DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ ఎస్పీకి పరిపాలనా వచ్చు, పొలం పనులూ తెలుసు. .

*రైతుగా మారిన తిరుప‌తి అర్బ‌న్ ఎస్‌‌పి à°°‌మేష్ రెడ్డి*

*పిల్లలకు రైతాంగం, రైతుల గురించి కూడా నేర్పాలి*

*సగం జీతం ఉత్తమ విద్యార్థుల ప్రోత్సాహానికే

కేటాయింపు*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 12, 2020 (డి ఎన్ ఎస్ ): పోలీస్ విభాగం లో ఎస్పీ హోదాలో ఉన్న ఆయన చేసే పనులు సంచలనాలు ఎందరికో స్ఫూర్తి

గానూ నిలుస్తున్నాయి. చిత్తూరు జిల్లా ఎస్పీ ఏ రమేష్ రెడ్డి తన నెలసరి వేతనం లో సగం భాగం ఉత్తమ విద్యార్థులకే కేటాయిస్తున్నట్టు ప్రకటించి ఎందరికో స్ఫూర్తిగా

నిలిచారు. అదే విధంగా మంగళవారం రైతులతో కలిసి పనిచేసి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు.  

లాక్ డౌన్ విధులలో భాగంగా మంగళవారం రమేష్ రెడ్డి ఏర్పేడు ప్రాంతాలను

కలయ తిరుగుతూ ఉండగా ఏర్పేడు – వేంకటగిరి రహదారి ప్రక్కన పొలములో కొంత మంది రైతులు, రైతు కూలీలు పంట పొలములో వరి నార్లు నాటుతూ కనిపించరు. మంగళవారం పర్యటనలో

భాగంగా ఆయన తన వాహనము ఆపి రైతు కూలీల వద్దకు వెళ్లి వారి యొక్క యోగ క్షేమాల గురించి అడుగుతూ ముచ్చటిస్తూ అదే సమయంలో తానూ కూడా వారిలో ఒకరిగా మారిపోయారు. తానూ ఒక

పోలీస్ ఉన్నతాధికారి అనే హోదాను ప్రక్కన పెట్టి  à°°à±ˆà°¤à± కూలీగా వారితో మమేకమై తానూ కూడా వారి వద్ద నుండి వరి నారు కట్టను తీసుకొని తానూ కూడా పొలములో నాటడం

మొదలెట్టారు. ఇది గమనించిన మిగతావారు కూడా మిక్కిలి ఆనందంతో యస్.పితో కలసి నార్లు నాటారు. 

ఈ సందర్భంగా యస్.పి వారిని ప్రశ్నించగా నాకు వ్యవసాయం అంటే చాలా

ఇష్టం. మా నాన్న మా తాతల కాలం నుండి కూడా ఎక్కువగా వ్యవసాయం చేసేవారు. నేను అగ్రికల్చర్ బి.యస్.సి విధ్యాబ్యాసం చేసాను. నేను కూడా రైతు బిడ్డనే, మన మందరం ఈ రోజు మంచి

ఆహారం తీసుకుంటున్నామoటే అది కాయా కష్టం పడి పండిస్తున్న రైతులవల్లే. 
ప్రపంచమంతా మహమ్మారి కమ్మేసి వున్న సమయంలో కూడా పచ్చని గ్రామ వాతావరణంలో చిరు నవ్వుతో తన

కష్టాన్ని మరచి రైతులు కష్ట పడటం చూస్తూ వుంటే చాలా ఆచర్యంగా ఉంది. వారికి నా జోహార్లు. వ్యవసాయం అనేది ఎవరో చదువురానివారు, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉండే వారు

చేసే పని అని అనుకుంటున్నారు, అదికాదు. మంచి ఆహారం – మంచి ఆరోగ్యం – మంచి దేశం అనే ధ్యేయంతో మనమందరం వారికి తోట్పాటును ఇవ్వాలి. 

స్థాయితో సంబంధం లేకుండా

మనమందరం మంచి ఆహారం తింటున్నాం. మనలో సహాయం చేసే వారు కూడా ఉన్నారు. నా సూచన ఏమిటంటే ఇతరాత్ర బయటి ప్రాంతాలలో పనుల మీద గాని, ఉద్యోగంలో గానీ ఉన్న వారు సంవత్సరంలో

కొన్ని రోజులు తన సొంత ఊరికి వచ్చి గాని, మీ చుట్టూ ప్రక్కల గ్రామాల రైతుల వద్దకు వెళ్లి వారి బాధ సాధకాలను తెలుసుకొని మనవంతు సహకారం అందిస్తే బాగుంటుంది. వీలైతే

వారాంతరపు దినాలలో సినిమాలకు, షికార్లకు పోయే బదులు మీ సొంత గ్రామాలకు వెళ్లి రైతాంగానికి తోత్పాటునిస్తే సంతోషంగా ఉంటుంది. ఇలా జరిగితే ప్రతి ఊరు పచ్చగా ఉందటే

కూకుండా వ్యవసాయ à°°à°‚à°—à°‚ బలోపేతం అవుతుందన్నారు.  à°°à±ˆà°¤à±à°²à± రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయుత, భరోసాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలన్నారు. చదువుకున్న

యువత రైతాంగం మీద ద్రుష్టి సాధిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నేనే కాదు నా బిడ్డలు కూడా రాబోయే కాలంలో వ్యవసాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు ఇలా ఇక్కడ

రైతులు, రైతు కూలీలను కలుసుకోవడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. రైతులకు ఏ కష్టం వచ్చినా నా పరిది మేరకు సహాయం చేస్తానని సమదానమిచ్చారు. అనంతరం రైతు కూలీలకు

నిత్యావసర వస్తువులతోపాటు పండ్లు, కూరగాయలు అందజేశారు.

త్రిపుర క్యాడర్ కు చెందిన 2007 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఏడాది

ఫిబ్రవరి 8 న లో ఆంధ్ర కు తీసుకు రావడం జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్పీగా భాద్యతలు చేపట్టిన రోజునే అయన తన జీతంలో సగం భాగం ఉత్తమ విద్యార్థుల ప్రోత్సాహానికి

కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam