DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కట్టుదిట్ట ఏర్పాట్లతో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం

*అలిపిరి సహా అన్ని ప్రవేశ ద్వారాల వద్దా భక్తులకు పరీక్షలు*

*పీపీఈ కిట్ à°² రక్షణతో కేశ à°–à°‚à°¡à°¨, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విభాగాల సిబ్బంది* 

*గురువారం నుంచి సామాన్య

భక్తులకు శ్రీవారి దర్శనం*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం): . . .

*తిరుమల / విశాఖపట్నం,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):*  à°•à±‡à°‚ద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను

అమలుపరుస్తూ గంటకు à°Žà°‚à°¤ మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం చేయించవచ్చో క్షేత్ర స్థాయిలో  à°…వగాహకు రావడానికే ట్రయల్ రన్ తర్వాత సాధారణ భక్తులకు దర్శన

ఏర్పాట్లను ప్రారంభించారు. అత్యంత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతో టిటిడి విభాగాల సిబ్బంది విధుల్లోకి వచ్చారు. కేశ ఖండన శాలలో సిబ్బంది పూర్తి పీపీఈ కిట్లు

ధరించి, భక్తులకు తలనీలాలు తీస్తున్నారు. ప్రతి భక్తుని తర్వాత చేతులను పూర్తిగా శానిటైజర్ తో శుభ్రం చేస్తుకుంటున్నారు. భక్తులు సైతం ముఖానికి మాస్క్ లు

ధరించాల్సి యుంది. ఇతర విభాగాల సిబ్బంది సైతం పూర్తి రక్షణ సదుపాయాలతో సిద్ధమైయ్యారు. రెండు రోజుల పాటు కేవలం టిటిడి సిబ్బంది, కుటుంబ సభ్యులు, స్థానికులకు దర్శనం

కల్పించిన à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ గురువారం నుంచి సామాన్య భక్తులకు దర్శనం అందిస్తున్నారు. 

దీనికోసం టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఇతర

అధికారులు తిరుమల లోని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 
క్యూలో భౌతిక దూరం అమలవుతున్న విధానాన్ని చూసి అధికారులకు  à°ªà°²à± సూచనలు చేశారు. కానుకలు

సమర్పించేందుకు భక్తులు హుండి వద్దకు వెళ్ళేప్పుడు, బయటకు వచ్చేప్పుడు నాన్ ఆల్కాహాల్ సానిటైజర్ తో చేతులు శుభ్రం చేస్తున్న విధానాన్ని

పరిశీలించారు.

గంటకు 500 మందికి దర్శనం చేయించవచ్చని అధికారులు అంచనా వేసినట్టు తెలియచేస్తున్నారు. దర్శనం ప్రారంభించిన 2 గంటల్లో 1200 మంది భౌతిక దూరం పాటిస్తూ

స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. మూడు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించి అవకాశాన్ని బట్టి రోజువారీ దర్శనాల సంఖ్య పెంచుతామని ఆయన తెలిపారు. క్యూలైన్

లో భక్తులు గ్రిల్స్, గోడలు తాకకుండా వారికి అవగాహన కల్పిస్తామని, ఆలయం ప్రాంగణంలోని తాగునీటి కుళాయిలను కూడా చేత్తో తాకకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు

తెలిపారు.  

దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడానికి రాష్ట ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశామని అనుమతి వస్తూనే ప్రసాదాల పంపిణీ

ప్రారంభిస్తామన్నారు. భక్తులకు అతిదగ్గరగా విధులు నిర్వహించే సిబ్బందికి పీపీఈ కిట్లు అందించామన్నారు. లడ్డు కౌంటర్లలో  2 గంటలు సగం కౌంటర్లు, à°† తర్వాత సగం

కౌంటర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయం, క్యూ కాంప్లెక్స్ తో పాటు లడ్డూ కౌంటర్ల ను కూడా ప్రతి 2 గంటలకు సానిటైజ్ చేయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు

వెల్లడించారు. 

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతో త్వరగా కరోనా తొలగిపోయి ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యాంగా ఉండాలని ఆయన కోరారు. అలిపిరి వద్ద భక్తులను

స్క్రీనింగ్ చేసి, సానిటైజ్ చేశాకే తిరుమలకు అనుమతిస్తున్నామని ఈఓ వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam