DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు నాబార్డ్ రూ. 200 కోట్లు ఋణం  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 22, 2020 (డి ఎన్ ఎస్ ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఖరీఫ్ 2020 సంవత్సరానికి గాను విత్తనాల సరఫరా కి పాటుపడుతున్న

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) రూ. 200 కోట్లు ఋణం విడుదల చేసినట్టు నాబార్డ్ ప్రాంతీయ  à°šà±€à°«à± జనరల్ మేనేజర్ ( సి

జీ ఎం) ఎస్. సెల్వరాజ్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో విత్తనాభివృద్ధి సంస్థకు అవసరమయ్యే మూల ధనాన్ని అందించడం జరిగిందన్నారు. నాణ్యమైన సబ్సిడీ

విత్తనాల సరఫరాకు నోడల్ ఏజెన్సీ à°—à°¾ వ్యవహరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాల అవసరాలను తీర్చడానికి  10 నుంచి 12 లక్షల టన్నుల నాణ్యమైన

విత్తనాలను అభివృద్ధి చేస్తుందన్నారు. వారి, పెసర, మినప, వేరుశనగ, చిరు ధాన్యాల వంటి పంటలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పండించడం జరుగుతుందన్నారు. సేకరించిన

విత్తనాలను సంస్థ ప్రోసెసింగ్ కేంద్రాల్లో ప్రాసెస్ చేసి, నాణ్యతా ప్రమాణాలకై పరీక్షించి, శాస్త్రీయ పద్ధతుల్లో పాకింగ్ చేసి విత్తన విక్రయ కేంద్రాలకు

పంపించడం జారుతుందన్నారు. నాణ్యమైన పప్పు ధాన్యాలు, నూనె గింజల, అధిక ఉత్పత్తికి రైతులు à°ˆ నాణ్యమైన విత్తనాలను వినియోగించాలని ఆయన సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam