DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముగ్గురు చిన్నారుల వైద్యం కోసం స్పందించిన టిటిడి చైర్మన్ 

*సీఎం సహాయ నిధి నుంచి రూ. 7 లక్షల విడుదల* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 20, 2020 (డి ఎన్ ఎస్ ): ఏడో నెల నిండక ముందే పుట్టి తీవ్ర అనారోగ్యంతో

 à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿ లో చికిత్స పొందుతున్న ముగ్గురు బిడ్డల పరిస్థితిని విని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వేగంగా స్పందించారు. విషయం తన దృష్టికి వచ్చి 24 గంటలు గడవక

ముందే సి à°Žà°‚ సహాయ నిధి నుంచి రూ 7 లక్షలు విడుదల చేయించారు. 
వివరాలోకి వెళితే. . . ప్రకాశం జిల్లా నాగులుప్పల పాడు మండలం   ఉప్ప గుండ్లురు గ్రామానికి చెందిన కొలక

లూరి అంకయ్య  à°’ంగోలు టు టౌన్ పోలీసు స్టేషన్లలో కానిస్టేబుల్ à°—à°¾ పని చేస్తున్నారు. అతని భార్య  à°®à°°à°¿à°¯à°®à±à°® కు à°ˆ నెల 3à°µ తేదీ ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రిలో ప్రసవం

అయ్యింది. 7వ నెల కూడా నిండక ముందే ఇద్దరు పాపలు, ఒక బాబు పుట్టారు. వీరంతా నెలలు నిండక ముందే పుట్టడం తో ఆరోగ్యం ఇబ్బంది కరంగా మారింది. మెరుగైన చికిత్స కోసం

పిల్లలను ఒంగోలు లోని చందమామ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఇబ్బందిగా తయారు కావడం తో విజయవాడలో ని రైన్ బో చిన్న పిల్లల ఆసుపత్రికి తరలించారు. పిల్లల ప్రాణాలు

కాపాడటానికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. అంకయ్య పరిస్థితి చూసిన పోలీస్ సంఘం వారు కొంత సహాయం చేశారు. ఉద్యోగ భద్రత స్కీం  à°•à°¿à°‚à°¦ రూ

2లక్షల 10 వేలు అందాయి. మరో 30 రోజులు పిల్లలు ముగ్గురు వెంటిలేటర్ మీద చికిత్స పొందాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలు పోని అంకయ్య మంగళవారం తాడేపల్లి లో

టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలిసి తన గోడు వినిపించుకున్నారు. తన పిల్లల ప్రాణాలు కాపాడాలని వేడుకున్నారు. పిల్లలు ప్రాణాపాయం లో ఉన్న విషయం

విని చలించిన వైవి సుబ్బారెడ్డి వెంటనే సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. పిల్లల ప్రాణాలు కాపాడటానికి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిఎం సహాయ నిధి నుంచి రూ 7 లక్షలకు  à°¨à°—దు పరపతి పత్రం (ఎల్ఓసి) మంజూరు చేశారు. à°ˆ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam