DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనపై 25 నుండి వినూత్న కార్యక్రమాలు 

*కలెక్టర్ లతో ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 23, 2020 (డిఎన్ఎస్ ):

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు వినూత్న కార్యక్రమాలపై సదస్సులను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 25 నుండి 30వ తేదీ వరకు వినూత్న కార్యక్రమాలపై

సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమం ఇదని చెప్పారు. జూన్ 25న పాలన, సంక్షేమంపై సదస్సులు

నిర్వహించాలని, 26à°¨ వ్యవసాయం, అనుబంధ రంగాలు, 27à°¨ విద్య, 28à°¨ పరిశ్రమలు, మౌళిక సదుపాయాలు, 29à°¨ ఆరోగ్యం అలాగే  30à°¨ రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవాలు ఉంటాయని ఆమె స్పష్టం

చేసారు. ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పారు. కరోనా నేపధ్యంలో అందరూ భౌతిక

దూరం పాటిస్తూ తక్కువ మందితో సదస్సులు నిర్వహించాలని ఆమె సూచించారు. కోవిడ్ - 19 గురించి మాట్లాడుతూ ఆసుపత్రులను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను

ఆదేశించారు. 

జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలపై 25 నుండి ప్రభుత్వ సూచనల మేరకు ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పారు.

సంబంధిత రంగాల్లో అనుభవజ్ఞులైన వ్యక్తులు, స్థానిక సచివాలయ ఉద్యోగులు,  à°ªà±à°°à°œà°²à°¤à±‹ సదస్సులు నిర్వహణకు చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు.

ఈ వీడియో

కాన్ఫరెన్స్ లో సహాయ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం.చెంచయ్య, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణ మూర్తి,

డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు, జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఏ.కళ్యాణ చక్రవర్తి, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం, నగర పాలక సంస్థ ఆరోగ్య

అధికారి జి.వెంకట రావు,  à°µà°¿à°ªà°¤à±à°¤à±à°² విభాగం ఇన్ ఛార్జి à°¡à°¿à°Žà°‚ బి.నగేష్, ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు à°¡à°¾.బి.జగన్నాథ రావు, రామ్మోహన్

రావు, కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam