DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ దేశ చరిత్రలో దార్శనిక పాలనతో మోడీ చరిత్ర సృష్టించారు

*భారత్ దేశ చరిత్రలో దార్శనిక పాలనతో మోడీ చరిత్ర సృష్టించారు* 

*భాజపా వర్చువల్ ర్యాలీలో ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వెల్లడి*  

*రాష్ట్ర వ్యాప్తంగా

ఆన్ లైన్ లో భారీ సంఖ్యలో పాల్గొన్న క్యాడర్ . . .*

*హైటెక్ బహిరంగ సమావేశాలతో బీజేపీ చరిత్ర సృష్టించింది* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):* à°†à°§à±à°¨à°¿à°• భారత్ దేశ చరిత్రలో దార్శనిక పాలనతో ప్రధాని నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించారని, భారతీయ జనతా పార్టీ

ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్ మాధవ్ ప్రకటించారు.  

బుధవారం నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ భాజపా వర్చువల్ (వీడియో ద్వారా బహిరంగ సభ) ర్యాలీ లో ఆయన కీలక ప్రసంగం

చేసారు. విజయవాడ నుంచి జరిగిన ఈ ర్యాలీ లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ల నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత

సురక్షితంగా జరుగుతున్న à°ˆ సమావేశం ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న సామాన్య కార్యకర్తను సైతం అగ్రనేతలు పలకరించగలిగే అవకాశం ఉంది. 

ఈ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ కేంద్రంలో రెండవసారి ఏర్పడిన మోడీ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరం కాలంలో చేసిన చారిత్రాత్మక నిర్ణయాలు లాక్ డౌన్ కారణంగా తీసుకున్న నిర్ణయాలు ఆత్మ

నిర్మాణ భారత్ ప్యాకేజీ గురించి వివరించారు. అత్యంత క్లిష్టమైన లాక్ డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా కలిగిన ఆర్ధిక నష్ఠాలను భర్తీ చేస్తూ రూ. 20 లక్షల కోట్లను ఆర్ధిక

సాయం గా ప్రకటించడం అత్యంత ప్రాధాన్యత లభించిందన్నారు. అదే విధంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రతిపక్షాలతోనూ తరుచుగా చర్చలు జరిపి వారి సూచనలకు అత్యంత

ప్రాధాన్య ఇస్తూ లాక్ డౌన్ సమయంలో అందరి మన్ననలూ పొందారన్నారు.

భారత దేశ సురక్షితం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఒక ప్రక్క పాకిస్తాన్ ఉగ్ర దాడులు, చైనా

దాడుల నుంచి భారత్ భూభాగాన్ని కాపాడేందుకు భారతీయ సైనికులకు అండగా నిలిచి వారిలో మరింత ఉత్తేజాన్ని కల్గించిన ఏకైన ప్రధాని మోడీయే నన్నారు. ఒకప్రక్క కరోనా

మహమ్మారి విజృంభణ జరుగుతుండగానే మరోప్రక్క చైనా సరిహద్దుల్లో చేస్తున్న దొంగ దెబ్బలను సమర్ధవంతంగా త్రిప్పికొట్టగలడం అభినందనీయమన్నారు.  

కేంద్రంలో

అత్యధిక మెజారిటీ తో రెండవసారి ఏర్పడిన బీజేపీ (నరేంద్ర  à°®à±‹à°¡à±€ ) ప్రభుత్వం à°’à°• సంవత్సరం పూర్తయిన సందర్భంగా మోడీ 2.0 కార్యక్రమంలో à°ˆ ర్యాలీ ని చేపట్టారు.  

à°ˆ

వర్చువల్ ర్యాలీ సిస్కో వెబెక్స్, పేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం చేసారు. ఈ ర్యాలీ లో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు

కన్నా లక్ష్మీనారాయణ, రాజ్య సభ సభ్యుడు సి. à°Žà°‚ రమేష్, జాతీయ మహిళా మోర్చా కన్వీనర్ à°¡à°¿. పురందేశ్వరి,  à°°à°¾à°·à±à°Ÿà±à°° ఉపాధ్యక్షుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు

పాల్గొన్నారు. 

à°ˆ సమావేశంలో విశాఖ కేంద్రం నుంచి మాజీ ఎంపీ డాక్టర్ కె. హరిబాబు,  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ పివిఎన్  à°®à°¾à°§à°µà±, మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, బీజేపీ

రాష్ట్ర కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథ రాజు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు à°Žà°‚. రవీంద్ర రెడ్డి,  à°°à°¾à°·à±à°Ÿà±à°° అధికార ప్రతినిధి కె సుహాసిని ఆనంద్, రాష్ట్ర కార్యవర్గ

సభ్యులు  à°ªà°¿à°µà°¿ నారాయణ రావు, ఎస్వీఎస్ ప్రకాష్ రెడ్డి,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

వర్చువల్ ర్యాలీ లు ఇవే: . . .

కోవిడ్ 19 విజృంభిస్తున్న తరుణంలో ప్రత్యక్షంగా

బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేనందున బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కీలక ప్రసంగం చెయ్యవలసిన నేతలందరూ ఒక వేదిక పై ఉండి నేరుగా వీడియో ద్వారా

ప్రత్యక్ష ప్రసారం జరిగేలా ఏర్పాటు చేసారు. ఈ సమయంలో అన్ని జిల్లాల కార్యాలయాలు, మండల కేంద్రాలు, నాయకుల కార్యాలయాల ద్వారా ఈ సమావేశాన్ని వీక్షించడం జరుగుతుంది.

తద్వారా కనీస దూరం తో పాటు, అత్యంత సురక్షితంగా ఉంటుందని ఏర్పాటు చేసారు. అదే సమయంలో తమ కార్యకర్తలకు, నేతలకు పార్టీ అధిష్టానం ఇవ్వవలసిన సూచనలు, సందేశాలను

అందించగలుగుతుంది. ఢిల్లీ నుంచి కొన్ని రాష్ట్రాల నేతలతో ఇప్పడికే హైటెక్ బహిరంగ సమావేశాలు జరిగాయి వీటిలో దేశ హోమ్ శాఖా మంత్రి అమిత్ షా వంటి నేతలు సైతం

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam