DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా సంరక్షణ భాద్యత వైఎస్ జగన్ తీసుకున్నారు, మంత్రి పేర్ని

*వైఎస్సార్ చేయూత పథకానికి రాష్ట్ర కెబినెట్ ఆమోదం.*

*నిస్వార్ధ.  à°•à°šà±à°šà°¿à°¤à°®à±ˆà°¨ విలేఖరులకే అక్రిడైటేషన్ లు ఇస్తాం :*

*చంద్రబాబు పాలనలో పథకాలపై పూర్తి

విచారణకు ఆదేశం.*

*రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పేర్ని నాని వెల్లడి.* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*. . . 

*అమరావతి,  à°œà±‚న్  11, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్ర ప్రజల

సంరక్షణ భాద్యతలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారని, రాష్ట్ర సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని) తెలిపారు. గురువారం జరిగిన

రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో చిన్న వృత్తులు చేసుకునే వారికి à°…à°‚à°¡à°—à°¾ రూ. 10  à°µà±‡à°²à± ఆర్ధిక

సాయాన్ని చేసేందుకు వైఎస్సార్ చేయూత పథకానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. 

నిజాయితీగా ఉన్న పాత్రికేయులకే à°…క్రిడైటేషన్ లు : . . .

కేవలం పాత్రికేయ

వృత్తిపైనే ఆధారపడి విధులు నిర్వహించే పాత్రికేయులకు ఈ ఏడాది నుంచి అక్రిడైటేషన్ లు ఇవ్వడం జరుగుతుందని, దాని పై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని తెలిపారు. అయితే

పత్రిక రంగంలో విధులు నిర్వర్తిస్తూ, వార్తలను ప్రజలకు చేరవెయ్యాలి అనే లక్ష్యంతో పనిచేసేవారికి మాత్రమే పత్రిక రంగంలో గుర్తింపు ఉండాలని తీర్మానించినట్టు

తెలిపారు. అంతేతప్ప విలేకరి ముసుగులో పైరవీలు చేసేవారికి, సచివాలయంలో సొంత పనులు చేసుకునే వారికి అడ్డుకట్ట తప్పదని తెలిపారు. నిజాయితీగా ఉన్న పాత్రికేయులకు

à°…à°‚à°¡à°—à°¾ నిలబడతామన్నారు. 

సమావేశంలో చర్చించిన అంశాలని వెల్లడించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల ఆర్థిక సాయం అందించనున్నారు.

 

వచ్చే ఆగస్టు 12న పధకం సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కెబినెట్ లో చర్చ జరిగింది.

విభజన హామీల్లో భాగంగా

రామాయపట్నం పోర్టుకి కేంద్రం నిధులివ్వాల్సి ఉందని అభిప్రాయపడింది. 

కేంద్ర నిధుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ప్రాజెక్టుపై ముందుకెళ్లాలని కెబినెట్

నిర్ణయం.

ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణం.

మొదటి దశలో 4736 కోట్ల వ్యయంతో నిర్మాణం.

రామాయపట్నం ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలని

అధికారులకు సీఎం జగన్ సూచన.

రామాయపట్నం పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపాలని సీఎం జగన్ ఆదేశం.

10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్

నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

డిస్కమ్, ట్రాన్స్కో లకు 6 వేల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ నిధుల ఖర్చుకు కేబినెట్ ఆమోదం

16 నుంచి మూడు రోజుల పాటు శాసన సభా

సమావేశాలు నిర్వహణకు కేబినెట్ ఆమోదం

10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 

వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ

పోషణ ప్లస్ పథకాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనికై రూ. 1863 కోట్లు కర్చు చేసేందుకు ఆమోదం. 

ప్రభుత్వ ఇళ్ళ స్థలాలు, ఇల్లు అమ్ముకునేందుకు 5 ఏళ్ల తర్వాత

హక్కు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం. 

గ్రే హౌండ్స్ కు విశాఖ లో భూమి ని ఉచితంగా ఇచ్చేందుకు క్యాబినెట్ నిర్ణయం. ఈ భూమిలో ఉన్న కుటుంబాలకు పరిహారం కూడా

ఇచ్చేందుకు సుముఖం.  

JNTU కాకినాడ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కురుపాం లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. 

తెలుగు, సంస్కృత అకాడమీలు

తిరుపతి లో ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. 

జగనన్న విద్య దీవెన పథకంలో తల్లుల అకౌంట్ నాలుగు విడుతలగా డబ్బులు వేసేందుకు క్యాబినెట్ ఆమోదం. 

సోలార్ పవర్

యూనిట్ స్థాపనకు పరిపాలన పరమైన ఆమోదం. 

గండికోట రిజర్వాయర్ లో పూర్తి సామర్ధ్యం కోసం అర్ అండ్ అర్, మరియు వెలిగొండ అర్ అండ్ అర్ కు క్యాబినెట్

ఆమోదం 

పన్నులు ఎగవేతను అరికట్టడం కోసం ఏపీ స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటు... 
55 పోస్ట్ లు మంజూరు

చంద్రబాబు పాలనలో ప్రవేశ పెట్టిన చంద్రన్న

కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, తదితర పథకాలపై జరిగిన అవకతవకలపై పూర్తి విచారణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానంగా వేమూరి హరికృష్ణ చేపట్టిన

కాంట్రాక్టు లపై విచారణ జరుగనుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam