DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వెంకన్న విరాళాలు అమ్మే హక్కు మీక్కెక్కడిది: స్వామి పరిపూర్ణానంద

*అమ్మకం విరమించాల్సిందే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా . . .*  

*à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆస్తుల అమ్మకంపై మండిపడుతున్న కోట్లాది భక్తులు* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం )

గుంటూరు / విశాఖపట్నం, మే 24, 2020 (డి ఎన్ ఎస్ ): కోట్లాది మంది భక్తులు తమ ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీనివాసునికి కానుకగా ఇచ్చిన స్థిరాస్తుల విరాళాల

అమ్మకానికి సిద్ధపడిన టిటిడి బోర్డు పై భక్తులు మండిపడుతున్నారు. ఎవరో దాతలు తమ స్వామికి ఇచ్చిన భూములు, స్థలాలు, ఇళ్లను అమ్మడానికి టిటిడి బోర్డు కి హక్కు ఎవరి

ఇచ్చారని శ్రీ పీఠాధిపతులు స్వమై పరిపూర్ణానంద మండిపడ్డారు. భక్తులు తమ ఇష్ట ప్రకారం స్వామికి విరాళంగా ఇచ్చినవి నిరర్ధకం అని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి

ఎలా నిర్ణయిస్తారని మండిపడ్డారు. వీళ్లకు అనుభవించడానికి అనువుగా లేకపోతె అవి ఉపయోగం లేనివేనా అని ప్రశ్నించారు. కేవలం రెండేళ్ల కాలం పాటు

శ్రీవేంకటేశ్వరునికి వీళ్ళు సేవ చెయ్యడానికి వచ్చిన సేవకులు మాత్రమేనని, వీళ్ళు టిటిడి కి ఓనర్లు కాదన్నారు. రెండేళ్ల కాలం పాటు పని చేసే సేవకులు ఇలాంటి

నిర్ణయాలు తీసీసుకుంటుంటే. . . ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రంలో అధికారం లో ఉన్న పాలకులు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అన్నారు. టిటిడి ఆస్తులపై పాలకుల కన్ను

వెయ్యడం, దోచుకోవడం వీళ్లతోనే మొదలు కాదని, గతంలో చంద్రబాబు నాయుడు, అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి, అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అయన కంటే ముందు ఎన్ టి

రామారావు ఇలా అందరూ 
తిరుమల పైనే ద్రుష్టి సారించారన్నారు. తక్షణం ఈ ఆలోచన విరమించుకోకుంటే భక్తుల నుంచి వచ్చే ఉద్యమం ఈ పాలకులు తట్టుకోలేరన్నారు. వీళ్ళు వందల

ఏళ్ళు అధికారం లో ఉండరని, ఏదో ఒక్కరోజు కచ్చితంగా కాలం చేయాల్సిందేనన్నారు. ఉన్నన్ని రోజులు స్వామికి సేవ చేసుకుంటే మంచి రోజులు వస్తాయన్నారు. స్వామి

అనుగ్రహంతో భక్తులు మంచి మెజారిటీ ఇచ్చి అధికారం కట్టబెడితే వీళ్ళు హిందూ వ్యతిరేక కార్యక్రమాలపైనే ఎక్కువగా ద్రుష్టి పెడుతున్నారన్నారు. భక్తుల మనోభావాలతో

ఆటలాడడం మంచి పరిణామం కాదన్నారు. 

ఆస్తుల విక్రయం విరమించాల్సిందే: . . కన్నారు. .. 

టిటిడి ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయం తక్షణం విరమించుకోవాలని

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఒక లేఖ వ్రాసారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తులను అమ్మకాన్ని నిలిపివేయాలని,  à°­à°•à±à°¤à±à°² ఆగ్రహానికి గురికావద్దన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి

భక్తులు విరాళాలుగా ఇచ్చిన భూములను కేవలం నిర్వహించడానికి మాత్రమే అధికారం ఉందని, అమ్మడానికి ఎలాంటి అధికారం లేదని అధికార ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా

దుయ్యబట్టారు. హిందు మతాన్ని రాష్ట్రంలో లేకుండా చేయడానికి ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రయత్నిస్తోందని,భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉరుకోదని ఈ సందర్భంగా కన్నా

లక్ష్మీనారాయణ అధికార ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

*à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆస్తుల అమ్మకంపై మండిపడుతున్న కోట్లాది భక్తులు* 

తిరుమల శ్రీనివాసునికి భక్తులు ఇచ్చిన

సుమారు 50 స్థిరాస్తులను అమ్ముతున్నట్టు టిటిడి చేసిన ప్రకటనపై కోట్లాది హిందూ భక్తులు మండిపడుతున్నారు. దీన్ని తక్షణం నిలిపి వెయ్యాలని సోషల్ మీడియాల్లో సేవ్

టిటిడి పేరుతొ పెద్ద ఉద్యమమే నడుస్తోంది. కొందరు భక్తులు టిటిడి బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు న్యాయ పోరాటానికి సిద్దపడుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam