DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీతక్క గన్ తో ఉన్నా, గన్ మ్యాన్ తో ఉన్నా అదే వేగం, ఉత్తేజం

*సీతక్క లాంటి ఎమ్మెల్యే కాగడా తో వెతికినా కానరారు.*

*కరోనా కష్టకాలంలో కానల వెంట నడుస్తూ కష్టజీవుల అండగా*

*కాలినడకనే కొండలు, గుట్టలు ఎక్కి,

తండాల్లో ప్రజా చైతన్యం*

*మీడియా లో ప్రచారానికి ఆమడ దూరం, నిరంతర సేవామార్గంలోనే* 

*గో కరోనా గో అనే ఉద్యమం పై DNS ప్రత్యేక కధనం*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS ,

బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మే 08, 2020 (డిఎన్ఎస్) :దనసరి అనసూయ . . .  à°—న్ చేత పట్టినా, గాన్ మ్యాన్ వెంట ఉన్నా అదే వేగం, అదే తేజం. నిరంతరం ప్రజాసేవే ధ్యేయం.

కిలోమీటర్ల దూరం కొండలు గుట్టలు ఎక్కుతూ వందలాదిగా తండాల్లో పర్యటిస్తూ గిరిపుత్రుల్లో కరోనా పై చైతన్యం కలిగిస్తున్న నిస్వార్ధ ప్రజా ప్రతినిధి ఈమె. గతం లో

ప్రజా ఉద్యమంలో గన్ను పట్టి పోరాటం చేసినప్పడి వేగం, ఉత్తేజం నేటికీ తగ్గలేదు అనడానికి గో కరోనా గో ఉద్యమమే నిదర్శనం. 

ఆమె పేరే ఒక సంచలనం, ఆమె అడవుల్లో

ఉన్నా, అసెంబ్లీ లో ఉన్నా అదే వేగం, అదే తేజం. అనసూయ అంటే చాలామందికి తెలియక పోవచ్చు, అయితే సీతక్క అనగానే తక్షణం స్ఫురించే పేరు ఆర్తుల పాలిట అండ. ప్రస్తుతం

తెలంగాణ లోని ములుగు అసెంబ్లీ స్థానానికి ప్రజా ప్రతినిధిగా అత్యంత గురుతరమైన భాద్యతలు వహిస్తూ నిస్వార్థ సేవలు అందిస్తున్నారు. రవాణా సదుపాయాలు సైతం

వెళ్లలేని క్లిష్టమైన ప్రాంతాల్లో సునాయాసంగా పర్యటిస్తూ ప్రజలకు ఆశాదీపంగా వెలుగొందుతున్నారు. 

సంచలనం సృష్టిస్తున్న గో కరోనా గో. . :

గో కరోనా గో

పేరిట సంకల్పించి, ప్రజా రవాణా కూడా చేరలేని తండాలు, గ్రామాల్లోకి వెళ్లి, ప్రజల బాగోగులు చూసి, వారికీ అవసరమయ్యే నిత్యావసరాలు, ఆహార పదార్ధాలు, వైద్య సదుపాయం,

అందించడంతో పాటు, వారిలో ఈ వైరస్ పట్ల అవగాహనా కల్పించడానికి ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. దీనికోసం ఆమె ఎంచుకున్న మార్గం కేవలం నడకే. వందలాది కిలోమీటర్ల దూరం

పంపిణీ సామాగ్రిని సైతం నెత్తిన పెట్టుకుని, వడివడిగా అడుగులు వేస్తూ. . అందరినీ ఉత్సాహపరుస్తున్నారు. 

వెంట ఉన్నవారి పట్ల ఆవేదన . . :

తన వెంట అడవుల్లో,

తండాల్లో, గ్రామాల్లో పర్యటించేందుకు నడుస్తున్న సహచరులను చూసి ఆమె ఆవేదన చెందుతున్నారు. వీరిలో చాలామందికి నడక అలవాటు లేకపోయినా, తనకు మద్దతు గా రావడం ద్వారా

వారిపట్ల చాలా గౌరవం పెరిగిందన్నారు. గతం లో ఉద్యమాల్లో ఉన్న సమయంలో తానూ ఇదే ప్రాంతాల్లో నడక సాగించిన అనుభవం ఉందని, ప్రతి గ్రామం, తండా తనకు బాగా పరిచయం

ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా తిరగని గ్రామాల్లో కూడా ఇప్పుడు ప్రయాణిస్తూ, ప్రతి ఒక్కరిలోనూ సంభాషించడం జరుగుతోందన్నారు. రోజుకు కనీసం

ఐదారు ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టు ఉత్సాహంగా తెలియచేస్తుంటారు సీతక్క. చాలా ప్రాంతాల్లో నడిచే మార్గం కూడా ఉండదని, వాగులు సైతం దాటుకుని వెళ్లాలని, ఎడ్ల

బళ్ళు సైతం మనుషుల్ని లాగే అవకాశం లేని తండాలు ఎన్నో ఉన్నాయన్నారు. 

మీడియా ఎక్కడా కానరాదు . .

సీతక్క చేపట్టిన ఈ మహోన్నత ఉద్యమం బయట సమాజానికి అంత

తొందరగా తెలియలేదు. దీనికి కారణం ఆమె వెంట మీడియా ప్రతినిధులు ఉండరు. ఆమె చేసే ఏ కార్యక్రమమైనా నేరుగా ప్రజలకే వెళ్లాలనే సంకల్పంతోనే నడుస్తున్నారు. అయితే ఇంత

మహోన్నత కార్యక్రమం బాహ్య ప్రపంచానికి తెలిసే సమయానికే ఆమె సగానికి పైగా గ్రామాలను పర్యటించేసారు. ప్రస్తుతం సోషల్ మీడియా సహా, సాధారణ ప్రసార మాధ్యమాలు ఈ

ఉద్యమాన్ని కొనసాగించే ప్రయత్నం లో ఉన్నాయి. 

నిరంతరం ప్రజా సేవే పరమార్దంగా జీవనాన్ని సాగించే సీతక్క లాంటి  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡ పట్టపగలే కాగడా వేసి వెదికినా

ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ, సహా ఇతర రాష్ట్రాల్లో సైతం కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి నేతలు రాష్ట్రానికి ఒక్కరు ఉన్నా ఆ ప్రాంత ప్రజలు

ప్రజాస్వామ్యం పట్ల కొంత నమ్మకంతో జీవనము సాగిస్తారన్నది అక్షర సత్యం. 

కరోనా కష్టకాలంలో ఆమెకు వెన్నుగా నిలిచి సహకరిస్తున్న దాతలకు, ఇతర కార్యకర్తలకు,

శ్రేయోభిలాషులకు ఆమె చెప్పే మాట ఇదే. . .

చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు, విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇంకా అనేక మధ్యతరగతి వ్యాపారవేత్తలు, ముందుకు

వచ్చి నాకు దాతలు రూపంలో సహాయపడుతున్నారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ క్షణం మీ అందరి తోని మాట్లాడలేక పోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ కరోనా నీ జయించిన తర్వాత

మిమ్మల్ని అందరినీ కలుస్తా నేను మీతో మాట్లాడుతాను, సోషల్ మీడియా ద్వారా, ఇంకా పత్రిక మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా బాధలు, కష్టాలు, పేద ప్రజల యొక్క

ఆకలి గోసలు ప్రపంచానికి తెలియజేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చేస్తున్న ఈ గొప్ప సహాయం ద్వారా చాలామంది చిన్నారుల మరియు పేదవాళ్ల కడుపు

నిండుతున్నాయి, మనం సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది కలిసి ముందుకు సాగుదాం దేన్నైనా ఎదుర్కొందాం. 

స్టే స్మార్ట్ స్టే సేఫ్ - ధన్యవాదాలు -  - మీ సీతక్క

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam