DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక నుంచి దోపిడీలు, భూదందాలు ఆపెయ్యండి : లేదంటే రోడ్లపైకి లాగుతాం 

విశాఖపట్నం, జులై 5 , 2018 (DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్న ఎం ఎల్ ఏ లు, వాళ్ళ కొడుకులు, అల్లుళ్ళూ దోచుకుతింటున్నారని, అందరినీ చొక్కాలు పట్టుకుని

రోడ్డుపైకి లాక్కొస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గురువారం నగరం లోని పోర్ట్ కళావాణి స్టేడియం లో జరిగిన జనసేన కార్యక్రమం లో ఆయన రాష్ట్ర

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఎం ఎల్ ఏలు వాళ్ళ వారసులు చేస్తున్న అవినీతి దండాలు, భూ బాగోతాలపై ధ్వజమెత్తారు. చంద్ర బాబు నాయుడు అండ్ కో చేస్తున్న

అవినీతి దందాల్లో కనీసం కొంతైన నీతి ఉండి ఉంటే తాము మౌనంగానే ఉండేవాళ్లమని, అయితే వీళ్ళ ప్రజా కంటకులుగా మరి ప్రజలను పీడించడం వల్లే తాము ప్రజా క్షేత్రం లోకి

వచ్చామన్నారు. తాము పార్టీ పెడితే అది ప్రజల కోసం, మేము పార్టీ పెడితే అది కులాల కోసం అని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. ఇదే

పెద్దమనిషి 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దగ్గరకి ఎందుకు వచ్చినట్టు? మద్దతు ఎందుకు అడిగినట్టు చెప్పాలని అడిగారు. అదృష్టం బాగుంది బీజేపీ, తెలుగుదేశం, పవన్

కళ్యాణ్ కూటమి ఎన్నికల్లో గెలిచింది కనుక అది వాళ్ళ ఘనతగా చెప్పుకుంటున్నారని, ఒకవేళ నా దురదృష్టం కొద్దీ ఓడిపోయి, వైకాపా గెలిచి ఉంటే, ఈ ఓటమిని మొత్తం పవన్

కళ్యాణ్ à°•à°¿ అంటగట్టే ద్ధురని హేళన చేశారు. 


చంద్రబాబు అవినీతిలో కొంతైనా నీతి ఉండి ఉంటే కామ్ à°—à°¾ ఉండేవాళ్ళు : జన సేనాని 

అధికార పార్టీ ఎం ఎల్ ఏ లు వాళ్ళ

కొడుకులు, అల్లుళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని, ఇకపై ఎటువంటి పిచ్చి వేషాలు వేసిన చొక్కాలు పట్టుకుని రోడ్ల పైకి లాక్కొస్తామని హెచ్చరించారు. ఇకనుంచి

భూదందాలు, దోపిడీలు ఆపేయాలని, లేదంటే జనసేన నుంచి కాపాడుకోవాలని హెచ్చరించారు.  à°µà±€à°³à±à°³à± చేస్తున్న అవినీతి లో కనీసం ఒక్క శాతమైనా నీతి ఉండి ఉంటే తాము మౌనంగానే

ఉండేవాళ్లమని, ప్రతీ పనిలోనూ వాటాలు పుచ్చుకుంటున్నారని, కనిపించిన భూములను లాక్కోవడం, లేదా స్వాహా చేసెయ్యడమే పనిగా వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం

చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు డాల్ఫీన్ కొండలను కూడా మింగేసేలా ఉన్నారు.  à°®à±€à°°à± దోపిడీలు చేస్తుంటే నోరు మూసుకుంటారా ? అని ముఖ్యమంత్రి

చంద్రబాబు ని ప్రశ్నించారు. మీరు మీ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి కాదని, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి అనే విషయం గుర్తుందా అని

అడిగారు. 

పునరుజ్జీవాన్ని ఇచ్చింది విశాఖే . . . .

చదువు కు ఆటంకం వచ్చిన సమయం లో తనకు విశాఖ నగరమే నాకు పునర్జీవాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

స్థానికంగా ఉన్న సినీ స్టార్ మేకర్ సత్యానంద్ శిష్యరికంలో తానూ విశాఖ వీధుల్లో ఎన్నో వీధి నాటకాలు కూడా వేశామన్నారు. నాటి నాటకాల కధనం కూడా సామాజిక స్పృహే నని

తద్వారా సమాజం లో జరుగుతున్నా అన్యాయాల పట్ల సంపూర్ణ అవగాహనా వచ్చిందన్నారు. ఈ సమాజం లో అధికారం లో ఏ పాలుని వల్ల సామాన్యులకు పూర్తి న్యాయం జరిగినట్టు చరిత్ర లో

లేదన్నారు. à°ˆ న్యాయం ప్రజలకు అందాలనే జనసేన స్థాపించానన్నారు. 

మేము పార్టీ పెడితే కులాల్ని అంటగడతారా ?

మేము పార్టీ పెడితే ఒక సామాజిక వర్గాన్ని

అంటగట్టేస్తారా , మీరు నిజంగా ఒక సామాజిక వర్గానికే కొమ్ముకాస్తూ పార్టీని నడుపుతుంటే అది ప్రజా సేవా అని చంద్రబాబు నాయుణ్ణి దుమ్మెత్తి పోశారు జనసేనాని.

చంద్రబాబు జనసేన పై చేసిన వ్యాఖ్యలని ఖండిస్తున్నామని, జనసేన లో కులాల ప్రీ లేదని, కేవలం ప్రజా సైన్యం మాత్రమేనన్నారు. 

చంద్రబాబు లీక్ మాస్టర్ .. 


2014 మా

సహాయం కోసం తెలుగుదేశమే నా దగ్గర à°•à°¿ వచ్చింది. తీరా 

కేవలం చంద్ర బాబు తో నేను మాత్రం ఉన్న సమావేశంలో మెం ఇద్దరు మాత్రం జరిపిన అంతర్గత సమావేశం లో విషయాలు

మీడియా కి ఎవరు చెప్పారు ? నేను చెప్పలేదు, ఇక మిగిలింది చంద్రబాబే... ఆ సమావేశం లో ఆంధ్ర ప్రజలకు న్యాయమైన పాలన అందించామని మాత్రమే అడిగామని, అయితే వివిధ మీడియా

ఛానెళ్లలో చంద్రబాబు తో ప్యాకేజీలు మాట్లాడుకున్నారు అని ప్రసారం అయ్యిందన్నారు. ఈ టీవీ ఛానెళ్ల తో నేనెప్పుడూ ఈ విషయం మాట్లాడలేదని, ఇక నిత్యం టీవీలకు

అందుబాటులో ఉండే చంద్రబాబు మాత్రమే ఆన్నారు.. 
40 ఏళ్ళ అనుభవం ఏమైంది. à°ˆ రాష్ట్రానికి మీరు చేసింది ఏంటి అని ప్రశ్నించారు. 

అంతకు ముందు విశాఖ నగరానికి చెందిన

ప్రముఖ పారిశ్రామిక వేత్తలు  à°¬à±Šà°²à°¿à°¶à±†à°Ÿà±à°Ÿà°¿ సత్యనారాయణ, గుంటూరు నర్సింహా మూర్తి, గుంటూరు భారతి, తదితరులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. భారీ

సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 
తానూ ఎక్కడ, ఎలా ఉన్నా ప్రజల్లో జనసేన పార్టీ కలకాలం గుర్తు ఉండి పోవాలి అని అంటూ పవన్ చేసిన ముగింపుకు

బదులుగా బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు, జనసేన కార్యకర్తలకూ మార్గదర్శి, దిక్సూచి పవన్ కళ్యాణ్ మాత్రమేనని, అయన ద్వారానే పార్టీకి గుర్తింపు

అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam