DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరోసారి లాక్ డౌన్ ఉండదు, పుకార్లు నమ్మొద్దు: జివిఎల్

*ఆర్ధిక వ్యవస్థ నిలబడాలంటే ప్రజలే జాగ్రత్త గా ఉండాలి.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):* à°ˆ నెల మూడవ వారం నుంచి

మరో సారి పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రసార మాధ్యమాల్లో వస్తున్నా వార్తలు పూర్తిగా అవాస్తవమని, పుకార్లు నమ్మవద్దని భారతీయ జనతా పార్టీ ఎంపీ ( రాజ్య సభ)

జి వి ఎల్ నరసింహారావు తెలియచేస్తున్నారు. బుధవారం ఒక మీడియా ఛానెల్ లో జరిగిన చర్చలో ఆయన ఈ విషయాన్నీ స్పష్టం చేసారు. ఇప్పడికే భారత్ లో ఆర్ధిక వ్యవస్థ

కుంటుపడిపోయిందని, మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తే కోలుకోవడం చాల కష్టమన్నారు. ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసారని, తద్వారా

చాలామంది ప్రజల్లో అవగాహనా కల్గిందన్నారు. ఇప్పడికే పూర్తి స్థాయిలో వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలు, దేవాలయాలు తెరవడం జరిగిందన్నారు. విధులు

నిర్వహించేవారు, సందర్శకులు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించాలని, కనీస దూరం పాటించాలని తెలిపారు. ప్రమాదకరం గా ఉండే ప్రాంతాల్లో ఉండేవారు వర్క్ ఫ్రమ్ హోమ్

చేయాలన్నారు. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప, దూరంగా పారిపోకూడదన్నారు. స్వీయ రక్షణ చేసుకుంటూ, తోటి వారిని కూడా రక్షించడం ఒక్కటే ప్రస్తుతం అందరి ముందూ

ఉన్న మార్గం అన్నారు. 

భారత్ లో మరోసారి కఠిన తరమైన లాక్ డౌన్ అమలు చెయ్యడం లేదని తేల్చి చెప్పారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ల్లో జరుగుతున్నా ప్రచారంలో

నిజం లేదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam