DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అపవాదు తప్పుకోడానికే ఎంపీ ల దొంగ దీక్ష : 


అపవాదు తప్పుకోడానికే ఎంపీ à°² దొంగ దీక్ష : 

విశాఖపట్నం, జులై 4 , 2018 (DNS Online ) : విభక్త ఆంధ్ర ప్రదేశ్ కు చట్ట రీత్యా లభించవలసిన హామీలను నెరవేర్చడానికి అత్యంత భక్తి

శ్రద్దలతో అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఒక్కరోజు దీక్షల్లో చిత్తశుద్ధి ఎంత ఉందొ బహిర్గతం చెయ్యాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పేరుకు ఒక్క

రోజు దీక్ష అంటారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కుస్తీ పడుతున్నారు. అంటే కేవలం 8 గంటల సమయం శిభిరం లో ఉంటున్నారు, మరి ఒక్కరోజు దీక్షలు గా ప్రచారం ఎందుకు

చేస్తున్నట్టు ? పైగా శిబిరం పై కూర్చున్నంత సేపు తప్పదు అన్న వ్యవహారం లోనే కనపడింది తప్ప, ప్రజల కోసం కష్టపడుతున్నట్టు లేదని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి.

కనీసం ఏ ఒక్కరూ కూడా స్ఫూర్తి దాయక మైన ప్రసంగం చెయ్యక పోవడమే దీనికి నిదర్శనంగా చెప్తున్నాయి. కనీసం చిత్తశుద్ధి లేకుండా జనం కోసం చేస్తున్న హంగామా లాగానే

కనిపిస్తోందన్నాయి. ఢిల్లీ లో చేయవలసిన ధర్నా లు విశాఖ గల్లీల్లో చేస్తున్నప్పుడే వీళ్ళ చిత్తశుద్ధి తెలుస్తోందని పార్టీ కేడర్ నుంచి కూడా అభిప్రాయాలు

వ్యక్తమవుతున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam