DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాడు యాత్ర లో మాట ఇచ్చాడు- నేడు పాలనలో నిలబెట్టాడు

*నవరత్నాలతో నడుస్తున్న నవ్యంధ్ర నిర్మాణ కర్త . . .* 

*కష్టాల్లో కడలి లో కాలు పెట్టినా. . .కంట తడి పెట్టలేదు. .*

*దేశ చరిత్రలో మొదటి సారిగా పోలీసులకు వీక్లి

ఆఫ్ ఇవ్వడం.*

*ఏడాది పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు. . .*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 30, 2020 (డిఎన్ఎస్) : కాలు క్రింద

పెట్టనక్కరలేనంత ఆస్థి, హోదా, కార్లు, దర్పం ఉన్నా, అవేవీ కాదనుకుని, తమ కుటుంబాన్నే నమ్ముకుని కోట్లాది మంది ప్రజల కష్ఠాలు, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు

కష్ఠాలను సైతం కోరి తెచ్చుకుని తన కాలు 2017 లో ఇంటి నుంచి బయట పెట్టిన నవ యువకుడే. . . .వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  à°ªà±à°°à°œà°¾ సంకల్ప యాత్ర పేరిట ప్రజల సమస్యలు వినేందుకు వచ్చిన

అతను, 2019 లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో అధికారంలోకి వచ్చి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పదవి ప్రమాణ స్వీకారం చేసి నేటికీ సరిగ్గా ఏడాది కాలం

పూర్తయ్యింది.  . . . నాడు యాత్రలో తానూ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు నిరంతరమూ శ్రమిస్తూనే ఉన్నాడు. 

ఇది ప్రజా సంకల్ప ఫలితమే . . . 

ప్రజా సంకల్ప యాత్ర పేరిట

సుమారు రెండేళ్ల కాలం పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామగ్రామాన నడిచిన ఓ నవయువకుడు ప్రజల కష్టాలు విన్నాడు . . . ఇచ్చిన మాటను ఆచరణలో పెట్టేందుకు అతని

ఇచ్చిన హామీని నమ్మి యావదాంధ్ర ప్రదేశ్ ప్రజలూ మూకుమ్మడిగా పూర్తి మెజారిటీ తో 151 శాసన సభ సీట్లు ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు అంటే. . . పూర్తిగా ఇది ప్రజా

సంకల్పం ఫలితమే. ప్రజలు పూర్తిగా à°ˆ యువకున్ని నమ్మారు అని దేశవ్యాప్తంగా బహిరంగతమైంది.    

నిత్యమూ పోరాటమే: . . . .

ఆర్ధికంగా పూర్తి నష్టాల్లో ఉన్న ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలబెట్టేందుకు దాదాపుగా నిత్య పోరాటమే చేస్తున్నాడు. తానూ ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీ నవరత్నాలు.  à°¦à±‡à°¶ వ్యాప్తంగా ఏ

ప్రాంతంలో విన్నా నవరత్నాల పేరు మారు మ్రోగిపోతోంది. వీటి అమలు కు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎవ్వరినీ నొప్పించక ప్రతి అడుగు ఆచి తూచి వేస్తున్న

దార్శినికుడు. 

దేశ చరిత్రలో మొదటి సారిగా పోలీసులకు వీక్లి ఆఫ్ : . .. 

ప్రజా సంకల్ప యాత్రలో పోలీస్ విభాగం లో విధులు నిర్వహించే హోమ్ గార్డ్ లు, క్రింది

స్థాయి సిబ్బంది, అధికారులు కనీసం సెలవు కూడా లేకుండా పనిచేస్తున్న విషయాన్ని తెలుసుకుని వారికి వారానికి ఒక రోజు సెలవు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తన ప్రజా

సంకల్ప యాత్రలో అడుగడుగునా రక్షణ కల్పిస్తూ, ప్రజలను ఇబ్బంది పడకుండా పోలీస్ సిబ్బంది పడిన ఇబ్బందులను చాలా దగ్గర నుంచి చూడడంతో వీరికి ఒక వారంలో ఒక రోజు

విశ్రాంతి కావాలని భావించారు. 

భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పోలీసులకు వీక్లి ఆఫ్ ఇవ్వడం అనేది కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కావడం గమనార్హం.

పసికందుల

నుంచి . . .వృద్ధుల వరకూ . .

రాష్ట్రంలో నివాసం ఉండే పసి కందు నుంచి  à°µà±ƒà°¦à±à°§à°¾à°ªà±à°¯à°‚లో ఉన్న ముదుసలి వరకూ వారి వారి అవసరాలను తీర్చే విధంగా ఒక్కో పధకాన్ని ప్రవేశ

పెట్టి, అందరి ముఖాల్లోనూ చిరునవ్వు చూడగలిగే విధంగా బృహత్తర కార్యాచరణ చేపట్టారు. చదువుకునే పిల్లలకు అమ్మఒడి నుంచి, పెద్దలకు ఆరోగ్య శ్రీ వరకూ ప్రతి

ఒక్కరినీ కలుపుకుంటూ ఇంటి వద్దకే ప్రభుత్వ పధకాలను అందుబాటులోకి తీసుకు వచ్చి దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు మార్గదర్శనం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న

బృహత్తర పథకాలు ఇవే. .. 

రైతాంగానికి రైతు భరోసా (విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సలహాలు సూచనలు వంటి ) , పీఎం కిసాన్‌ పథకం (కేంద్రంతో అనుబంధం), à°‹à°£ మాఫీలు, ఉచిత

బీమా, ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్స్‌ à°à°°à±à°ªà°¾à°Ÿà± 

రవాణా కార్మికులకు, కుల వృత్తులు చేసుకునే వారికి ఆర్ధిక ప్రోత్సాహం,  

మత్స్యకారుల కోసం పెద్ద ఎత్తున

సంక్షేమ పథకాలు తెచ్చారు. ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రం కూడా ఏర్పాటు. 

డ్వాక్రా స్వయం ఉపాధి బృందాలకు, వడ్డీలేని ఋణాలు

లక్షలాదిగా నిరుద్యోగ యువతకు

ఉద్యోగ నియామకాలు, 
 
గ్రామా, వార్డు స్థాయిలోనే సచివాలయాల ఏర్పాట్లు, ఇంటి వద్దకే ప్రభుత్వ పధకాల అమలు, పింఛన్‌ అందజేత . . .

ఇంటర్ లోగా విద్యార్థులకు అమ్మఒడి

పధకం, ఆపై విద్యార్థుల వారికి నవశకం, తదితర పథకాల ద్వారా ఆర్ధిక ప్రోత్సాహం నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలోకే అందించడం, 

దివ్యాంగులకు వయసుతో సంబంధం

లేకుండా 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్లు సదరన్‌లో ప్రభుత్వ వైద్యశాఖ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ఉంటె ఆర్ధిక ప్రోత్సాహం. 

కిడ్నీ

వ్యాధిగ్రస్తులకు: మూత్రపిండాల వ్యాధి బారిన పడిన రోగులు, క్రమం తప్పకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చికత్స చేయించుకుంటున్న వారు à°ˆ పింఛన్‌

పొందడానికి అర్హులు. 

à°’à°‚à°Ÿà°°à°¿ మహిళలు, వితంతువులు, హిజ్రాలకు à°…à°‚à°¡à°—à°¾ నిలిచేందుకు పింఛన్‌ అందిస్తున్నారు. 

ప్రార్ధనా సంస్థల్లో సేవలందించే వారికి సైతం

ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రత్యేక పధకాలను అమలు చేస్తున్నారు. 

వీటన్నింటికి అదనంగా రాష్ట్రాభివృద్ధి కోసం పరిశ్రమలు, ప్రయివేట్ రంగ సంస్థల సహకారం

కోసం ఎన్నో వెసులు బాట్లు అందిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న జగన్మోహనుడు ఒక్కో అడుగు వేస్తూ విజయాపథం వైపు సాగుతున్నాడు. 

కేవలం ఒక్క ఏడాది

సమయంలోనే ఇన్ని ఆలోచనలు అమలు చెయ్యగలుగుతున్నారంటే రానున్న నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగం లో నిలబెట్టగలరు అనే నమ్మకం అందరిలోనూ

కలుగుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam