DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిఎంసిలో వసతుల కల్పన: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం,  à°œà±‚న్  04, 2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం, జూన్ 4 : శ్రీకాకుళం ప్రభుత్వ వైద్యకళాశాలలో పూర్తి స్ధాయి

మౌళికవసతుల కల్పనకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) పేర్కొన్నారు. గురు వారం

రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తో కలసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°  à°µà±à°¯à°¾à°ªà±à°¤à°‚à°—à°¾ ఆరోగ్య ఉప కేంద్రాల నుండి బోధన

ఆసుపత్రుల వరకు అత్యాధునిక సౌకర్యాలు ఉండాలని ముఖ్య మంత్రి ఆశయమన్నారు. పేద ప్రజలకు కూడా మంచి వైద్యం అంది ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో అదనంగా 16 వైద్య

కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని, వాటికి అనుబంధంగా 16 బోధన ఆసుపత్రులను కార్పోరేట్ స్ధాయిలో నెలకొల్పడం జరుగుతుందని చెప్పారు. మౌళిక సదుపాయాలు లేని చోట మౌళిక

సదుపాయాలు కల్పించాలని దృష్టి సారించామని అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వం సర్వజన ఆసుపత్రిలో రూ.60 కోట్లతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వైద్య విద్యకు

సంబందించిన సీట్లు పెరుగుదల, వసతి సదుపాయాలు, మెరుగుదలతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉందని ఆ మేరకు పూర్తి

స్ధాయిలో ప్రతిపాదనలు తయారు చేసి నాలుగు రోజుల్లో సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. రాష్ట్ర వైద్య విద్యా శాఖ సంచాలకులను సైతం జిల్లా కలెక్టర్ తో

చర్చించి ప్రతిపాదనలు తక్షణం పరిశీలించాలని ఆదేశించారు. వారం రోజుల్లో 9,700 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్న దృష్ట్యా శ్రీకాకుళం వైద్య కళాశాల, ఆసుపత్రి అవసరాలను

అందులో చేర్చాలని సూచించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రూ.16 వేల కోట్లతో మౌళిక వసతులను కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టులో పనులకు

టెండర్లు పిలుస్తామని మంత్రి చెప్పారు. నర్సింగు కళాశాల సిబ్బంది మంజూరు, సిటి,ఎం.ఆర్.ఐ స్కాన్ యంత్రాలు పనిచేయడం లేదనే పరిస్థితి వద్దని, కొత్తవి కావాలంటే

ప్రతిపాదన పంపాలని మంత్రి సూచించారు. కార్పొరేట్ తరహాలో రోగులకు వైద్య సదుపాయం కల్పించాలని, అసంపూర్తి నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని  à°®à°‚త్రి ఆదేశించారు.

వైద్య కళాశాలకు ప్రత్యేక బస్సు, నాణ్యమైన వసతి  à°¸à°¦à±à°ªà°¾à°¯à°¾à°²à± కావాలని ప్రిన్సిపాల్ కృష్ణవేణి కోరగా, బస్సుకు స్ధానికంగా నిధులు సేకరించి సమకూర్చుకోవాలని మంత్రి

సూచించారు. శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో పని చేయని వారికి పోస్టింగు ఇచ్చినా ఫలితం ఉండదని అందుకు తగిన ప్రభుత్వ విధానం తీసుకు వచ్చుటకు ప్రయత్నిస్తామని

స్ధానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు డిప్యూటేషన్లపై మంత్రి దృష్టికి తీసుకు వచ్చిన అంశంపై స్పందిస్తూ చెప్పారు. విశాఖపట్నంలో డిప్యుటేషన్ నియమించిన

నెఫ్రాలజిస్టు డిప్యుటేషన్ ను రద్దు చేసామని చెప్పారు. 

రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలలో

వైద్యానిది ప్రధమ స్థానం అన్నారు. జిల్లాలో సమస్యలను గుర్తించామని మంత్రి చెప్పారు. డెప్యూటేషన్ ల రద్దు గురించి సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, జిల్లా

నుంచి పోస్టింగ్ తీసుకున్న వారు ఎవరూ బయటకు వెళ్ళొద్దని కోరారు.  

కార్యక్రమం లో శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, రాష్ట్ర వైద్య

విద్యా సంచాలకులు డా.వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam