DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వరుస కేసుల పరంపర తో ఠారెత్తిన మామిడాడ, బిక్కవోలు  

*రెడ్ జోన్ వలయంలో మామిడాడ, బిక్కవోలు, హై అలర్ట్*  

*రెడ్ జోన్ లో కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీమ్ ఆష్మి పర్యటన*   

*భయం వద్దు. . అవహగానా చెందండి :

ఎమ్మెల్యే డాక్టర్ నారాయణరెడ్డి*  

*రంగాపురం లో పాజిటివ్ కేసులు లేవు, తప్పుడు ప్రచారం నమ్మొద్దు.* 

 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

విశాఖపట్నం / కాకినాడ, మే 24, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  à°—à°¤ రెండురోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసుల వరుస పరంపర తో తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడ, పెదపూడి,

బిక్కవోలు మండలాల ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి జిల్లాలోని రామచంద్రపురం లో జరిగిన ఒక వివాహానికి హాజరైన తదుపరి, ఇతనికి కరోనా

వైరస్ సోకడం తో పాజిటివ్ గా తేలడం, ఈ క్రమంలోనే అతనిని కలిసిన వారు, ఇతర కలిసిన వారి ఇలా సుమారు 200 మందికి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. వీరిలో భారీ మొత్తం లో

పాజిటివ్ తేలడంతో à°ˆ మండలాల్లోని ప్రాంతాలను రెడ్ జోన్ à°—à°¾ ప్రకటించి, ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. 

రంగాపురం లో పాజిటివ్ కేసులు లేవు, తప్పుడు

ప్రచారం నమ్మొద్దు: . . . .

బిక్కవోలు మండల కేంద్రానికి కేవలం 4  à°•à°¿à°²à±‹ మీటర్ల దూరంలోనే ఉన్న రంగాపురం గ్రామంలో కూడా రెండు కరోనా కేసులు ఉన్నాయంటూ à°’à°•  à°¸à°¾à°¯à°‚కాలం

దినపత్రికలో ( విశాఖ కేంద్రంగా ఈ పత్రిక నడుస్తుంది) రాజమహేంద్రవరం ఎడిషన్ లో పనికట్టుకుని వార్తలు వ్రాయడాన్ని స్థానికులు తప్పు పడుతున్నారు. ఈ మీడియా ప్రచారం

కారణంగా గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, ప్రభుత్వ అధికారుల నుంచి కచ్చితమైన సమాచారం లేకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడాన్నిస్థానిక వైఎస్ఆర్

కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిరాజ్, భానుప్రసాద్ లు మండిపడుతున్నారు. బిక్కవోలు పాజిటివ్ వ్యక్తి బంధువులను కల్సిన కారణంగా ఈ గ్రామస్తులకు అధికారులు వైద్య

పరీక్షలు నిర్వహించారని, వీరికి నెగటివ్ వచ్చిందన్నారు. ఈ పరీక్షల ఫలితం తెలుసుకోకుండానే పత్రికలో ఈ గ్రామస్తులకు పాజిటివ్ అంటూ పుకార్లు ప్రచారం చెయ్యడం

ఏంటని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇదే సమాచారాన్ని సోషల్ మీడియా లో కూడా విస్తృతంగా ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు. 

ముందస్తు జాగ్రత్తగా రంగాపురం

గ్రామంలోకి చేరుకునే ప్రతి మార్గం వద్ద, గ్రామా వాలంటీర్లను ఉంచి, గ్రామంలోకి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేయించడం గమనార్హం. 

రెడ్ జోన్

ప్రాంతాల్లో కలక్టర్, ఎస్పీ à°² పర్యటన . . . . 

రెడ్ జోన్ గా ప్రకటించిన గొల్లల మామిడాడ, పెదపూడి, బిక్కవోలు మండలాల్లోని ప్రజలు ఆందోళనల్లో ఉండడంతో జిల్లా

కలెక్టర్‌ à°¡à°¿. మురళీధర్‌రెడ్డి,  à°ªà±‹à°²à±€à°¸à± ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి స్వయంగా పర్యవేక్షించి, గొల్లల మామిడాడలో పర్యటించి, అధికారులతో మాట్లాడి, ప్రజలలో ధైర్యాన్ని

కల్గించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. సాధారణ పరిస్థితికి వచ్చేవరకు జి మామిడాడను ఆయన రెడ్‌జోన్‌à°—à°¾ ప్రకటించారు. 

పర్యటనలో

వాళ్ళు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణతో కలిసి చేపడుతున్న చర్యలను

à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వైద్యులకు పలు సూచనలు చేశారు. 

అనంతరం స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్థానికులకు చేస్తున్న శ్వాబ్‌ పరీక్షల తీరు

పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో, సమీప ప్రాంతాల్లో ఎవరికి ఎటువంటి జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఉన్నా స్వచ్చందంగా పరీక్షలు

చేయించుకుంటే మంచిదన్నారు. 

భయం వద్దు. . చైతన్యం వంతులు కావాలి: ఎమ్మెల్యే నారాయణ రెడ్డి

కరోనా వైరస్ పట్ల భయాందోళనలు వద్దని, దీని నుంచి దూరంగా ఉండే

విధంగా అవగాహనా పెంచుకుని చైతన్యవంతులు కావాలని, అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి సూచించారు. అనుమానిత లక్షణాలున్న వారు ఆత్మన్యూనత

భావంతో వెనకంజ వేస్తే తర్వాత ఇబ్బంది పడతారన్నారు. ప్రజలంతా సహకరించాలని, అందరికీ శ్వాబ్‌ పరీక్షలు పూర్తి చేస్తామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ఇప్పటికే కొందరిని కాకినాడ క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించామని, వైద్యుల పర్యవేక్షణలో వారందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామ న్నారు. 

కరోనాతో మృతి చెందిన

వారి మృతదేహాలకు స్వగ్రామంలో దహన సంస్కారాలు చేయడాన్ని అడ్డుకుంటున్నారని, ఇది పొరపాటన్నారు. ఇందుకు భిన్నంగా మామిడాడ ప్రజలు అభ్యంతరం చెప్పకుండా

సహకరించడాన్ని అభినందించారు. మృతి చెందిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులకు పరీక్షలు చేయగా ఆరు పాజి టివ్‌ కేసులు వెలుగు చూశాయి. వీరిని వైద్యుల

పర్యవేక్ష ణలో క్వారరటైన్‌కు తరలించామని ఆర్డీవో తెలిపారు. 

మరోపక్క తొలిసారిగా బిక్కవోలులో కొవిడ్‌ కేసులు రావడంతో à°ˆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌లో

చేర్చారు. పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్స్‌ à°•à°¿à°‚à°¦ ఆరుగురిని క్వారంటైన్‌కు తరలించారు. అటు గొల్లలమామిడాడలో మృతుడి కాంటాక్ట్స్‌, ఆయన

బంధువుల కాంటాక్ట్స్‌ à°•à°¿à°‚à°¦ 30 మందిని గుర్తించి కాకినాడ జేఎన్‌టీయూ ప్రభుత్వ క్వారంటైన్‌లో చేర్చారు.  à°®à°°à±‹ 200 మందికి గ్రామంలోనే కొవిడ్‌ పరీక్షలు చేశారు. మామిడాడ

గ్రామంలో కొవిడ్‌ అనుమానితులు ఉండే ప్రాంతం కిక్కిరిసి ఉండడంతోపాటు ఇళ్లు దగ్గరదగ్గరగా ఉండడం, జనసాంద్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అధికారుల సూచన మేరకు మరో 200

మందికి శ్వాబ్‌ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించారు. గ్రామం లో ప్రత్యేక పారిశుధ్య పనులు వెంటనే చేపట్టారు.

స్థానిక పరిస్థితులను మండల తహశీల్దార్‌

రాజ్యలక్ష్మి, ఎంపీడీవో విజయభాస్కర్‌, ఎస్‌ఐ లక్ష్మి పర్యవేక్షిస్తున్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam