DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర అనుమతి లేకుంటే విమాన టికెట్ అమ్మకూడదు.

*ప్రయాణీకుల భాద్యత విమాన సంస్థలే తీసుకోవాలి. .*

*ప్యాసింజర్ లిస్ట్ గమ్యస్థాన జిల్లా కలెక్టర్లకు పంపాల్సిందే* 

*అనుమతి లేకుండా వచ్చేవారిని

అదుపులోకి తీసుకోవాలి.*

*విశాఖ ఎయిర్ పోర్ట్ లో  à°¹à±‹à°®à± క్వారంటైన్ స్టాంప్ వెయ్యరా?* 

*బీజేపీ రాష్ట్ర ఈసీ డా. కెవివి సత్యనారాయణ డిమాండ్*

*(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం). . .*

*విశాఖపట్నం, జూన్ 09, 2020 (డిఎన్ఎస్):* ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు విమానాల్లో వచ్చే ప్రయాణికులకు తప్పని సరిగా స్పందన నుంచి

అనుమతి ఉంటేనే విమాన టికెట్లు విక్రయించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ కెవివి సత్యనారాయణ డిమాండ్ చేసారు. 
కరోనా కట్టడి కోసం కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నం చేస్తున్నా, ప్రజల్లో ఏమాత్రం భాద్యత కనపడడం లేదని మండిపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించారు తప్ప, పూర్తి గా రద్దు

చేయలేదన్నారు. విమాన సేవల సంస్థలు పూర్తిగా బాధ్యతారాహిత్యం లో ఉన్నాయని అభిప్రాయం పడ్డారు. వీళ్ళు టికెట్లు విక్రయించే సమయంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

నుంచి స్పందనలో రిజిస్టర్ అయి, ఆంధ్ర లో ప్రవేశించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పాస్ ను కచ్చితంగా టికెట్ లో నమోదు చేయాలన్నారు. 

గత రెండు, మూడు రోజుల

క్రితం విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన ఘటన తో విమాన సంస్థల బాధ్యతారాహిత్యం బయటపడిందన్నారు. బెంగుళూరు, చెన్నై ల నుంచి వచ్చిన కొందరు ప్రయాణీకుల్లో స్పందన లో

రిజిస్టర్ చేసుకోనున్న వీరిని విమాన ప్రయాణానికి అనుమతించడం జరిగింది. అయితే. . ఈ నెల 7 న బెంగుళూరు నుంచి వచ్చిన ప్రయాణీకులను పరిశీలించేందుకు, వారి వివరాలు నమోదు

చేసుకునేందుకు విమానాశ్రయం లో సిబ్బంది లేకపోవడంతో వారు నేరుగా గమ్యస్థానాలకు వెళ్ళిపోయినట్టు తెలుస్తోందన్నారు.  à°µà±€à°°à°¿à°²à°¾ ఎంతమంది తమ ఇళ్లకు నేరుగా వెళ్లి

ఉంటారో తెలియదన్నారు.  

హోమ్ క్వారంటైన్ స్టాంప్ లు వెయ్యనక్కరలేదా?. . . 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు విమానాశ్రయంలోనే నమోదు చేసుకుని,

వారికీ పరీక్షల తదుపరి అక్కడే హోమ్ క్వారంటైన్ స్టాంప్ లు వెయ్యవలసి యుందన్నారు. అయితే బెంగుళూరు నుంచి వచ్చిన వారికి ఇవేవీ జరగక పోగా వారు నేరుగా కాకినాడ లోని

వారింటికి వెళ్లిపోయారన్నారు. వీరు ఎక్కిన విమానం విశాఖ చేరుకునే సమయానికి విమానాశ్రయంలో వీరిని పట్టించుకునే వారే లేకపోవడంతో వీరు తమ ఇళ్లకు వెళ్లినట్టు

తెలుస్తోందన్నారు.  

విమానం ఎప్పుడు వస్తుందో సమాచారం ఇవ్వాలి:

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఏ విమానం ఎప్పుడు విశాఖ చేరుతుందో సమాచారం జిల్లా

కలెక్టర్ కార్యాలయానికి కచ్చితంగా ఇవ్వాలని, దీనితో పాటు ఆ వచ్చే విమానంలో ప్రయాణం చేసే ప్రయాణీకుల వివరాలను కూడా ఆ విమాన నిర్వహణ సంస్థ వారే కలెక్టర్ కార్యాలయ

అధికారులకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. తద్వారా ప్రయాణీకులకు హోమ్ క్వారంటైన్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుందన్నారు. 

విపత్కర కరోనా

వ్యాప్తి చెందకుండా ప్రజలని రక్షించుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉందన్నారు. 

టికెట్ ఇవ్వడంతోనే భాద్యత పూర్తి కాదు . .

విమాన సంస్థలు కూడా

భారత దేశంలోని ప్రజలేనని, వారికి కూడా కనీస భాద్యత ఉంటుందన్నారు. టికెట్ అమ్మే ముందే సదరు ప్రయాణీకుడు గమ్యస్థానం ( ఆంధ్ర ప్రదేశ్) లో అడుగు పెట్టేందుకు ఆ

ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలని డిమాండ్ చేసారు. ఆ అనుమతి ( స్పందన) పాస్ ఉంటేనే అతనికి టికెట్ అమ్మాలని కోరారు. అలా అనుమతి పాస్ లేకుండా

టికెట్ అమ్మే విమాన సంస్థ పై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam