించకూడదన్నారు. 

ముఖ్యంగా  à°«à±‹à°Ÿà±‹ గ్రాఫర్లు, విడియోగ్రాఫర్ల కు, మీడియా వారిని కూడా అనుమతించ వద్దన్నారు. వీటిని ఇలా  à°¨à°¿à°·à±‡à°§à°¿à°‚చినట్టయితే పార్టీ నేతల

వెంట జనం కనపడరన్నారు. తద్వారా నిస్వార్ధంగా వస్తు పంపిణీ చెయ్యాలి అనుకునేవారు మాత్రమే రోడ్లపైకి వస్తారన్నారు. తద్వారా వైరస్ వ్యాప్తి కొంతవరకూ నిలుపుదల

చేయగలమన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam