DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగు నీటి ప్రాజెక్టులకు ఉజ్వల భవిత : సభాపతి తమ్మినేని

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 14, 2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులకు ఉజ్వల భవిత ఏర్పడుతుందని

రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిధి గృహంలో గురు వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సాగునీటి

ప్రాజెక్టుల మంజూరు వివరాలను సభాపతి వివరించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో పొందూరు, ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో ఎత్తిపోతల పథకాలు, సాగు నీటి

ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని చెప్పారు. దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు ఇప్పుడు మంజూరు కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి

ప్రాజెక్టులపై దృష్టి సారించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికి ఏడు పథకాలను మంజూరు చేయుటకు చర్యలు చేపట్టడం పట్ల ఆయన

అభిందించారు. లైదాం, తండ్యాం, మదనాపురం, అన్నంపేట, వెన్నెలవలస,కలపర్తి, తిమ్మాపురం, నందివాడ తదితర ప్రాంతాలకు పథకాల వలన ప్రయోజనం కలుగుతుందని అన్నారు. నాగావళి,

వంశధార నదుల కరకట్టలపైనా దృష్టి సారించి ఎక్కడైతే గట్లు బలహీనంగా ఉన్నాయో అక్కడ ముందుగా పనులు చేపట్టాలని సూచించినట్లు చెప్పారు. ఆమదాలవలస నియోజకవర్గంలో

దీర్ఘకాలంగా ఎదురు చూసిన లైదాం ఎత్తిపోతల పథకానికి రూ.6.61 కోట్లతో శంకుస్ధాపన చేసామని, పనులు 75 శాతం పూర్తి అయిందని చెప్పారు. కరోనా లాక్ డౌన్ కారణంగా పనులు జాప్యం

అయ్యాయని చెప్పారు. తండ్యాం ఎత్తిపోతల పథకం రూ.22 కోట్లతో మంజూరు అయ్యిందని 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మెట్టుభూములకు సాగు నీరు సరఫరా

జరుగుతుందని సభాపతి చెప్పారు. మడ్డులస ప్రాజెక్టులో సైతం దాదాపు 12 వేల ఎకరాల భూ సేకరణ జాప్యం వలన కొన్ని పనులు ఆగిపోయాయని అన్నారు. రైతులకు నష్టపరిహారం

చెల్లించుటకు చర్యలు ప్రారంభం అయ్యాయని, మడ్డువలస కాలువ షేర్ మహమ్మద్ పురం వరకు వస్తుందని అన్నారు. మడ్డువలస ప్రాజెక్టు కాలువల ఎలైన్ మెంటు గతంలో మార్చుటకు

ప్రయత్నించారని, దానిని రైతులు అడ్డుకున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయుటకు పదిహేను రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయని పేర్కొన్నారు. రెల్లిగెడ్డ

పనులను నాబార్డు, ప్రపంచ బ్యాంకు నిధులు రూ.20 కోట్లతో చేపట్టారని, అదే పనులను నీరు చెట్టు నిధులు రూ.7.50 కోట్లతో చేపట్టినట్లు చూపించారని అన్నారు. రెల్లిగెడ్డ పనులు

ముక్కలుగా చేపట్టి నాణ్యతా ప్రమాణాలు లేకుండా పూర్తి చేసారని, వరదలకు నిర్మాణాలు కొట్టుకుపోయాయని వివరించారు. బినామీ, రాజకీయ బ్రోకర్లు అవినీతికి రెల్లి గెడ్డ

పనులు గురయ్యాయని చెప్పారు. నారాయణపురం ఆనకట్టను రూ.437 కోట్లతో ఆధునీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు సవివరమైన నివేదిక సమర్పించాలని అడిగారని

తెలిపారు. ఆధునీకరణ అంటే బ్యారేజ్ కమ్ రిజర్వాయర్ గా చేయడమని అన్నారు. తద్వారా శ్రీకాకుళం, గార, ఆమదాలవలస, సంతకవిటి మండలాల్లోని వేల ఎకరాలు సాగు నీరు పొందుతాయని

చెప్పారు. గతంలో జైకా నిధులతో  à°šà±‡à°¸à°¿à°¨ పనులపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. గతంలో చేసిన పనులతో ఎటువంటి ప్రయోజన కలుగలేదని రైతులకు అన్యాయం జరిగిందని

పేర్కొన్నారు. మదనాపురం నుండి నీలాదేవి పేట వరకు వయాడక్ట్ ద్వారా అనుసంధానం చేయడం వలన ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఓని గెడ్డ ప్రాజెక్టును రూ.5 కోట్లతో మంజూరు

చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులకు సాగు నీరు, మద్ధతు ధర, ఎరువులు, సకాలంలో విత్తనాలు, రుణాలు, గిడ్డంగి సౌకర్యం అందిస్తే అన్నం పెడతారని సభాపతి పేర్కొన్నారు.

రైతులు అంతకంటే ఎక్కువ ఆశించరని అన్నారు. à°ˆ ప్రాజెక్టులు పూర్తి కావడంతో వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని, రైతుల ఆశలు నెరవేరుతాయని పేర్కొన్నారు. 
అనంతరం

జలవనరుల శాఖ ఇంజనీర్లతో పనులపై సమీక్షించారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam