DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖే ఏపీ రాజధాని. . గవర్నర్ ప్రసంగం లో వెల్లడి. . .

*ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: గవర్నర్*  

*దేశంలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌ లో  గవర్నర్‌ ప్రసంగం* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  16, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని, రాష్ట్ర గవర్నర్ హరిచందన్

బిశ్వభూషణ్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం ఆయన ప్రసంగించారు. దేశంలోనే  మొట్ట మొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం కరోనా విజృంభణ సమయంలో గవర్నర్ తమ కార్యాలయం నుంచే ప్రసంగించారు. ఈయన చేసిన ప్రసంగం లో గత ఏడాది పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం

చేపట్టిన ఎన్నో పధకాలను ఆయన ఈ సందర్బంగా ప్రశంసించారు. దీనిలో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని, న్యాయ రాజధానిగా కర్నూల్, లెజిస్లేచర్ రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించడం గమనార్హం. అయన ప్రసంగం లోని ప్రధానాంశాలు ఇవే . . . .

మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాం
జల, ఖనిజ వనరులను

సద్వినియోగం చేసుకుంటున్నాం 
విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం
అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు
ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యత
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ

పథకాలు
18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్
రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం వృద్ధి. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి
 వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి
122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి
 మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన
 దశల వారీగా మూడేళ్లలో 45 వేల

పాఠశాలల అభివృద్ధి
 వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు
 హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు
 వైఎస్‌ఆర్‌ కంటి వెలుగుతో 67 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు
 విజయవంతంగా కొనసాగుతున్న వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌
 నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను

జాతీయ స్థాయిలో అభివృద్ధి
 వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు 13,500 సాయం
 కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నాం
 కరువు పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ. 2వేల కోట్ల విపత్తు సాయం
 ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా
 ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు

ఇళ్ల పట్టాలు
 వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కింద 50 లక్షల మందికి లబ్ధి..ఇంటి వద్దే పెన్షన్‌ అందిస్తున్నాం
 సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు
 సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.900 కోట్ల సాయం
 గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు త్వరలో వైఎస్‌ఆర్‌ జనతా బజార్‌లు
 ఇళ్ల

పట్టాలు, సంక్షేమ పథకాలు మహిళల పేరుతో ఇవ్వడం ద్వారా మహిళా అభ్యున్నతికి చర్యలు చేపడుతున్నాం

 ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు 
 బలహీనవర్గాల అభ్యున్నతికి 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు, పనులు
 అత్యాచారాల నిరోధానికి దిశ చట్టం 
 పట్టణాల్లో రక్షిత మంచినీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం 
/>  2021 డిసెంబర్‌లోగా పోలవరం పూర్తి 
 వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం 
 రివర్స్‌ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశాం
 రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల నిర్మాణం
 పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3200 కోట్లు 
 పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త

పారిశ్రామిక విధానం 
 కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.. రోజుకు 15 వేల టెస్ట్‌లు
 ఇప్పటికే 5.5 లక్షల టెస్ట్‌లు చేశాం 
 జాతీయ సగటు కంటే ఏపీలో రికవరీ రేటు అధికం 
 38 వేల ఐసోలేషన్ బెడ్స్‌ సిద్ధం.. 1300 వెంటిలేటర్లు ఉన్నాయి
 24 వేల మంది వైద్యులు..24500 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు
 గ్రామ

వాలంటీర్లు, పోలీసులు సమర్ధవంతంగా పనిచేశారు 
 3.2 లక్షల మంది వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు భరించాం 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam