DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్.ఆర్.డి.సి తో ఎంవోయు ఎంతో ప్రయోజనం : నన్నయ వీసీ ముత్యాలు నాయుడు

 à°µà°¿à°¶à°¾à°–పట్నం, జులై  5 ,  2018 (DNS Online ): ప్రఖ్యాత నేషనల్ రీసర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్  (ఎన్ ఆర్ à°¡à°¿ సి) తో ఒప్పందం కుదుర్చుకోవడం పరిశోధనాత్మాక  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± ఎంతో

ఉపయోగపడుతుందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ముర్రు ముత్యాల నాయుడు అన్నారు. గురువారం విశాఖపట్నంలోని ఎన్.ఆర్.డి.సి వారు నిర్వహించిన జాతీయ

సదస్సులో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చల మేరకు అవహగానా పత్రాలపై సంతకాలు చేయడం జరిగిందన్నారు. à°ˆ కార్యక్రమంలో  à°†à°¦à°¿à°•à°µà°¿ నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్

ముర్రు ముత్యాలు నాయుడు, నేషనల్ రీసర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హెచ్.పురుషోత్తం లు అవగాహాన ఒప్పందాలపై సంతకాలు

చేసారన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ ఎన్.ఆర్.డి.సి అధ్యాపకులు మరియు విద్యార్థులకు తగిన పరిశోధనా నిధులు పొందడానికి సహాయపడుతుందని చెప్పారు. అలాగే చివరి

సంవత్సరం విద్యార్థుల పరిశ్రమ సందర్శన, శిక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఎన్.ఆర్.డి.సి సహాయక కేంద్రాలలో ఇన్క్యూబన్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో సహాయపడుతుందని

అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయానికి మరియు ఎన్.ఆర్.డి.సి మధ్య సాంకేతిక అభివృద్ది, ఆవిష్కరణల అభివృద్ధి, ప్రక్రియలు, ఉత్పత్తులు మొదలైనవి జరిగేందుకు అవకాశం

ఏర్పాడుతుంది. అలాగే మార్కెటింగ్, లైసెన్సింగ్ యొక్క సంపూర్ణ హక్కులను అందించడానికి సహాయపడతుంది. ఇలా అనేక రకాల విద్య, సాంకేతిక ప్రయోజనాలతో ఈ అవగాహాన

ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందని వీసీ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో Andrew CZAJKOWSKI, Head, ITSS, WIPO, బి.కె.సాహు(ఎన్.ఆర్.డి.సి మేనేజర్), డా.వి.కేశవరావు (వైస్ చాన్సలర్, దామోదర్ సంజీవయ్య

నేషనల్ లా యూనివర్సిటి), డా.అనితరావు (డైరెక్టర్,డి.ఎస్.ఎన్.ఎల్.యు), డా.కె.వి.స్వామి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam