DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న జీయర్ స్వామి చే వీర హనుమత్ విరాట్ సేతు దీక్ష

https://www.youtube.com/user/jetworld ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగనుంది. 

">

హనుమజ్జయంతి నుంచి గురు పౌర్ణిమ వరకూ 

ఉదయం శ్లోక పఠనం, సాయంత్రం రామనామ జపం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మే 15, 2020 (డి ఎన్ ఎస్

): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రావణాసురుని బారి నుంచి మానవ సమాజంలో మనోబలం పెరిగి, సాధారణ జీవనాన్నికొనసాగించేందుకు à°ªà±à°°à°®à±à°– ఆధ్యాత్మిక వేత్త త్రిదండి

చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వీర హనుమత్ విరాట్ సేతు దీక్ష ను ఆరంభించనున్నారు. 

కరోనా నివృత్తి కి ఆధ్యాత్మికపరంగా మానవ సమాజంలో శక్తి

లభించడం కోసం దైవశక్తి కూడా తోడు కావాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి తెలిపారు. దుష్ట శక్తులను

పారద్రోలేందుకు వాల్మీకి రామాయణం లో కిష్కింధ కాండలో అద్భుతమైన శ్లోకాలను అందించారన్నారు. వాటిని అనుసంధానం చెయ్యడం ద్వారా మంచి ఫలితాన్ని

పొందవచ్చన్నారు. 

ఈ భయంకర రావణాసురుని బారి నుంచి ప్రజలందరూ రక్షించబడాలనే సంకల్పంతో హానుమజ్జయంతి ని పురస్కరించుకుని గురు పౌర్ణిమ వరకూ మండల దీక్ష ( 44

రోజుల పాటు ) గా వీర హనుమత్ విరాట్ సేతు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దీక్ష హనుమజ్జయంతి ( ఈ నెల 17 ) నుంచి గురుపౌర్ణిమ ( జులై 5 ) వరకూ అకుంఠిత దీక్షతో

సాగుతుంది.  

దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఉదయం 6 :30 గంటలకు కేవలం ఐదు శ్లోకాలను చదవ వలసిందిగా సూచించారు. ఎవరి ఇళ్లల్లో వారు ఉంటూనే ఈ శ్లోకాలను

పాటించడం ద్వారా ఒకే సారి లక్షలాది స్వరాలతో ఆంజనేయ స్వామిని గానం చెయ్యడం ద్వారా సర్వ భయ, వ్యాధి పీడా తొలగడానికి మార్గం సుగమం అయ్యి, ప్రభుత్వాలు, వైద్య బృందాలు

చేస్తున్న కృషి à°•à°¿ మంచి ఫలితాలు లభించి, యావత్ సమాజం సురక్షితంగా ఉండేందుకు భగవత్ అనుగ్రహం తోడవుతుందన్నారు. 

అదే విధంగా సాయంత్రం వేళల్లో శ్రీరామ నామ

జపాన్ని చేస్తూ ఒక్కో బియ్యపు గింజను à°’à°• పాత్రలోకి ఎరమని సూచించారు. ప్రతి రోజు 108 సార్లు రామ నామాన్ని పఠించాలని  à°¸à±‚చించారు. దీక్ష ముగిసిన తదుపరి వీటిని ఎవరైనా

పేదలకు ఇవ్వడం గానీ, దీనితో పాటు మరింత సామాగ్రిని కూడా జతపరిచి ఇవ్వడం ద్వారా ఒక కుటుంబానికి మనవంతు సహకారం చేసినట్టవుతుందన్నారు. లేదా వీటిని వండి ప్రసాదంగా

నైవేద్యం పెట్టి అందరికీ పంచవచ్చన్నారు. 

వాల్మీకి మహర్షి రచించిన రామాయణం లోని కిష్కింధ కాండ లోని 66 , 67 సర్గాల్లోకి అత్యంత ప్రాధాన్యమైన శ్లోకాలను నిత్యం

మండల దీక్షలో పారాయణ చేయడం జరుగుతుంది. 

ముందుగా ప్రతి ఒక్కరు తమ సంకల్పం చెప్పి, శ్లోకాలను పఠించాల్సిందిగా సూచిస్తున్నారు. 

ప్రతి ఒక్కరూ దీక్షగా

చెయ్యవలసిన సంకల్పం:  

భగవత్ భాగవత ఆచార్య కైంకర్య రూపేణ ఏవంగుణ విశేషణం విశిష్టాయాం అస్యాం శుభ తిథౌ వర్తమాన విపత్కర విషూచీ కరోనాది ఆదివ్యదీనాం

నిర్మూలనార్థం ఆత్మ మనోబలం అభివృద్ధ్యర్ధం,  à°µà±ˆà°¯à°•à±à°¤à°¿à°• శౌచ సిద్ధ్యర్ధం,  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• సమరసతా సిద్ధ్యర్ధం, పారస్పరిక వైమనస్య శాంత్యర్ధం, తద్విరుద్ధ  à°¸à°°à±à°µ శత్రు

నివారణార్ధం à°š, వీర హనుమత్ విరాట్ సేతు మండల దీక్షం ఆద్య కరిష్యే. . .    

ఉదయం 6 :30 గంటలకు పఠించవలసిన శ్లోకాలు :. . 

పక్షయోఃర్యద్బల్యం తస్య తావత్ భుజబలం తవ ! 
/> విక్రమశ్చాపి వేగశ్చ à°¨ తే   తేనావహీయతే !!    . . . . . . ( కిష్కింధ కాండ 66 - 6 )

బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుఙ్గవ !
విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుద్ధ్యసే !! . . . . . . (

కిష్కింధ కాండ 66 - 7 )

వీర !  à°•à±‡à°¸à°°à°¿à°£: పుత్ర !  à°¹à°¨à±à°®à°¾à°¨à± ! మారుతాత్మజ !
జ్ఞాతీనాం విపుల: శోక : త్వయా తాత! వినాశిత: !!   . . . . . . ( కిష్కింధ కాండ 67 - 33 )

గురూణాంచ ప్రసాదేన

ప్లవస్వత్వం మహార్ణవమ్ ! . . . . . . ( కిష్కింధ కాండ 67 - 35 )

త్వద్గతాని చ సర్వేషాం జీవితాని వనౌకసామ్!! . . . . . . ( కిష్కింధ కాండ 67 - 36 )

అతిబల ! బాల మాశ్రితాః స్తవాహం, 
హరివర ! విక్రమ !

విక్రమై  à°°à°¨à°²à±à°ªà±ˆ: !
పవన సుత ! యథాభిగమ్యతే సా 
జనక సుతా, హనుమాన్ ! కదా కురుష్వ !!  . . . . . . ( కిష్కింధ కాండ 44 - 17 )

సమాజ శ్రేయస్సుకోసం జరుగుతున్న ఈ మండల దీక్షలో మే 17

(హనుమజ్జయంతి ) నుంచి జులై 5 (గురుపూర్ణిమ) వరకు అవకాశం ఉన్నవారందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని జీయర్ స్వామి శంషాబాద్ ( హైదరాబాద్)

లోని జీయర్ ఆశ్రమం నుంచి ఆదివారం ప్రారంభించనున్నారు. దీన్ని యూట్యూబ్  ( 
https://www.youtube.com/user/jetworld ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగనుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam