DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కార్యనిర్వాహకులు బాధ్యతగా ఉండాలి: జెడ్పి సీఈఓ చక్రధరరావు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 28, 2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం జిల్లాలోని గ్రామ / వార్డు కార్యనిర్వాహకులు వారి విధుల పట్ల

బాధ్యతగా వ్యవహరించినపుడే ఆర్జీదారుల పనులు సకాలంలో పూర్తికాగలవని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.చక్రధరరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం

స్థానిక బాపూజీ కళామందిర్ లో శ్రీకాకుళం డివిజన్ స్థాయిలోని గ్రామ/ వార్డు కార్యనిర్వాహకుల సర్వీసెస్ పై శిక్షణా కార్యక్రమంజిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ

అధికారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 935 సచివాలయాలు ఉన్నాయని, వీటిలో అన్ని రకాల సేవలు ప్రజలకు త్వరగా అందించాల్సి ఉందని అన్నారు.

ఆర్జీదారులు దరఖాస్తు చేసిన 5 రోజుల్లోగా వారి పనులను పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఇందుకు గ్రామ / వార్డు కార్యనిర్వాహకులు వారి స్థాయిలోని పనులను వేగవంతం చేయడం

వలన అధికారుల పనులు మరింత సులభతరం అవుతుందని చెప్పారు. ఆర్జీదారు చేసుకున్న దరఖాస్తులపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారులకు పంపడం ద్వారా ఆర్జీదారు కోరిన

వాటిని గడువులోగా పొందవచ్చని సూచించారు. ఈ విధమైన సత్వర సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసారని, ఇందుకు

అణుగుణంగా కార్యనిర్వాహకులు పనిచేయాలని కోరారు. కార్యనిర్వాహకులు తమ లాగిన్ ఐడిని ప్రతీ రోజూ పరిశీలించాలని, లాగిన్ లో ఉండే ఆర్జీలను పరిశీలించి విచారణ జరిపిన

అనంతరం సదరు ఆర్జీదారు ఇందుకు అర్హుడా , కాదా అనే విషయాన్ని వివరంగా తెలియజేయాల్సి ఉందన్నారు. ఉత్తమ సేవలు అందించిన కార్యనిర్వాహకుల వారి సేవల పట్ల ఆర్జీదారులు

ప్రశంసలు కురిపిస్తారని చెప్పారు. ఆర్జీదారుల ఎటువంటి సమస్యలైనా గ్రామ/వార్డు స్థాయిలో పరిష్కరించే దిశగా కార్యనిర్వాహకులు పనిచేయాల్సి ఉంటుందని

తేల్చిచెప్పారు. తొలుత ఆర్జీదారుల నుండి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే విషయమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా

కార్యనిర్వాహకులకు మాస్టర్ ట్రైనీలు వివరించి, కార్యనిర్వాహకుల సందేహాలను నివృత్తి చేసారు.
          à°ˆ శిక్షణా కార్యక్రమంలో ఇడిఎం పి.ఇంద్రశేఖర్, మాస్టర్

ట్రైనీలు డిపిఎం కిరణ్ బాబు, ఎడిపిఎం జి.కిశోర్, కె.గిరిబాబు, కె.ప్రవీణ్ కుమార్, శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ పరిధిలో గల గ్రామ / వార్డు కార్యనిర్వాహకులు తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam