DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనాపై అప్రమత్తతే ఆయుధం –  శ్రీకాకుళం జిల్లా కలెక్టర్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 17, 2020 (డిఎన్ఎస్):* కరోనా వైరస్ వ్యాధి భారీన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. ప్రజల అప్రమత్తతే ఆయుధమని పేర్కొన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ

అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బుధ వారం మందస మండల కేంద్రంలో కంటైన్మెంటు జోన్ ను కలెక్టర్ పరిశీలించారు. కంటైన్మెంటు జోన్ లో పాటించాల్సిన నియమాలను అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి వలన జిల్లాలో కేసులు బాగా పెరిగాయని చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి నుండి వచ్చిన వారు

దగ్గరి బంధువులైనా, ప్రాణ స్నేహితులైనా కలవవద్దని హితవు పలికారు. బయట నుండి వచ్చిన వ్యక్తుల కలిసిన వ్యక్తులతోపాటు వారి కుటుంబాలకు, సమాజానికి కూడా కరోనా సోకే అవకాశాలు ఉన్నాయని గ్రహించాలని పేర్కొన్నారు. హోమ్ క్వారంటీన్ లో ఉండుటకు అంగీకార పత్రం ఇచ్చిన వ్యక్తులను హోమ్ క్వారంటీన్ కు పంపిస్తున్నామని వారు విధిగా హోమ్

క్వారంటీన్ ను పాటించాలని కోరారు.  హోమ్ క్వారంటీన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సారవకోట మండలంలో ఒక వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసామని ఆయన స్పష్టం చేసారు. హోమ్ క్వారంటీన్ ను 14 రోజులు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు ఇష్టానుసారం బయటకు రావడం హానికరమని పేర్కొన్నారు. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా

తగ్గిందని భావిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ప్రజలు బయట పనులను త్వరగా ముగించుకుని ఇంటి వద్ద ఉండాలని ఆయన సూచించారు. ప్రతి వ్యక్తి మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వినియోగించాలని తెలిపారు. మాస్కులు ధరించని వారికి అపరాధ రుసుము వేయడం జరుగుతుందని చెప్పారు. తాజా

చేపలు కొనుగోళు చేయాలనే తాపత్రయంతో ప్రజలు కరోనా ప్రమాదాన్ని మరచిపోతున్నారని కలెక్టర్ అన్నారు. తాజా చేపల కొనుగోళుకు వెళ్ళి – తాజాగా కరోనా పాజిటివ్ గా మారవద్దని ఆయన కోరారు. చేపలు, కూరగాయల మార్కెట్ ల వద్ద భౌతిక దూరం పాటించుటకు మార్కింగు వేయాలని, మద్యం దుకాణాల వద్ద విధిగా దూరం పాటించాలని, మాస్కులు, గొడుగులు

ధరించాలని అన్నారు.  మీ రక్షణ, మీ కుటుంబ రక్షణను గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఒకటి, రెండు వారాల్లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభం అవుతుందని చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చే వారిని వారి ఇంటిలోనే చికిత్స చేయించుటకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ ఆసుపత్రిలో తీవ్రత అధికంగా ఉండే కేసులను

మాత్రమే చికిత్స చేసి మిగిలిన వారిని ఇంటి వద్దనే చికిత్స అందించనున్నామని అన్నారు. 
    కంటైన్మెంట్ జోన్లలో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కంటైన్మెంట్ జోన్ల నుండి ఎవరూ బయటకు రాకూడదని, ఎవరూ లోనికి వెళ్లరాదని స్పష్టం చేసారు. ఆ ప్రాంత వాసులకు నిత్యావసరాలు, తాగు నీరు, సరుకులను

మోబైల్ ద్వారా అందించాలని పేర్కొన్నారు. కంటైన్మెంటు జోన్లలో జ్వరం, దగ్గు, ఆయాసం తదితర రుగ్మతలతో ఉన్నవారిని, వృద్ధులను గుర్తించాలని వారిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, అదనపు డి.ఎం.హెచ్.ఓ డా.బి.జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam