DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అచ్చెన్న, జెసి ల అరెస్ట్ పై హెచ్ ఆర్ సి కి ఫిర్యాదు

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  17, 2020 (డిఎన్ఎస్):* తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ ల అరెస్టు తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసారు.  అచ్చెన్నాయుడు అరెస్టు తీరు పై టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు ఫిర్యాదు చేసారు. జేసీ

కుటుంబ సభ్యులు అరెస్టు లై ఎమ్మెల్సీ గౌరివాణి శ్రీనివాసులు ఫిర్యాదు చేసారు. వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ వాదాన్ని సాగిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రతీకార చర్యలతో  మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం నేతలు, క్యాడర్ పై హింస కొనసాగిస్తోందన్నారు. తప్పుడు కేసులు

పెట్టి బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసారు. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు ని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అరెస్టులో వైకాపా ఆదేశాలకు అనుగుణంగా ఎసిబి అధికారులు వ్యవహరించారని వివరించారు. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. శస్త్రచికిత్స గాయం తో బాధపడుతున్న అచ్చెన్నాయుడు ను శ్రీకాకుళం నుండి దాదాపు 600

కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణింప చేశారు. అరెస్టు అమానుషమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. వైకాపా వ్యూహాలను అనుసరిస్తూ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు గా అరెస్టు తీరు  సాధించిందన్నారు. తమ ఒత్తిళ్ళకు లొంగని పార్టీ నేతలను ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వారిని అరెస్టు చేసిందని తెలిపారు. ఇందులో

భాగంగా నే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అష్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతోనే ఈ అరెస్టు లు జరిగాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన లో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేతల విజ్ఞప్తి చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam