DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా తీవ్రంగా ఉంది. రెండింతలు సురక్షిత చర్యలు

*మీ కోసం, మీ కుటుంబం కోసం భద్రత పాటించాలి*

*జిల్లాలో 206 పాజిటివ్ కేసులు, 198 బయట నుంచి వచ్చినవే* 

*హోమ్ క్వారంటీన్ వారు బయటకు తిరిగితే చర్యలు* 

*(DNS

రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  à°œà±‚న్  08, 2020 (డిఎన్ఎస్ ):* మీ కోసం మీ కుటుంబం కోసం భద్రంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె

నివాస్ పిలుపునిచ్చారు. కోవిడ్ 19, 5వ విడత లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వం కల్పించిన సడలింపుల దృష్ట్యా ప్రజలను ఉద్దేశిస్తూ జిల్లా కలెక్టర్ ఒక సందేశాన్ని విడుదల

చేసారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ నష్టపోకుండా తద్వారా చిన్నా, చితక వ్యాపారులు, చిరు ఉద్యోగులు, పేద వర్గాలు ఉపాధి కోల్పోకుండా ప్రభుత్వం సడలింపులు ఇచ్చిందని అన్నారు.

కరోనా తగ్గిపోయింది, నివారణ అయిందని కాదని ప్రజలు గుర్తించాలని కోరారు. దేశంలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయని గ్రహించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ భౌతిక

దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, చేతులు తరచుగా శుభ్రపరచుకుంటూ కోరనా వైరస్ కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసారు. యువత తమకు వైరస్ సోకదనే విధంగా బయటకు

తిరుగుతున్నారని అయితే తమ కుటుంబంలోని చిన్నారులు, వృద్ధులకు ప్రమాదం ఉందని గ్రహించాలని సూచించారు. మనం ఒకరి నుండి వైరస్ ను అంటించుకోరాదని, అదేవిధంగా బయటి

వారికి అంటించరాదని ఆయన కోరారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులకు 14 రోజుల వరకు దూరంగా ఉండాలని కలెక్టర్ నివాస్ చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 206 పాజిటివ్

కేసులు రాగా అందులో 8 కేసులు మినహా మిగిలిన కేసులు బయటి నుండి వచ్చిన వారిలో మాత్రమే పాజిటివ్ కనిపించిందన్నారు. 80 శాతం కేసుల్లో ఎటువంటి కరోనా లక్షణాలు

కనిపించడం లేదని గ్రహించాలని అన్నారు. లక్షణాలు లేవని వారితో కలిసి తిరగడం అతి ప్రమాదం అని చెప్పారు. మూడు రోజుల క్రిందట జిల్లాలో వచ్చిన కేసు వివరాలు

పరిశీలిస్తే హోమ్ క్వారంటీన్ లో ఉండాల్సిన వ్యక్తి బయట తిరగడం జరిగిందని, ఆ క్రమంలో 70 మందితో కలిసారని పేర్కొన్నారు. అందరిని క్వారంటీన్ లో పెట్టవలసి వచ్చిందని

స్పష్టం చేసారు. బయటి నుండి వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపరాదని అయితే మనం, మన కుటుంబం దృష్ట్యా కలవకపోవడం శ్రేయస్కరం అన్నారు. రానున్న మూడు నెలలు అతి

కీలకమైనవని కలెక్టర్ నివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలని చెప్పారు. 

కీలక స్ధితి – రెండింతలు జాగ్రత్తలు పాటించాలి

:

కీలకమైన స్ధితిలో ఉన్నామని అన్నారు. ఐదవ దశ సడలింపులలో భాగంగా బస్సు, రైలు తదితర అన్ని రవాణా వ్యవస్ధల ద్వారా ప్రజల రాకపోకలు అధికం అయ్యాయని కలెక్టర్

పేర్కొన్నారు. వలసదారులు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా వలసదారులు వచ్చిన జిల్లా శ్రీకాకుళం అన్నారు. ఇప్పటి వరకు 12,870 మంది జిల్లాకు వచ్చారని

తెలిపారు.  à°•à°°à±‹à°¨à°¾ నుండి బయటపడ్డామని, సాధారణ స్ధితిలోకి వచ్చామని ప్రజలు భావిస్తున్నట్లు ఉన్నారని, అది నిజం కాదన్నారు. రెండింతలు జాగ్రత్తలు పాటించాలని

సూచించారు. జిల్లాలో వచ్చిన పాజిటివ్ కేసులు గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటి వరకు రాకపోవడంతో ప్రజలు కొంత మేర ఫ్రీగా తీసుకుంటున్నారని తెలిపారు. జిల్లాకు వచ్చే

వారిని హోమ్ క్వారంటీన్ లో వారి అంగీకారం మేరకు పెడుతున్నామని అయితే బయటకు తిరుగుతున్న సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. క్వారంటీన్ లో ఉండకుండా బయటకు

తిరుగుతున్న వారి సమాచారం అందించాలని అటువంటి వారిపట్ల విపత్తుల నివారణ చట్టం, ఎపిడమిక్ చట్టం క్రింద చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. హోమ్

క్వారంటీన్ లో ఉండే వారికి చేతిపై ముద్ర వేయడం జరుగుతుందని చెప్పారు. చేతిపై ముద్ర ఉన్న వ్యక్తి బయటకు తిరిగితే సమాచారం అందించాలని కోరారు. రాష్ట్రంలో

అత్యధికంగా క్వారంటీన్ లు నడుపుతున్న జిల్లా మనదని, ప్రస్తుతం క్వారంటీన్ లలో 6 వేల మంది ఉన్నారని తెలిపారు. 

మృతుల అంత్యక్రియలకు ఇబ్బందులు : 

కరోనాతో

మరణిచిన వారి అంత్య క్రియలు జరగడంలో ఎన్నో ఇబ్బందులు చూస్తున్నామని జిల్లా కలెక్టర్ నివాస్ అన్నారు. కుటుంబ సభ్యులు కూడా హాజరు అయ్యే పరిస్ధితి లేదని – అటువంటి

మరణం ఎవరికీ రాకూడదని కోరుకోవాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ముందుచూపుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్చడంతో మన రాష్ట్రం వైద్య

సేవలు అందించడంలో సఫలం అయ్యిందని అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్స్ ఇచ్చే పరిస్ధితి లేదని స్పష్టంగా తెలియజేస్తున్నారని అన్నారు. 
లాక్ డౌన్

కాలంలో జిల్లా ప్రజలు ఎంతో తోడ్పాటును అందించారని కలెక్టర్ అన్నారు. జిల్లాలో అన్ని శాఖలు రేయింబవళ్లు పనిచేస్తూ అనునిత్యం ప్రజల రక్షణ కోసం పోరాటం

చేస్తున్నారని పేర్కొంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా మరింత సహకారం అందించాలని పిలుపునిచ్చారు. వచ్చే వారికి రవాణా ఏర్పాట్లు, క్వారంటీన్, సహాయక

కేంద్రాల నిర్వహణ, పరీక్షలు చేయడం, ఆహారం, నీరు, వసతులు కల్పించడం వంటి సేవలలో నిమగ్నమయ్యారని తెలిపారు. ఆటోల్లో పది మంది వరకు ఎక్కుతున్నారు. మీ కుటుంబానికి అది

క్షేమకరం కాదు. డబ్బులు కోసం చూస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు కరోనా వైరస్ కు గురి కాగలరు. సడలింపులు ఇచ్చారని అని సులభంగా తీసుకోవద్దన, జిల్లా కోరనా భారీన పడకుండా

ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam